యేసు ఒక కథ చెప్పాడు.
ఒక ధనికునికి యిద్దరు పిల్లలు ఉన్నారు. చిన్నవాడు వాళ్ళ నాన్నతో గొడవపడి, ఆస్తిలో తన వాటా తీసుకొని, దూరంగా వెళ్ళి, డబ్బంతా ఖర్చుచేశాడు. కాని పెద్ద వాడు మాత్రం నాన్నతోనే ఉన్నాడు.
కొన్నిరోజుల తర్వాత చిన్నవాడు అంతా కోల్పోయి, తప్పు చేసానని తెలుసుకొని తిరిగి నాన్న దగ్గరికి వచ్చాడు. మంచివాడైన ఆ తండ్రి జాలిపడి, మరుమాట్లాడకుండా సంతోషంతో దగ్గరకి తీసుకొని పెద్ద విందు కూడా చేశాడు.ఇలా చేస్తున్నందుకు పెద్దోడికి చాలా కోపం వచ్చింది,ఇలాంటి వాడికి ఈ విధంగా చేసావు, కాని నా విషయంలో ఎప్పుడూ ఇలా చెయ్యలేదని తండ్రితో వాగ్వివాదానికి దిగి ఇంట్లో కూడా రాలేదు.
కారణం..తమ్ముడుతో తనను తాను పోల్చుకొన్నాడు.
"నేను తమ్ముడులాంటోడ్ని కాదు..చాలా మంచోడ్ని! వాడు చేసిన తప్పులు ఎన్నడూ నేను చేయ్యలేదు!!" అనుకొన్నాడు.
ఇది స్వంత నీతి. దీనితో ఎవ్వడూ దేవుని రాజ్యంలోకి రాడు.దేవుని కొలత మన ప్రక్కన ఉన్నవాడు కాదు..దేవుని నీతి.నిజానికి అతను పోల్చుకోవాల్సింది తండ్రితో! ఆయన ప్రేమను,జాలిని, మంచితనాన్ని, క్షమాపనని చూసి నేర్చుకువాల్సింది.
దేవుడు ఈ కథ చెప్పింది ఎదుటి వారి కంటే మేము మంచివారమే అని అనుకోనేవారితో. దేవుని మనస్సు పొందకుండా, స్వనీతిని(మంచిపనులు/ మంచిపేరు/భక్తి/దేవుని సేవ)బట్టి సంతోషిస్తే..దేవునితో నాకు అవసరం లేదని చెప్పకనే చెప్తుంటాము. ఆరోగ్యంగా ఉన్నాననుకొనే రోగికి, డాక్టరుతో పనేంటి?అలాగే నేను (మిగితా వారికంటే) బాగున్ననని భ్రమపడే వారికి కూడా దేవుని అవసరం ఉండదు!
ఏ విషయాన్ని బట్టి ఎదుటి వారితో పోల్చుకొని గర్వపడొద్దు. కాని దేవుని మనస్సును ధరించుకొందాం. నీతిమంతులుగా నటించేవారిని(భక్తి ముసుగులో ఉన్న వేషధారనను) దేవుడు అసహ్యించుకొంటాడు, కాని తప్పుచేసినవారి పట్ల కనికరంతో ఎదురుచూస్తుంటాడు. GOD LOVES YOU !!!
ఒక ధనికునికి యిద్దరు పిల్లలు ఉన్నారు. చిన్నవాడు వాళ్ళ నాన్నతో గొడవపడి, ఆస్తిలో తన వాటా తీసుకొని, దూరంగా వెళ్ళి, డబ్బంతా ఖర్చుచేశాడు. కాని పెద్ద వాడు మాత్రం నాన్నతోనే ఉన్నాడు.
కొన్నిరోజుల తర్వాత చిన్నవాడు అంతా కోల్పోయి, తప్పు చేసానని తెలుసుకొని తిరిగి నాన్న దగ్గరికి వచ్చాడు. మంచివాడైన ఆ తండ్రి జాలిపడి, మరుమాట్లాడకుండా సంతోషంతో దగ్గరకి తీసుకొని పెద్ద విందు కూడా చేశాడు.ఇలా చేస్తున్నందుకు పెద్దోడికి చాలా కోపం వచ్చింది,ఇలాంటి వాడికి ఈ విధంగా చేసావు, కాని నా విషయంలో ఎప్పుడూ ఇలా చెయ్యలేదని తండ్రితో వాగ్వివాదానికి దిగి ఇంట్లో కూడా రాలేదు.
కారణం..తమ్ముడుతో తనను తాను పోల్చుకొన్నాడు.
"నేను తమ్ముడులాంటోడ్ని కాదు..చాలా మంచోడ్ని! వాడు చేసిన తప్పులు ఎన్నడూ నేను చేయ్యలేదు!!" అనుకొన్నాడు.
ఇది స్వంత నీతి. దీనితో ఎవ్వడూ దేవుని రాజ్యంలోకి రాడు.దేవుని కొలత మన ప్రక్కన ఉన్నవాడు కాదు..దేవుని నీతి.నిజానికి అతను పోల్చుకోవాల్సింది తండ్రితో! ఆయన ప్రేమను,జాలిని, మంచితనాన్ని, క్షమాపనని చూసి నేర్చుకువాల్సింది.
దేవుడు ఈ కథ చెప్పింది ఎదుటి వారి కంటే మేము మంచివారమే అని అనుకోనేవారితో. దేవుని మనస్సు పొందకుండా, స్వనీతిని(మంచిపనులు/
ఏ విషయాన్ని బట్టి ఎదుటి వారితో పోల్చుకొని గర్వపడొద్దు. కాని దేవుని మనస్సును ధరించుకొందాం. నీతిమంతులుగా నటించేవారిని(భక్తి ముసుగులో ఉన్న వేషధారనను) దేవుడు అసహ్యించుకొంటాడు, కాని తప్పుచేసినవారి పట్ల కనికరంతో ఎదురుచూస్తుంటాడు. GOD LOVES YOU !!!
Comments
Post a Comment