దేవుడు ఇశ్రాయేలీయులతో౼"ఇదిగో వినండి! నేను కానాను దేశాన్ని మీకు అప్పగించాను. మీరు అందులో ప్రవేశించి ఆ దేశాన్ని మీ స్వాధినం చేనుకోండి. మీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకూ వారి తరువాత వారి సంతానానికీ ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి!" (ద్వితియో 1:8)
--కనాను దేశాన్ని అబ్రాహాముకు, అతని సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు(ఆది 13:12-17).ఇక కనాను వారి సొత్తు. ఇప్పుడు సుమారు 400 సం|| తర్వాత ఐగుప్తు భానిసత్వ సంకెళ్ళను తెంచుకుని ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశమైన కనానుకు ప్రయణమయ్యారు. పైన చెప్పిన మాటలు అప్పుడు దేవుడు వారితో పలికిన మాటలు.ఐతే కనానులో నివసిస్తున్న ప్రజలు బలవంతులు, గొప్ప దేహదారుడ్యం గల వారు(సంఖ్యా 13:28,31).
--దేవుడిచ్చిన వాగ్దానం స్వతంత్రించుకొనే నిమిత్తం భానిసత్వపు సంకెళ్ళు తెంచబడ్డాయి. ఆ ప్రదేశాన్ని బలమైన శత్రువుచే ఆక్రమించబడివుంది.ఆయన వాగ్దానం నిలచి ఉంది. ఇక ఇప్పుడు మిగిలివుంది విశ్వాసంతో స్వాధీన పర్చుకోవటమే! ఇశ్రాయేలు ముందు ఉంచబడిన సవాలు౼'విశ్వాసం'. కానీ వారిలో చాలా మంది దేవుణ్ని నమ్మలేకపోయ్యారు. వారిలో నమ్మిన వారు మాత్రమే ప్రవేశించగలిగారు.
--ఈ మాటలు చదువుతున్నప్పుడు మన మనస్సులో మెదిలే ఆలోచన౼'సువార్త'. కానీ క్రొత్తనిభంధన మొదట దాని గూర్చి చెప్పట్లేదు. నిన్ను ఆక్రమించి, తిష్టవేసిన శత్రువైన సాతాను క్రియలను గూర్చి మాట్లాడుతుంది(శరీర క్రియలు). దేవుని వాగ్దానం పరిశుద్దాత్ముడు(అపో 2:17, 33). ఏదెను తోటలో వశమైన శత్రువు అక్రమనని మళ్ళీ స్వాధీనం చేసుకొమ్మని దేవుడు క్రొత్తనిభంధనలో చెప్పాడు. పరిశుద్ధ జీవితం మన సొత్తు.అది మన పట్ల దేవుని చిత్తం(1పేతురు 1:16).దేవుని ఆత్మ ద్వారా శరీర క్రియలు చంపవొచ్చని, దైవగ్రంధంలో దేవుని ఆత్మ ప్రేరణచేత దేవుడే వ్రాయించాడు(రోమా 8:11-13, గలతి 5:13,16-18)
--"ఇది అసాధ్యం..ఇది జరగదు..ఎన్నో మార్లు నేను ఓడిపోయాను..నా శక్తికి మించింది" అని ఇశ్రాయేలీయుల వలె చెప్పొద్దు! నీ పాపపు సంకెళ్లను తెంచి, ఆయన బిడ్డగా చేసుకొన్న సమర్ధుడైన సర్వశక్తునికి అది అసాధ్యం కాదు. విశ్వాసమే మన ముందున్న సవాలు. విశ్వాసంలో శక్తి దాగివుంది(రోమా 4:21, హెబ్రీ 11:11). నాడు విశ్వసించిన వారు వాగ్దాన దేశంలో ప్రవేశించినట్లు, నేడు క్రొత్తనిభంధన వాగ్దానాలోకి కూడా విశ్వసించిన వారే ప్రవేశిస్తారు. దేవుని అనాధికాల సంకల్పం మనం ఆయనను పోలి ఉండటమే!
--మొదట నువ్వు దేవునికి కావాలి, ఆ తర్వాతే సేవ. సువార్త౼'క్రీస్తు పాపాలను క్షమిస్తాడు' వరకు ఆగిపోకూడదు, వాటి నుండి విడిపిస్తాడని చెప్పాలి. అపవాది ఆక్రమించిన వాగ్దాన భూమిని(శరీరాత్మలను) దేవుని ఆత్మ చేత, విశ్వాసంతో తిరిగి దేవునికి ఇష్టపూర్వకంగా స్వాధీనం చెయ్యాలి. ఇందు కోసమే కదా, క్రీస్తు సిలువలో చనిపోయి, తిరిగి లేచాడు. అలాంటి విజయవంతమైన క్రైస్తవ జీవితంలోకి దేవుడు మనల్ని నడిపించును గాక!(దయచేసి రిఫెరేస్సులను చదవండి)
Comments
Post a Comment