గేహజీ౼“గురువు గారు నయమాను తెచ్చిన వాటిని తీసుకోకుండా అతణ్ణి ఊరికే వెళ్ళనిచ్చాడు. యెహోవా జీవము తోడు, నేను అతడివెంట పరుగెత్తి అతడి నుంచి ఏదైనా తీసుకుంటాను" అనుకొని వెళ్ళి, నయమానుకు ఎలీషా తీసుకురమ్మానాడని అబద్ధమాడి, రెండు జతల విలువైన దుస్తులనూ, డెబ్భై కిలోగ్రాముల వెండి రెండు సంచుల నిండా తీసుకొని వచ్చి దాచి, ఏమీ తెలియనట్లు ఎలీషా ముందుకు తిరిగి వచ్చాడు.
ఎలీషా౼“గేహజీ, నీవు ఎక్కడికి వెళ్లావు?"
గేహజీ౼“నీ దాసుడైన నేను ఎక్కడికీ వెళ్ళలేదు"
ఎలీషా౼"నయమాను నిన్ను కలుసుకోవడానికి రథం దిగినప్పుడు, నా హృదయం నీతో వున్నది. వెండి, దుస్తులు, ఒలీవచెట్ల తోటలు, ద్రాక్షతోటలు, గొఱ్ఱెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఇప్పుడు నయమానుకు ఉన్న కుష్ఠు నీకూ, నీ సంతానానికీ సోకుతుంది" అన్నాడు.
మంచులాగా తెల్లటి కుష్ఠు పుట్టి గేహజీ ఎలీషా ముందు నుంచి బయటికి వెళ్ళాడు.
❇

-- నిజానికి దేవుడు గేహజీ పట్ల ఎంతో కృప చూపించాడు. దైవజనుడైన ఎలీషా, ఆయన గురువు గారైన ఏలీయాకు సేవ చేసినట్లు, దేవుడు గేహజీని ఏలీషా దగ్గర ఉంచాడు. ఏలీషా భూసంభంధమైన విషయాల కంటే ఎప్పుడూ ఆధ్యాత్మిక విషయాలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చాడు(1 రాజులు 19:19-21, 2 రాజులు 2:9, 5:16). గురువును చూసి ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకోల్సింది. కాని గొప్ప దేవుని సేవకునితో కలిసి ఉంటూ, తన మనస్సు అంతా ఈ లోకసంభంధమైన విషయాలపైనే నిలిపాడు.
-- అబద్దాలు, మోసం, ధనాశ ఇతని హృదయాన్ని ఆక్రమించాయి. కృపను దుర్వినియోగ పర్చుకున్నాడు. విలువైన చోట(విలువైన విషయాల్లో పాలినవారై), దానికి తగిన జీవితాన్ని జీవించకపోవటం వల్ల వాని ఆత్మకు మరి ఎక్కువ కీడు రావటం మనం గమనించవచ్చు. ఎలీషా తరువాత ప్రవక్తగా ఉండాల్సిన వాడు ఆ కృపను కోల్పోయాడు.
--మనకున్న జీవితం ఒక్కటే. ఆత్మీయ జీవిత పరుగు ఒక్కటే. తర్వాత మన పుస్తకం మూయబడుతుంది. మనకు ముందు అనేకులు దేవునికి నమ్మకమైన సాక్షులుగా వారి పరుగు ముగించారు (హెబ్రీ 12:1). మరికొందరి జీవితాలు హెచ్చరికతో ముగిశాయి. నీ జీవితం ఎలా ముగించబడాలని కోరుకుంటున్నావు(సేవ గురించి కాదు..జీవితం గురించి)? ఎలీషా వలెనా? గేహజీ వలెనా?

దేవుడు-"ఇదిగో విను, నేను త్వరగా వస్తున్నాను. నీ కిరీటం ఎవ్వరూ తీసుకోకుండా నీకున్నదానిని గట్టిగా చేపట్టుకొని ఉండు" (ప్రకటన 3:11)
Comments
Post a Comment