
ఆయన "ఈ వ్యక్తిని వదిలి బయటకు రా" అని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞ ఇచ్చాడు..."పాతాళంలోకి వెళ్ళమని తమకు ఆజ్ఞ ఇవ్వవద్దని" దెయ్యాలు ఆయనను ఎంతో బతిమాలాయి.పందుల మందలో చొరబడడానికి అనుమతినిమ్మని ఆయనను బతిమాలినప్పుడు ఆయన వాటికి అనుమతినిచ్చాడు. వెంటనే ఆ మంద ఎత్తైన కొండపై నుండి పరుగెత్తుకుంటూ వెళ్లి సరస్సులో పడి ఊపిరి ఆడక చచ్చాయి.
ఆ పందుల్ని మేపుతున్న వారు వెళ్ళి, పట్టణంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ జరిగిందంతా చెప్పారు.ఆ ఊరి ప్రజలు యేసు దగ్గరకు వచ్చి, అక్కడ దయ్యాలు వదిలిన వాడు బట్టలు కట్టుకుని స్థిమితంగా యేసు పాదాల దగ్గర కూర్చుని ఉండటం చూసి భయపడి, తమను విడిచి వెళ్ళమని ఆయనను బతిమాలుకున్నారు.
ఆయన తిరిగి పడవ ఎక్కి వెళ్లబోతుంటే దయ్యాలు విడిచిన వ్యక్తి తనను కూడా ఆయనతో ఉండనిమ్మని బతిమాలాడు. కానీ ఆయన "నువ్వు నీ ఇంటికి వెళ్లి దేవుడు నీకు చేసిన గొప్ప విషయాలను చెప్పు" అని వాణ్ణి పంపి వేశాడు. వాడు వెళ్లి యేసు తనకు చేసిన గొప్ప కార్యాన్ని గురించి ఆ పట్టణమంతా ప్రకటించాడు.
❇


దేవునికి లోబడకుండా, మన సొంత కోరికల కోసం చేసే ప్రార్థనలు, అవి పొందుకున్నప్పుడు..మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడని, మనం ఆయన చిత్తంలో ఉన్నామని భ్రమపడకూడదు. ఆయన చిత్తం చేసే ఉద్దేశ్యం లేని వారి జీవితంలో దేవుడు బలవంతంగా కలుగజేసుకోడు. పై విధంగా వారి కోరికలను మన్నించవచ్చు, కానీ వారి ఆత్మలకు కీడు జరగవచ్చు.


Comments
Post a Comment