Skip to main content

25Apr2018

✴️ అబ్రాముకు అతని భార్యయైన శారయి వల్ల పిల్లలు పుట్టలేదు. ఆమె దగ్గర ఐగుప్తు దేశానికి చెందిన హాగరు అను ఒక దాసి ఉంది.
శారయి అబ్రాముతో౼ "ఇదుగో, యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు. నువ్వు నా దాసి దగ్గరికి వెళ్ళు. ఒకవేళ ఆమె ద్వారా నాకు పిల్లలు పుట్టవచ్చేమో" అంది. అబ్రాము శారయి మాట విన్నాడు.(ఆది 16:1,2) ✴️


■ రాహేలు, లేయాలు కూడా సరిగ్గా ఇలాగే యకోబుకు సలహా ఇచ్చారు(ఆది 30:3,9). కానీ దేవుడు వారిని తప్పు పట్టినట్లుగా చూడము. వారి దాసీలకు పుట్టిన పిల్లలను కూడా తక్కిన వారితో సమాన గోత్రాలుగా దేవుడు చేశాడు. ఎందుకంటే అబ్రాము విషయంలో పుట్టబోవు సంతానం గూర్చి స్పష్టమైన దేవుడు వాగ్ధానం ఉంది. అబ్రాము విశ్వాసంతో కనిపెట్టి ఆ వాగ్ధానం పొందుకోవాలి. దేవుని వాక్కు ఎవరికి స్పష్టంగా తెలియజేయబడుతుందో (ప్రత్యక్షత) వారి నుండి దేవుడు ఎక్కువ విధేయతను ఎదురుచూస్తాడు. దేవుడు అబ్రాముతో సంతానం గూర్చి వాగ్దానం(నిబంధన) చేశాడు. సుమారు 10 సం|| ల తర్వాత కూడా పిల్లలు కలుగనందుకు అబ్రాము, అతని భార్యయైన శారయిల విశ్వాసం సన్నగిల్లి పోయింది(ఆది 15:2,16,2). శారయి తనకు ఇక పిల్లలు పుట్టరని దృఢ నిర్ణయానికి వచ్చినదై, అబ్రాముకు పైన చెప్పినట్లుగా సలహా ఇచ్చింది. ఐతే తన భార్య సలహాను దేవుని సన్నిధిలో పెట్టవాల్సింది పోగా ఆమె మాట విన్నాడు. దేవుడు కేంద్రంగా లేని మరియు భార్యకు శిరస్సుగా ఉండని భర్త, దేవుని చిత్తాల నుండి ఆ కుటుంబాలు వైదొలుగుతారు. భార్యను ప్రేమించాలనే ఆజ్ఞ భర్తకు ఇవ్వబడినప్పటికీ, దేవుని స్థానాన్ని ఆమె తీసుకోకూడదు. అనగా దేవుని మాటను పెడచెవిన పెట్టి ఆమె మాట వింటూ, దానిని ప్రేమ అనుకోవద్దు. మొదటి కుటుంబం ఆవిధంగానే దేవుని శాపాన్ని మూటగట్టుకుంది(ఆది 3:17).

■ దేవుడు కేంద్రంగా మన కుటుంబాలు ఉండాలని ఆశిస్తే, ప్రతి విషయం దేవుని ముందు-ఆయన ఆమోదం కొరకు ఉంచవల్సిన వారము. భార్య సహకారిగా ఇవ్వబడింది. దేవునిలో నుండే భార్యను ప్రేమించాలి. భర్త ఆమె సలహాలను, సూచనలను దేవుని సన్నిధిలో ఉంచాలి(మంచి చెప్పినప్పటికిని). భార్య/భర్త దేవుని వైపు చూడక సాతాను శోధన వల్ల నిరుత్సాహపు మాటలను మాట్లాడితే లేక సొంత జ్ఞానంతో ప్రణాళికలను వేస్తుంటే, భాగస్వామియైన మరొకరు(భార్య/భర్త) దేవుని వైపు చూపాలి. వారి ఆందోళనల నుండి, తొందరపాటు నుండి నిమ్మళ పర్చాలి. దేవుని వాక్యం వైపు చూపి నిరీక్షణతో ధైర్యపర్చాలి. అలా అపవాదికి కుటుంబంలో చొరపడకుండా కాపాడుకోగలం. అబ్రాము చేసిన ఆ తప్పు వలన శరీర సంభంధంగా పుట్టిన మరొక జనాంగం ఉనికిలోకి వచ్చింది. చిన్న తప్పుడు తీర్మానాల యొక్క ఫలితం ఎంతో గొప్ప నష్టాన్ని మిగల్చగలవు.

■ ఆ తర్వాత రోజుల్లో శారా అబ్రాహముకు మరొక సలహా ఇవ్వగా దేవుడే ఆమె మాట వినమని చెప్పాడు (ఆది 21:12). అప్పటికే అబ్రాహాము ఆ పాఠం నేర్చుకున్నాడు. అవును భార్య/భర్త మాటలను దేవుడు ఆమోదించాలి. లేదా అలాకాకుండా ఆయన మరొక వైపు కూడా నడిపించ వచ్చును. తుదకు భర్త కుటుంబం పక్షాన తీర్మానాన్ని తీసుకుంటాడు. కుటుంబం గూర్చిన జవాబుదారీగా పూర్తి బాధ్యతను దేవుని యెదుట భర్త వహిస్తాడు (ఎవ్వరి మీద సాకుగా చూపడానికి దేవుడు అనుమతించడు). ఇది దేవుడు నియమించిన క్రమము. కనుక దేవుని వైపు చూస్తూ మన కుటుంబాలను కట్టుకునే వారముగా ఉండాలి. నా కుటుంబం పరిపూర్ణులమని చెప్పట్లేదు గాని ఆ మార్గంలో ప్రయాణిస్తూ, నేర్చుకుంటున్నామని చెప్తున్నాను.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...