Skip to main content

01Apr2018

✴️యేసు పేతురుతో౼"తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా" అనెను (యోహాను 18: 11)
యేసు పిలాతుతో౼"పైనుండి నీకు ఇయ్యబడియుంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు" (యోహాను 19:11) ✴️

■ యేసు తాను ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆయనకు తెల్సు. ఆదిలో తండ్రియైన దేవుని రక్షణ ప్రణాళికల ఏర్పాటును, లేఖనాల్లో వ్రాయబడిన క్రీస్తు మరణంను, అందులో నెరవేరబోతున్న దేవుని ఉద్దేశ్యాలను ఆయన సంపూర్ణంగా యెరిగివున్నాడు. నమ్మక ద్రోహం చేసిన యూదాపై ఆయన కోప్పడలేదు, మత పెద్దలతో వాదనకు దిగలేదు, ఇది అన్యాయపు తీర్పు అని పిలాతు ముందు గొంతెత్తి చెప్పలేదు. ఎందుకంటే సిలువ దేవుని ప్రణాళిక! దేవునిచే అనుగ్రహింప బడిన పాత్ర!  కనుకనే ఆయన దృష్టి మొత్తం సిలువలో దేవుని ప్రణాళికలపైనే (లేఖనాల నెరవేర్పు పైనే) ఉన్నది, కాని యూదా ద్రోహంపై గాని, భ్రష్ట హృదయాలతో మతనాయకులు చేస్తున్న పనులపై గాని లేదు. అలాగని మనుష్యులు నిర్దోషులని కాదు గాని, అటువంటి వారి విడుదల కోసమే రక్షకునిగా వచ్చాడని ఆయనకు తెలుసు. ఒకవేళ మనుష్యులు ఏమైనా హాని తలపెట్టాలని చూసినా, అది తండ్రి సమయం కాకపోతే ఆయనను వారేమి చేయ లేకపోయారు. దేవుడు అనుమతించకుండా ఆయన జీవితంలో ఏమి జరగవని క్రీస్తుకు తెలుసు. పేతురు మానవుని ఆలోచనతో జరుగుతున్న సంగతులను చూశాడు గాని పరలోక దృష్టితో చూడలేకపోయ్యాడు. కనుకనే స్వంత శక్తితో శత్రువులకు సమాధానం ఇవ్వాలని తొందరపడ్డాడు.

■ లోకానుసారుడైన పిలాతు, దేవుణ్ని కానీ, అదృశ్యమైనది-శాశ్వితమైనదియైన దేవుని అధికారాన్ని చూడలేకపోయ్యాడు. క్రీస్తు ఈ లోకంపై తండ్రియైన దేవుని బలమైన అధికారాన్ని స్పష్టంగా చూస్తూ, ఆ అధికారానికి లోబడి ఉన్నాడు. పిలాతు తన అధికారంతో క్రీస్తును విడిపించాలని చూసినప్పటికిని, అది అసాధ్యమని ప్రభువుకు స్పష్టంగా తెలుసు. లోకసంబంధులు దేవుని ఆలోచనలను గ్రహింపలేరు. ప్రతి సమస్యకు లోకపరంగా ఉన్న పరిష్కారాలను, మానవ బల-శక్తియుక్తులు ఆశ్రయించువారై ఉంటారు, గాని ఆత్మ సంబంధమైన సంగతులు చూచునట్లు వారి మనోనేత్రాలు తెరవబడి ఉండవు. ఎందుకంటే ఆత్మ సంభంధమైన సంగతులు దేవుని యందలి విశ్వాసంతో ముడి పడివుంటాయి.

★ ఒకడు ఈ సంగతులు స్పష్టంగా గ్రహించినప్పటికి, తనను తాను దేవుని అధికారానికి లోబర్చుకోకుండా తిరగవచ్చును. దీనికి అల్పవిశ్వాసం, తిరుగుబాటు ధోరణి కారణాలుగా ఉండవచ్చును. దేవుడు తన పిల్లల జీవితంలో ఏమి అనుమతించినప్పటికిని (ఇబ్బందులు, నిందలు, శ్రమలు, మరణము) అందులో మేలు దాచబడివుంటుంది. ఈ లోకం దృష్టిలో 'ఇక ముగిసిపోయింది' అనుకున్న జీవితాన్ని సైతం మహిమా యుక్తంగా దేవుడు మార్చగలడు. క్రీస్తులో, భక్తుల జీవితంలో అదే జరిగింది. ఆత్మీయ నేత్రాలతో దేవుని సంగతులను చూడాలన్నా దేవుడే మన కన్నులు తెరవవాలి! దేవుని అధికారం క్రింద జీవించాలంటే పరిశుద్ధాత్ముని నింపుదల ఖశ్చితంగా అవసరం.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...