Skip to main content

03Apr2018

✴️ఆయన(యేసు) తల్లి మరియకు యోసేపుతో ప్రదానం అయింది, కానీ వారు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆమె భర్త యోసేపు నీతిపరుడు. అందువల్ల అతడు ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా వదిలేద్దామనుకున్నాడు. (మత్తయి 1:18,19) ✴️

■ దేవుని గొప్ప రక్షణ ప్రణాళిక నెరవేరాలంటే ఒక స్త్రీ ఖచ్చితంగా అవమానం పొందావల్సిందే! ఎందుకంటే రక్షకుడు కన్యక గర్భాన పుడతాడని లేఖనం చెప్తుంది. కన్యకయైన ఒక స్త్రీ నేను గర్భవతినై రక్షకుణ్ణి మోస్తున్నానంటే ఎవరు నమ్ముతారు? సహజంగా జరత్వం వల్ల గర్భం ధరించిన స్త్రీల జాబితాలోనే వారిని చూస్తారు, అవమానిస్తారు.లేఖనాలు చదవొచ్చు గాని ఆ లేఖనాల్లో వ్రాయబడినది తన గూర్చే అంటే ఎవరు నమ్మగలరు?
యెషయా౼"మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?" (యెషయా 53:1)

■ దేవుడు తనకు ఇచ్చిన స్థానాన్ని 'మరియ' తీసుకోవాలంటే కేవలం దేవుని పైనే దృష్టి నిలిపి, ఆయన ఆలోచనలనే ఘనంగా ఎంచాలి. అంతేకాదు మనుష్యుల అభిప్రాయాలను, మాటలను భరించడానికి సంపూర్తిగా ఇష్టపడాలి. దేవుని ఆలోచనల్లో నిలవాలంటే, లోక ఆలోచనల్లో నుండి సంపూర్ణంగా వేరవ్వాలి. యోసేపుకు ప్రధానం చేయబడిన మరియకు ఇది అతి పెద్ద సవాలు. ఆమె తన జీవిత భాగస్వామిని కూడా కోల్పోవల్సి ఉంటుంది. తల్లిదండ్రులు, బంధుమిత్రులు, సమాజం నుండి వచ్చే అవమానాలు ఎలా ఉంటాయో మనం ఉహించగలం. జరత్వం చేసిన స్త్రీని చంపివేసే ధర్మశాస్త్రం ఏలుతున్న రోజులవి.  ఇప్పుడు మరియ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి తన స్వంత మార్గం, అనగా యేసేపును వివాహం చేసుకొని అందరి స్త్రీల వలె భర్తతో సంతోషంగా ఉండటం. రెండు దేవుని మాటకు దాసురాలై, ఆమె జీవితంలో సమస్తాన్ని కోల్పోవటానికి తీర్మానం చేసుకోవటం.

■ శ్రమ, నిందలు, అవమానం లేకుండా క్రీస్తు రూపం ఏర్పడదు. సద్భక్తిలో ఇవన్నీ మిళితమై ఉంటాయి. వీటిని తీసుకోవడానికి ఇష్టపడని వారు, లోక మన్ననలో ఆశక్తిపరులు తమ పట్ల ఉన్న దేవుని ఏర్పాటును కోల్పోతారు. 'మరియ' మొదటి మార్గాన్ని ఎంచుకున్నట్లైతే దేవుని గొప్ప ప్రణాళికలను తన జీవితంలో కోల్పోయి ఉండేది. కానీ ఆమె రెండవ మార్గాన్నే ఎంచుకుంది. ఆమె గర్భం లోపట లోక రక్షణను మోస్తున్నప్పటికి, బయట అవమానాలను ఎదురయ్యాయి. నేడు క్రీస్తును ధరించుకున్న  ప్రతి క్రైస్తవుడు కూడా ఇలాగే ఉంటాడు. వారిని శ్రమ పెట్టడానికి లోకానికి ఒక కారణం దొరుకుతుంది, అది అందరి మీద మోపే నేరము వంటిదిగా ఉంటుంది, కానీ వారు మహిమా యుక్తమైన క్రీస్తును తీసుకెళ్ళే వారిగా ఉంటారు.
విశ్వాసి విలువ భూమిపై కాదు పరలోకంలో దేవుని ముందు లెక్కించబడుతుంది. ఆత్మీయులకు ఆత్మసంబంధమైన విషయాలే ఘనంగా ఉంటాయి. వారు వాటిని విశ్వాసం ద్వారా ఆత్మీయ నేత్రాలతో స్పష్టంగా నుండి చూస్తూ, ఈ లోకంను-దాని ఘనతను ఎన్నిక చేయరు. ఒకటి మార్గం కంటితో చూసేది, సులువైనది, మన్నన పొందేది, శరీరం కోరుకునే తమకు నచ్చిన మార్గం. రెండవది మార్గం ఆత్మలో చూసి, విశ్వాసంతో అడుగులేసేది, దేవునిపై దృష్టి నిలిపి శ్రమలను లెక్కచేయనిది. ఇది మనకు ముందున్న విశ్వాస వీరులు నడచిన మార్గం. నేడు వారి ఫలం దేవుని దగ్గర గొప్పది.

★ ఈ మార్గంలో నడవడానికి ఇష్టం పడని విశ్వాసులు సహజంగా కారణాలు వెత్తుకుంటారు. కానీ అవేమి దేవుని ముందు పనిచెయ్యవు. శక్తి చాలకపోతే యదార్ధంగా దేవుని కృప కోసం వేడుకోవాలే కానీ సమర్ధించుకోకూడదు. నీవే మార్గాన్ని కోరుకుంటావు?

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...