❇ ఫిలిష్తీయ సైనికుల గుంపు బేత్లెహేంలో ఉంది. అప్పుడు దావీదు అదుల్లాం గుహలో దాగి ఉన్నాడు. దావీదు సైన్యంలో ముఖ్యులైన ముగ్గురు యోధులు అప్పుడు అతనితో పాటే ఉన్నారు.
దావీదు౼"బేత్లెహేం ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్ళు ఎవరైనా నాకు తెచ్చి ఇస్తే బావుండు!" అని ఆశపడ్డాడు.
ఆ ముగ్గురు యోధులు ప్రాణాలకు తెగించి, ఫిలిష్తీయుల దండులోనికి చొరబడి వెళ్లి, బేత్లెహేం ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్ళు చేదుకొని దావీదు దగ్గరకు తీసికొని వచ్చారు.అయితే అతడు ఆ నీళ్ళు త్రాగడానికి నిరాకరించి దేవుని సన్నిధానంలో పారబోశాడు.
“నేను ఈ నీళ్ళు తాగకుండా నా దేవుడు నన్ను కాపాడుతాడు గాక! వీరు ప్రాణానికి తెగించి వెళ్ళి ఇవి తెచ్చారు. ఇవి వీరి రక్తంతో సమానం. నేను తాగుతానా?” అని చెప్పి ఆ నీళ్ళు త్రాగలేదు
(1దిన 11:16-19). ❇
"బేత్లెహేం" దావీదు స్వంత ఊరు. అందుకే ఒకవేళ ఆ నీళ్లు త్రాగాలని కోరిక పుట్టి ఉండొచ్చు! ముగ్గురు యోధులు ప్రాణాలకు తెగించి తమ రాజు కోరికను తీర్చడానికి సిద్దమయ్యారు.(వారి ప్రాణాలు కోల్పోలేదు). కానీ ఆ నీళ్ళను వారి రక్తంగా రాజు భావించాడు. అప్పటికి తన వరకే ఆలోచించాడు కానీ, తర్వాత ఉన్న ప్రాణాపాయాన్ని గుర్తించి త్రాగలేకపోయ్యాడు.దేవుని ముందు అవి త్రాగలేక పారబోశాడు.
ప్రాణత్యాగం చేసి, నెరవేర్చిన పనిలో మరి నిశ్చయంగా..వారి రక్తం ఉంటుంది కదా!
"మన పాపదోషాల నిమిత్తం యేసు గాయపర్చబడ్డాడు. మనకు క్షమాపణ-విమోచన కోసం తన రక్తాన్ని చిందించాడు. నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మనల్ని దేవుని ముందు ఎల్లప్పుడూ ఉంచాలని క్రీస్తు మన కోసం చనిపోయ్యాడు".
౼నేడు మనం అనుభవిస్తున్న క్షమాపణ, సమాధానం క్రీస్తు రక్తం తో తడిచిన నిబంధన! ఉచితంగా ఇవ్వబడినదే!కానీ ఇది విలువైనది. వెలపెట్టి కొనలేనిది.
అంతేకాదు ఈ శుభవార్త మనకు చేర్చడానికి అనేక మంది విశ్వాసులు శ్రమలు పొందారు, తమ ప్రాణాలు ధారపోసారు. ఇది వీరి రక్తంతో ప్రకటించబడుతున్న సువార్త!
వీళ్ళ గురించి దేవుని సాక్ష్యం..
"భక్తిహీనులు వీళ్ళలో కొందర్ని పరిహాసం చేస్తూ కొరడా దెబ్బలు కొట్టారు. మరి కొందర్ని సంకెళ్ళతో బంధించి చెరసాలలో వేశారు.కొందర్ని రాళ్ళతో కొట్టారు. రంపంతో కోసారు. కత్తితో పొడిచి చంపారు. ఆ భక్తులు మేకల చర్మాలను, గొఱ్ఱెల చర్మాలను ధరించి అనాధలై తిరిగారు. అంతేకాక హింసను, దుష్ప్రవర్తనను సహించారు. ఎడారుల్లో పర్వత ప్రాంతాల్లో, గుహల్లో, సొరంగాల్లో, నివసించారు..వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకొన్నాడు" (హెబ్రీ 11:36-39)
భూసంభందమైన రాజు కోరిక తీర్చడానికి ఆ ముగ్గురు యోధులు ప్రాణాలకు లెక్కచెయ్యకపోతే, పరలోకరాజు తన ప్రాణ త్యాగానికి, విజయానికి సాక్షిగా ఉండమని మనల్ని కోరితే మరి ఎక్కువగా అవమానాలను, నిందలను, శ్రమలను, చివరికి మరణాన్ని సైతం లెక్కచేయని వారమై ఉండాలి కదా! మనకు ముందుగా నడిచిన సాక్షుల(విశ్వాసుల) జీవితాలు సవాలు చేస్తుండగా.. క్రీస్తే పరిపూర్ణ మాదిరిగా మన ముందు నిలిచాడు.
రక్తంతో చేయబడిన ఈ నిబంధనకు సాక్షిగా జీవితాంతం నిలుస్తావా? నమ్మకమైన క్రీస్తు యోధునిగా, ఆయన ప్రాణ త్యాగానికి తగిన జీవితంతో ఆయణ్ని ఆరాధిస్తావా?

Comments
Post a Comment