❇ బాప్తిస్మమిచ్చే యోహాను యేసుకు బాప్తిస్మమిచ్చాడు.యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలోనుంచి బయటికి వచ్చాడు.వెంటనే ఆకాశం తెరచుకొంది.దేవుని ఆత్మ ఒక పావురంలాగా దిగివచ్చి తనమీద వాలడం ఆయన చూశాడు.అప్పుడే ఆకాశంనుంచి ఒక స్వరం ఇలా వినిపించింది౼
“ఈయనే నా ప్రియమైన కుమారుడు. ఈయనంటే నాకెంతో ఆనందం.” ❇

■ దేవుడు యేసును బట్టి ఆనందించాడు. అప్పటికి ఆయన ఏ అద్భుతాలు-సూచక కార్యాలను గాని, సేవను గాని ప్రారంభించలేదు. మరి తండ్రి సంతోషం దీనిలో (ఎందుకు)? యేసు జీవితాన్ని బట్టి. వడ్రంగి వృత్తిలో ఉంటూ, తన కుటుంబ బాధ్యతలను కలిగి ఉంటూ, దేవునికి ప్రధమ స్థానం ఇస్తూ నీతిమంతుడై జీవించాడు.అంతే కాని ఆయన త్రియేక దైవత్వంలోని ఒకడని మాత్రం కాదు (హెబ్రీ 5:8, 2:18). క్రీస్తు వలె దేవుణ్ని సంతోష పెట్టిన సంపూర్ణుడు మరొరు లేరు. అంటే స్వచిత్తానికి సిలువ వేసి(ప్రక్కన పెట్టి) దేవుని చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకున్న నరుడు లేడు.అనగా క్రీస్తు పరమ తండ్రి తన కోసం నిర్దేశించిన ప్రతి ప్రణాళికల నుండి తొలగిపోక తనను తాను అప్పగించుకొన్నాడు(మొదటి మానవుడు దేవుని మాటను వినక-బుద్ధి పూర్వకంగా తప్పిపోయినది,స్వచిత్తాన్ని కొనసాగించడమే అని గుర్తుచేసుకోండి).దేవుని మాట వినకపోవటమే పాపం. మనమంతా తప్పిపోతుంది ఈ విషయంలోనే..కనుకనే మనకొక రక్షకుడు అవసరమయ్యాడు. దేవుని చిత్తంలో(ప్రణాళికల్లో) నిలిచి, ఆయన మాటకు లోబడటంలో నూటికి నూరు శాతం క్రీస్తు పరిపూర్ణుడు. క్రీస్తును రక్షకునిగా స్వీకరించిన వెంటనే, క్రీస్తు యొక్క సంపూర్ణ నీతి మనకు వస్త్రము లాగా కప్పబడుతుంది.అంటే మన నీతి-అవినీతి క్రియల బట్టి కాక కేవలం క్రీస్తు యొక్క నీతిని బట్టే పరమ తండ్రి మనల్ని తన పిల్లలగా అంగీకరిస్తాడు.
◆ పై సంఘటనను బట్టి దేవుడు తన పిల్లల విషయంలో ఆనందించాలని కోరుకుంటాడని తెల్సుతుంది. మరి ఇప్పుడు విశ్వాసి దేవుణ్ని సంతోషపర్చగలడా?
■ "ఏమి చేసినా సంతోషపర్చలేము..క్రీస్తు బలియాగాన్ని స్తుతించడం తప్ప!" ఇది తప్పుడు బోధ! ఎప్పుడైతే క్రీస్తులోకి మనం విశ్వాసం ద్వారా ప్రవేశించామో ఇక క్రీస్తు జీవితాన్ని పోలి నడచుకునే ఆజ్ఞను మనం పొందాము.క్రీస్తు ఎలాగైతే స్వచిత్తం విషయమై సిలువ వేయబడ్డాడో, మనం అనుదినం మన స్వచిత్తానికి సిలువ వేయాలి. అంటే ఒక్కప్పుడు పరమ తండ్రి ఉద్దేశ్యాలను త్రోసిపుచ్చి తిరిగిన మనం, నేడు ఇష్టపూర్వకంగా ఆయన చిత్తంలో నిలిచి ఉంటానికి తీర్మానం చేసుకోవాలి. అలాంటి పరిమళ సువాసనగా మనం దేవుని ముందు నిలవబడటానికే క్రీస్తు మన కోసం బలియైయ్యాడు.

◆ మారుమనస్సు పొంది, తిరిగి శరీర అపవిత్రతకు తిరిగిన థెస్సలొనీక సంఘానికి పౌలు ఇలా చెప్పాడు.
■ పౌలు౼"మీరు దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో, మీ జీవిత విధానం ఎలా ఉండాలో మేము మీకు నేర్పించాము..ఈ విషయంలో మీరు మరింత అభివృద్ధి పొందాలని బతిమాలుతూ ప్రభు యేసులో మిమ్మల్ని వేడుకుంటున్నాము.మీరు పరిశుద్ధులు కావడం, జారత్వానికి దూరంగా ఉండడం దేవుని ఉద్దేశం" (1థెస్స 4:2-4).
దేవుడు కృపతో క్రీస్తు యొక్క పరిశుద్ధ వస్త్రన్ని మనకు కప్పాడు.దాన్ని మురికి చేసుకోకూడదు. ప్రతి అపవిత్రను క్రీస్తు రక్తంలో కడుక్కొంటూ, క్రీస్తు కృపలో పరిపూర్ణత దిశగా సాగిపోవడామే దేవుని చిత్తం! ఇందు కోసమే మనం ఈ లోకం నుండి వేరుపర్చబడ్డాము.క్రీస్తు రెండవ రాకడలో ఆయన్ను పోలిన వ్యక్తులంగా కనిపించడాన్ని చులకనగా చూడవద్దు. కృప పాపం నుండి బయటికి రావడానికే ఇవ్వబడింది కానీ ఆనందించడానికి కాదు. అలా జరగనప్పుడు మనం కృప నుండి బొత్తిగా వేరు చేయబడతాము. బైబిల్ లో అనేక ఉదాహరణలు హెచ్చరికలుగా మన యెదుట ఉన్నాయి.
౼ ఒక రోజు దేవుని ముందు నీవు నిలచినప్పుడు, క్రీస్తు కృప నీ పట్ల సంపూర్ణమైనదని, నిన్ను బట్టి దేవుడు సంతోషించేవానిగా కనిపించునట్లు నిన్ను నీవు దేవుని అధికారానికి అప్పగించుకో!

Comments
Post a Comment