Skip to main content

Posts

21Aug2017

■ దేవుడు ఎంతో ధనవంతుడైన యోబు ఆస్తినంతటిని తీసివేసినా, అతని అరికాలునుంచి నడినెత్తివరకు చాలా బాధకరమైన కురుపులను అనుమతించినా... ౼"నేను నా తల్లి గర్భంలోనుంచి వచ్చినప్పుడు దిగంబరిగా వచ్చాను. దిగంబరి గానే తిరిగి వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చాడు. యెహోవా తీసివేశాడు. యెహోవా పేరుకు స్తుతి కలుగుతుంది గాక! మనం దేవుడిచ్చే మేలును మాత్రమేనా అనుభవించేది? కీడు అనుభవించకూడదా?" అన్నాడు.(యోబు 1:21,2:10) కాని ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి ఎన్నో అద్భుతాల ద్వారా బయటికి తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు వారిని పరీక్షించాడు. అరణ్యములో వారికి నీళ్లు దొరకలేదు. అప్పుడు ప్రజలు మోషే మీద సణిగారు ౼“ఇప్పుడు మేము ఏమి త్రాగాలి? అసలు నీవు మమ్మల్ని ఈజిప్టు నుండి ఎందుకు తీసుకొచ్చావు? నీళ్లు లేక మేము, మా పిల్లలు, మా పశువులు చావాలని నీవు మమ్మల్ని యిక్కడికి తీసుకొచ్చావా?” అన్నారు (నిర్గ 17:3) ■ "చెరనుంచి తప్పించుకొనిపోయి యింకా యూదాలోనే ఉన్న యూదులు చాలా యిబ్బందుల్లో వున్నారు. వాళ్లు చాలా సిగ్గుతోను, అనేక కష్టాలతోను వుంటున్నారు. యెరూషలేము గోడలు కూల్చబడ్డాయి. వాటి తలుపులు కాల్చివేయబడ్డాయి" ౼అని షూషను కోటలో...

19Aug2017

❇ సిరియా రాజు, ఇశ్రాయేలును వారిని చంపాలని రహస్యంగా మాటు వేసిన ప్రతిసారి, దైవజనుడైన ఎలీషా ముందుగానే తన ఆత్మలో తెల్సుకొని ఆ ప్రదేశానికి వెళ్ళొదని ఇశ్రాయేలు రాజును హెచ్చరించి ప్రమాదం నుండి అనేక సార్లు రక్షించాడు. ● సిరియా రాజు౼"ఇశ్రాయేలు రాజు కోసం గూఢచారి పని చేస్తున్నదెవరో చెప్పండి" అని తన సేవకులను ప్రశ్నించాడు. ● సేవకుల్లో ఒకడు౼“రాజా!మాలో ఎవ్వరమూ గూఢాచారులం కాము. ఇశ్రాయేలు ప్రవక్త అయిన ఎలీషా ఇశ్రాయేలు రాజుకు అనేక రహస్య విషయాలు చెప్పగలడు.మీరు నిద్రించే గృహంలో మీరు మాట్లాడే మాటలు కూడా చెప్పగలడు" ౼ ఎలీషా దోతానులో ఉన్నాడని తెల్సుకొని పట్టుకొని రండని గుర్రాలు, రథాలు, ఒక పెద్ద సైన్యం దోతానుకు పంపాడు.రాత్రి వేళ వారు నగరాన్ని చుట్టుముట్టారు. ఆ ఉదయం ఎలీషా సేవకుడు తర్వగా మేల్కోన్నాడు. అతను వెలుపలికి పోయి నగరం చుట్టూ ఒక పెద్ద సైన్యం రథాలు, గుర్రాలు ఉండటం చూసి.. ● సేవకుడు౼“నా యజమాని! మనమేమి చేయగలము?" అని ఎలీషాని చూసి అడిగాడు. ● ఎలీషా౼"భయపడకు, సిరియా సైన్యం కంటె మన కోసం యుద్ధం చేసే సైన్యమే చాలా పెద్దది" అని చెప్పి, ఎలీషా దేవునికి ఇలా ప్రార్థన చేశాడు౼“యెహ...

17Aug2017

'పరలోకానికి వెళ్లాలంటే మనం ఏమి చెయ్యాలి?' అనే అంతుచిక్కని ఆ ప్రశ్నకు సమాధానం కోసం నీకొదేము అనే బోధకుడు రాత్రివేళ యేసు దగ్గరకు వచ్చాడు. యేసు జవాబు చెబుతూ౼“ఇది సత్యం! క్రొత్తగా జన్మిస్తేనే తప్ప ఎవ్వరూ దేవుని రాజ్యాన్ని చూడలేరు” అని స్పష్టంగా చెప్పాడు. నీకొదేము౼“మనిషి ముసలి వాడయ్యాక మళ్ళీ ఎలా పుడతాడు? అతడు రెండో సారి తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టలేడు గదా!” అన్నాడు. యేసు-"మనిషి (శరీరంతో) భౌతికంగా జన్మిస్తాడు.అది శరీర జన్మ. ఆత్మలో కూడా జన్మించడం ఉంటుంది. అది ఆత్మీయ జన్మ. పరలోకంలో ప్రవేశించేది ఆత్మే గనుక నేను ఆత్మ గురించి చెప్తున్నాను. గాలి వీచినప్పుడు శబ్ధం మాత్రమే వినబడుతుంది, కాని కంటికి కనిపించదు(దాని ప్రభావం మనకు తెలుస్తుంది). ఆత్మలో క్రొత్తగా పుట్టడం కూడా అలాగే ఉంటుంది.అలా జరిగిందనే రుజువులు మనలో కనబడతాయి" “ఈ విషయాలు ఎలా సాధ్యం?” అని నీకొదేము అడిగాడు. యేసు౼"పాపక్షమాపణ కొరకై లోకరక్షకుడు సిలువపై ఎత్తబడతాడు. ఆయనలో విశ్వాసముంచిన ప్రతివారు రక్షించబడతారు. అందుకే దేవుడు ఆయన్ను లోకానికి అనుగ్రహించాడు. మన పట్ల తన ప్రేమను దేవుడు ఇలా రుజువు చేసుకున్నాడు. సత్యా...

15Aug2017

యేసు-"ఇది మీ ఘడియ. సైతాను శక్తులు రాజ్యం చేస్తున్న ఘడియ"(లూకా 22:53). క్రీస్తు సిలువపై ఉన్నప్పుడు.. ◆ ఆ దారిని పొయ్యేవారు- "దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కట్టేవాడా, నిన్ను నీవే రక్షించుకో..నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీదనుండి దిగిరా!" అంటూ ఆయనను తిట్టారు. ◆ ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు-"వీడు ఇతరుల్ని రక్షించాడు. తనను తాను రక్షించుకోలేడు! 'క్రీస్తు' అనే ఈ 'ఇశ్రాయేలు రాజు' సిలువ మీద నుండి కిందికి దిగి వస్తే అప్పుడు నమ్ముతాం!" ◆ సైనికులు-"నువ్వు యూదుల రాజువైతే నిన్ను నువ్వే రక్షించుకో" అని ఆయనను వెక్కిరించారు. ◆ వేలాడుతున్న ఆ నేరస్థులలో ఒకడు ఆయన్ని దూషిస్తూ- "నువ్వు నిజంగా క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు" అన్నాడు. ✔ యేసు లోక పాపాన్ని మోసుకొనే దేవుని గొఱ్ఱెపిల్ల వలె శిలువలో వధించబడటం దేవుని అనాది కాల ప్రణాళిక!(ఆయన నేరస్తులలో ఒకని వలె ఎంచబడతాడు! యెషయా 53:12). యేసుకు ఈ విషయం బాగా తెలుసు, సిలువ మరణమే దేవుని చిత్తమని! ఆదిలో నుండి సాతానుని ప్రయత్నం..దేవుని మాట పట్ల అవిశ్వాసం చూప...

14Aug2017

❇ ● ప్రభువు ఐగుప్తు నుండి ఒక జనాంగాన్ని రక్షించాడు. కాని నమ్మని వాళ్ళని ఆయన ఆ తరువాత నాశనం చేశాడు. ● తమ స్థానం నిలుపుకోని, అధికారాలను వదిలిన దూతలు, తమకు ఏర్పరచిన నివాస స్థలాలను విడిచిపెట్టారు. దేవుడు వాళ్ళని సంకెళ్ళతో బంధించి కటిక చీకటిలో మహా తీర్పు రోజు కోసం ఉంచాడు. ● అదేవిధంగా, సొదొమ గొమొర్రా, వాటి చుట్టూ ఉన్న పట్టణాలవారు లైంగిక అవినీతికి, అసహజమైన లైంగిక కోరికలకు తమను తాము అప్పగించుకున్నారు. వాళ్ళు శాశ్వత అగ్నికి గురై శిక్ష అనుభవించి, ఉదాహరణగా నిలిచారు (యూదా 5-7) ❇ పైన మూడు ఉదాహరణల్లో చెప్పబడిన వారంతా మొదట దేవుని కృపలో నిలచినవారే! దేవునిచే నిలుపబడి కాపాడబడి, కృపను పొంది, తమ స్వేచ్చాపూర్వకంగా దేవున్నుండి వెరైన వారిగా ఉన్నారు. దేవుడు ఎన్నడూ, ఎవ్వరి స్వేచ్చనూ హరించడు (విశ్వాసుల సైతం). ✔ దేవుడు ఇశ్రాయేలీయులతో-"అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ఒక గొప్ప వాగ్దానం చేసాను. అందుచేత నేనే మిమ్మల్ని ఆ దేశానికి నడిపిస్తాను. ఆ దేశాన్ని నేను మీకు ఇస్తాను. అది మీదే అవుతుంది. నేను యెహోవాను"(నిర్గ 6:8) ౼ వాగ్దానం ఐతే నిలిచి ఉంది, అది స్వతంత్రించుకోవాలంటే విశ్వాసంలో నిలిచివుండాలి.కాబట్...

11Aug2017

❇ యిర్మియా ద్వారా దేవుడు పలికిన మాటలు. "మీరు నా మాట వినలేదు...నన్ను విసికించి, మీకు మీరే హాని కొనితెచ్చుకొన్నారు..ఈ దేశమంతా పాడైపోతుంది! శిథిలాలవుతుంది. ఈ జనాలు బబులోను రాజుకు డెబ్భై ఏళ్ళు సేవ చేస్తారు"(యిర్మియా 25:7-11) అప్పుడు అధికారులు రాజుతో ఇలా చెప్పారు౼“ఆ మనిషికి మరణశిక్ష వేయండి. అలాంటి మాటలు చెప్పి నగరంలో ఉన్న సైనికులనూ ప్రజలందరినీ నిరుత్సాహపరుస్తున్నాడు. అతడు ఈ ప్రజల క్షేమం కోరడం లేదు గాని, కీడునే కోరుతున్నాడు” అన్నారు.(యిర్మియా 38:4) ౼ కానీ యిర్మీయా ఇశ్రాయేలు కోసం విలపించాడు. "దేవా, నాకు దుఃఖం వస్తూ ఉంది. నాకు మనసులో క్రుంగిపోయినట్లు ఉంది. భయమేస్తూ ఉంది. నా జనులు బాధపడివుండటం వల్ల నేను బాధపడుతున్నాను. నేను మాటలాడలేనంత విచారముగా ఉన్నాను. నా తల బావిగా, నా కండ్లు కన్నీళ్ళ ఊటగా ఉంటే ఎంత బాగుండేది! అలాంటప్పుడు నా ప్రజలో హతమైన వారికోసం రాత్రింబగళ్ళు కన్నీళ్ళు విడుస్తూ ఉంటాను"(యిర్మియా 8:18,21, 9:1) ౼ యేసు యెరూషలేం పట్టణానికి దగ్గరగా వచ్చినప్పుడు దానిని చూస్తూ దాని కోసం ఏడ్చి౼"ప్రభువు నిన్ను సందర్శించిన కాలం నువ్వు తెలుసుకోలేదు. కాబట్టి నీ శత్రువులు నీ ...

10Aug2017

❇ యేసు..పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కాడు. ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖరూపం మారిపోయింది. ఆయన ధరించిన బట్టలు తెల్లగా ధగ ధగ మెరిసాయి.ఉన్నట్టుండి ఇద్దరు మనుషులు కనబడి ఆయనతో మాట్లాడారు. వారు మోషే, ఏలీయా. వారు తమ మహిమతో కనపడి ఆయన యెరూషలేములో పొందబోయే మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. పేతురూ ఇంకా అతనితో ఉన్నవారూ నిద్ర మత్తులో ఉన్నారు. వారు మేలుకున్నప్పుడు ఆయన తేజస్సునూ ఆయనతో ఉన్న ఇద్దరు మనుషులనూ చూశారు. ఆ ఇద్దరు యేసును విడిచి వెళ్లిపోతూ ఉంటే.. పేతురు౼"ప్రభూ! మనం ఇక్కడ ఉండడం మంచిది. మూడు పర్ణశాలలను కడతాము– ఒకటి నీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలీయాకు" అంటూ తానేం మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండా మాట్లాడాడు. అతడు ఈ మాటలు పలుకుతుండగానే ఒక మేఘం వచ్చి వారిని కమ్ముకొంది. అప్పుడు శిష్యులు ఎంతో భయపడ్డారు. ఆ మేఘంలో నుంచి ఒక స్వరం ౼“ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన మాట వినండి.” ఆ శబ్దం వచ్చిన తర్వాత వారికి యేసు ఒక్కడే వారికి కనబడ్డాడు. ఆ రోజుల్లో వారు తాము చూసిన వాటిలో దేనినీ ఎవరికీ చెప్పలేదు. ❇ ✔ మోషే, ఏలియాలు క్రీస్తుకు పూర్వం వందల యేళ్ళ క్రితం జీవిం...

09Aug2017

❇ ఫరో రాజుకు ద్రాక్షరసం గిన్నె అందించే సేవకుడు నేరారోపణ ఎదుర్కొకొని యోసేపు ఉన్న జైలుకు వచ్చాడు.ఒక రాత్రి అతనొక కల కన్నాడు. దాని అర్ధం తెలియక విచారంగా ఉన్నప్పుడు.. యోసేపు విషయం తెలుసుకుని ఆ కల చెప్పమన్నాడు. ఆ సేవకుడు-"నా కలలో ఒక ద్రాక్షచెట్టు కనబడింది. ఆ చెట్టుకు 3 తీగెలున్నాయి. నేను చూస్తుండగా ఆ తీగెలకు పూలు పూసి, ద్రాక్షాగెలలు అయ్యాయి. ఫరో గిన్నె నా చేతిలో ఉంది. నేనా ద్రాక్షపళ్ళు తీసుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి, ఆ గిన్నె ఫరో చేతికందించాను" యోసేపు౼"దాని భావం ఇదే! ఆ 3 తీగెలు 3 రోజులు. ఇంకా 3 రోజుల లోపల, ఫరో మిమ్మల్ని ఇక్కడ నుంచి విడిపించి మీ ఉద్యోగం మీకు మళ్ళీ ఇప్పిస్తాడు. 'అయితే నీకు క్షేమం కలిగేటప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొని, నామీద దయచూపి, నా విషయం ఫరోతో మాట్లాడి, నన్ను ఈ ఇంటిలోనుంచి విడిపించండి. ఎందుకంటే, నన్ను అన్యాయంగా బలవంతంగా నా యింటినుండి, నా ప్రజలైన హీబ్రూవారి దేశంలో నుండి తీసుకొనివచ్చారు. అంతేగాక, ఈ చెరసాలలో నన్ను వేయడానికి ఇక్కడ కూడా నేనేమీ నేరం చేయలేదు'" అన్నాడు. యోసేపు చెప్పినట్లే 3 రోజుల్లో ఫరో అతని ఉద్యోగం మళ్ళీ ఇప్పించాడు. కాని యోసేపు విష...

08Aug2017

❇ దేవుడు ఇశ్రాయేలీయులతో౼"మహా యెండకు కాలిన అరణ్యములో నీతో స్నేహం చేసిన వాడను నేనే! నేను వారికి ఆహారం ప్రసాదించినప్పుడు వారు తిని తృప్తిపడ్డారు. తృప్తిపడి గర్వించారు.అప్పుడు వారు నన్ను మరచిపోయారు"(హోషేయా 13: 5) ❇ ✔ లోకం వారి వైపు చూసినప్పుడు వారిలో ఏ అర్హత కనిపించదు. అలాంటి మనుష్యులతో స్నేహం చెయ్యడానికే దేవుడు ఇష్టపడతాడు. ఏ హృదయానికి ఓదార్పు, జాలి, ప్రేమలు అవసరమౌతాయో వారిని దేవుడు వెతుక్కుంటూ వెళ్తాడు. మన మధ్యలో ఉన్న అత్యంత బలహీనులైన వారి చుట్టూ దేవుని కృప విస్తరించి ఉంటుంది అని కనిపెట్టగలవా? బయటికి కనిపించే చక్కటి విలువలతో ఉంటే మనమేంటి, ఈ లోకం కూడా స్నేహం చేస్తుంది కదా! క్రీస్తు కూడా సుంకరులను,పాపులను, వ్యభిచారులను, కుష్ఠురోగులను, జక్కయ్య వంటి తిరస్కరించబడిన వారిని, చదువులేని జాలరులను, దేవుని పట్ల యదార్థవంతులను, చివరికి సిలువపై ఉన్న నేరస్తున్ని, లోకరీత్యా అల్పులు, హీనులతో కలిసి నడిచాడు, వారితో స్నేహం చేశాడు. క్రీస్తులోని పరిశుద్ధత బలహీనులను అంగీకరిస్తూ, నిరీక్షణనిస్తుంది. పరిసయ్యుల భక్తికి, క్రీస్తుకు ఉన్న తేడా అదే! అర్హతలను బట్టి దేవుడు స్నేహం చేసిన్నట్లేతే, నిన్ను...

07Aug2017

❇ "నాబాలు అనే ఒక ధనవంతుడు ఉండేవాడు, అతడు క్రూరుడు, నీచుడు. అతను కాలేబు సంతతివాడు" నాబాలు  వంశానికి మూలపురుషుడైన కాలేబు దేవునిపై ఎంతో ౼ విశ్వాసం కలిగి, దేవుని చేత ఆశీర్వదించబడినవాడు కాగా అతని సంతతి వాడైన నాబాలులో మచ్చుకైనా ఆ భక్తి కనిపించదు.  బాప్తిస్మమిచ్చు యోహాను.. పరిసయ్యులు, సద్దూకయ్యులు చూసి -'సర్పసంతానమా! దేవుని కోపం నుండి తప్పించుకొనుటకు మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? మీరు మారుమనస్సు పొందినట్లుగా మీ ప్రవర్తన మార్చుకోండి. అబ్రాహాము మా తండ్రి’ అని మీలో మీరు గర్వించకండి' ❇ ✔ ఎవరి భక్తి జీవితం వారిదే! గాని మన పితరుల భక్తి మనకు ఆపాదించబడదు. కొన్ని సార్లు మునుషులు వాటిని బట్టి అతిశయిస్తూ ఉంటారు. భక్తిగల తల్లిదండ్రుల బట్టి, పితరులను బట్టి, భక్తిగల నాయకులతో వారికున్న సన్నిహిత్యాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, పరిచర్యను బట్టి.. ఇలా రకరకాలుగా తమది కానీ భక్తిని బట్టి లోలోపల అతిశయిస్తూ ఉంటారు. కానీ దేవుడు అలా చూడడు. వారు తమ పితరుల జీవితం గూర్చి తెలుసుకొని ఉండొచ్చు కానీ వారు ఎవ్వరితో  నడిచారో ఆ దేవుణ్ణి తెలుసుకున్నవారు కాదు. వారి జీవితాలను చూస్తూ, బోధనలను అభిమానిస్తూ ఉండొ...

04Aug2017

❇ ప్రభువు ఎఫెసులోని సంఘంతో౼ "నువ్వు చేస్తున్న పనులూ, నువ్వు పడుతున్న కష్టమూ, నీ ఓర్పూ నాకు తెలుసు...ఎంతో ఓర్పుతో నువ్వు నా నామం కోసం ప్రయాస పడుతూ అలసి పోలేదనీ నాకు తెలుసు. అయినా నీకు వ్యతిరేకంగా ఒక నేరం మోపాల్సివుంది. మొదట్లో నీకున్న ప్రేమను నువ్వు వదిలి వేశావ్! కాబట్టి ఎంత ఉన్నత స్థాయి నుండి నువ్వు పడిపోయావో గుర్తుచేసుకో(నీవు ఎంత దిగజారిపోయావో జ్ఞాపకం తెచ్చుకో). పశ్చాత్తాప పడి ప్రారంభంలో చేసిన పనులు మళ్ళీ చెయ్యి. అలా చేసి నువ్వు మారితే సరి. లేకపోతే నేను వచ్చి నీ దీప స్తంభాన్ని అక్కడ నుండి తీసివేస్తాను"(ప్రకటన 2:1-5) ❇ ✔  ఎఫెస్సు సంఘంలో దుర్భోధ లేదు. ఆత్మలను వివేచించి కపట భోదకులను గుర్తుపట్టి అలాంటి వారిని సంఘంలోకి రానివ్వలేదు. దేవుని నిమిత్తం ఎన్నో శ్రమలను సహించారు, భరించారు. పౌలు, తిమోతి ఉన్న రోజుల్లో ఎఫెస్సు పట్ల ఎంతో శ్రద్ధ చూపించారు(అపో 20:31, 1తిమో 1:3). తర్వాత రోజుల్లో సేవ జరుగుతుంది కానీ దేవునిపై ఉన్న తొలిప్రేమ తొలగిపోయింది. పైన చెప్పిన ఎన్నో మంచి పనులు ఉన్నప్పటికిని..(ఈ స్థితిని) వీరిని దేవుడు పడిపోయిన వారిగా (back slidders) పిలుస్తున్నాడు. ఎఫెస్సు సంఘాన్ని మనం...

03Aug2017

❇ భక్తిపరుడైన యెహోషాపాతు, దేవుని భయంలేని చెడ్డవాడైన అహాబు రాజుతో వియ్యమొందాడు. ఒక రోజు.. అహాబు-"రామోత్గిలాదు ప్రాంతంపై దండెత్తటానికి నీవు నాతో వస్తావా?" యెహోషాపాతు-"తప్పక వస్తాను! కాని ముందు, యెహోవా సందేశం కోసం విచారణ చేద్దాం!" అహాబు తనకు అనుకూలంగా చెప్పే ప్రవక్తల గుంపును పిలిచాడు. వారంతా 'వెళ్ళండి! దేవుడు జయమిచ్చేస్తాడు' అన్నారు. కాని యెహోషాపాతు-"యెహోవా ప్రవక్త ఒకడు కూడా ఇక్కడ లేడా?" అహాబు-"మీకాయా అనే ఇంకో ప్రవక్త ఉన్నాడు. కానీ నాకు అతడంటే ద్వేషం. ఎందుకంటే ఒక్క మంచి వర్తమానం కూడ తీసుకొనిరాడు. నాకు ఎప్పుడూ చెడువార్తలే తెస్తాడు" యెహోషాపాతు-“అహాబూ! నీవు అలా అనకూడదు.అతణ్ణి పిలిపించండి" అన్నాడు. మీకాయాను పిలవటానికి వెళ్లిన మనిషి అతనితో ౼“మీకాయా! ప్రవక్తలంతా ఒకే రీతిగా ప్రవచిస్తున్నారు. రాజుకు విజయం చేకూరుతుందని వారు చెప్తున్నారు. వారు చెప్పినట్లుగానే నీవు కూడా తెలియజేయి. నీవు కూడ మంచి విషయాలే చెప్పు" “యెహోవా జీవము తోడు నేను నా దేవుడు తెలియజేసిన రీతినే చెపుతాను" అని మీకాయా అన్నాడు. వెళ్లి దేవుడు చెప్పినట్లే ...

02Aug2017

  యేసు౼"ఒక స్త్రీ దగ్గర పది వెండి నాణేలు ఉన్నాయనుకోండి. అందులో ఒక నాణెం పోగొట్టుకొంటే ఆమె దీపం వెలిగించి, యిల్లంతా ఊడ్చి అది దొరికే దాకా జాగ్రత్తగా వెతకదా? దొరికిన వెంటనే తన స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి పోగొట్టుకున్న నా నాణెం దొరికింది. మనమంతా ఆనందించుదాం! అని అంటుంది. అలాగే పశ్చాత్తాపం పొందే పాపిని గురించి పరలోకంలో దేవుని దూతల సముఖంలో సంతోషం కలుగుతుందని మీకు చెప్తున్నాను"  ❇ ✔  ఆ స్త్రీ మిగిలిన 9 నాణేలు బట్టి ఉరుకోక, కోల్పోయిన ఆ ఒక్క నాణెం కోసం దీపం వెలిగించి, యిల్ లంతా ఊడ్చి ఎంతో శ్రద్ధగా వెతికింది. క్రీస్తు చెప్తున్నాడు..ఇవ్వరైతే దేవుని నుండి దూరమైపోతూ పాపంలో జీవిస్తుంటారో, వారిని నీతి మార్గంలోకి తీసుకురావటం కోసం దేవుడు కూడా అలాగే శ్రద్ధగా వెతుకుతాడు. పాపం చేసిన వారి పట్ల పరలోక తండ్రి మనస్సును క్రీస్తు తెలియజేస్తున్నాడు. ✔  తోటి వారి ప్రవర్తనతో తమను తాము పోల్చుకొని 'నీతి' గా ఉన్నామని సంతోషపడే వారి కంటే అధికంగా, యదార్థంగా తమ తప్పును ఒప్పుకుని, ప్రవర్తన మార్చుకోవాలని ఆశించే వారిపై దేవుని శ్రద్ధ అధికంగా ఉంటుంది. పాపాన్ని యదార్ధంగా ఒప్పుకోలేని వా...

01Aug2017

  సువార్త నిమిత్తం ఖైదీగా ఉన్న పౌలు తన వాదనను కైసరు చక్రవర్తి ముందు చెప్పుకొంటానని కోరాడు. కాబట్టి పౌలుతో పాటు మరికొందరు ఖైదీలను తీసుకొని శతాధిపతి ఓడలో ఇటలీకి ప్రయణమయ్యాడు. కానీ గొప్ప తుఫాను వల్ల ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది. ఓడ కొట్టుకొని పోయి 'మెలితే' అనే ఒక ద్వీపం దగ్గరకు వచ్చింది. అనాగరికులైన ద్వీపవాసులు వారికి ఎంతో సహాయపడ్డారు. వర్షం కురుస్తూ చలిగా ఉండడంతో వారు నిప్పు రాజబెట్టారు. అప్పుడు పౌలు కొన్ని పుల్లలేరి నిప్పుల మీద వేస్తుండగా ఒక పాము ఆ వేడికి బయటికి వచ్చి అతని  చెయ్యి పట్టుకుంది. ఆ ప్రజలు ఆ పాము అతని చేతిని పట్టుకొని వేలాడటం చూసి, 'ఈ మనిషి తప్పకుండా హంతకుడై ఉంటాడు. ఇతడు సముద్రం నుండి తప్పించుకొన్నప్పటికీ న్యాయం మాత్రం అతణ్ణి బతకనియ్యద'ని తమలో తాము చెప్పుకొన్నారు. కానీ పౌలు మాత్రం ఆ విష జంతువును మంటలో జాడించివేసి, ఏ హానీ పొందలేదు. వారైతే అతని శరీరం వాచి పోవడమో, అతడు అకస్మాత్తుగా పడి చనిపోవడమో జరుగుతుందని కనిపెడుతున్నారు. చాలాసేపు కనిపెట్టిన తరువాత అతనికి ఏ హానీ కలగకపోవడం చూసి తమ అభిప్రాయం మార్చుకొని, 'ఇతడొక దేవుడు' అని చెప్పసాగారు . 🔹 (అ...

28 July 2017

యేసు ఒక కథ చెప్పాడు. ❇  ఒక ధనవంతుడి భూమి విస్తారంగా పండింది. అప్పుడు అతడు ఇలా ఆలోచించాడు. "నా పంట సమకూర్చుకోడానికి నాకు స్థలం చాలదు. కాబట్టి నేనేం చేయాలి? ఇలా చేస్తాను. నా కొట్లు పడగొట్టి ఇంకా పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యమంతటినీ, నా ఆస్తి అంతటినీ దాచి నిల్వ చేస్తాను. అప్పుడు నా ప్రాణంతో "ప్రాణమా, ఎన్నో సంవత్సరాలకు సరిపోయే విస్తారమైన ఆస్తి నీ కోసం సమకూర్చాను. సుఖపడు, తిను, తాగు, సంతోషంగా ఉండు అని చెప్తాను" అనుకున్నాడు. అయితే దేవుడు అతడితో "మూర్ఖుడా! ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. నువ్వు కూడబెట్టినవి ఎవరివి అవుతాయి?" అని అతడితో అన్నాడు. దేవుని విషయంలో ధనవంతుడు కాకుండా తన కోసమే సమకూర్చుకునే వాడు అలాగే ఉంటాడు" ❇ ✔  ధనవంతుడు అక్రమంగా సంపాదించాడని చెప్పబడలేదు. సంవత్సర సంవత్సరానికి అతను ఎంతో కష్టపడి సంపాదించివుంటాడు. మెరుగైన పంట పండటానికి రాత్రింబవళ్లు శ్రమించివుంటాడు. అతని మూలంగా అనేకులకు (పంటవేసేవారికి, కోసే వారికి, కూలీలకు, కొట్లు కట్టేవారికి) పని దొరికుతావుంది. అలాంటప్పుడు అతని కష్టార్జీతం అతను తినటానికి యోగ్యుడే కదా? మరి దేవుడేందుకు అ...

27 July 2017

దేవుడు ఇశ్రాయేలీయులతో౼"ఇదిగో వినండి! నేను కానాను దేశాన్ని మీకు అప్పగించాను. మీరు అందులో ప్రవేశించి ఆ దేశాన్ని మీ స్వాధినం చేనుకోండి. మీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకూ వారి తరువాత వారి సంతానానికీ ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి!" (ద్వితియో  1:8) --కనాను దేశాన్ని అబ్రాహాముకు, అతని సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు(ఆది 13:12-17).ఇక కనాను వారి సొత్తు. ఇప్పుడు సుమారు 400 సం|| తర్వాత ఐగుప్తు భానిసత్వ సంకెళ్ళను తెంచుకుని ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశమైన కనానుక ు ప్రయణమయ్యారు. పైన చెప్పిన మాటలు అప్పుడు దేవుడు వారితో పలికిన మాటలు.ఐతే కనానులో నివసిస్తున్న ప్రజలు బలవంతులు, గొప్ప దేహదారుడ్యం గల వారు(సంఖ్యా 13:28,31). --దేవుడిచ్చిన వాగ్దానం స్వతంత్రించుకొనే నిమిత్తం భానిసత్వపు సంకెళ్ళు తెంచబడ్డాయి. ఆ ప్రదేశాన్ని బలమైన శత్రువుచే ఆక్రమించబడివుంది.ఆయన వాగ్దానం నిలచి ఉంది. ఇక ఇప్పుడు మిగిలివుంది విశ్వాసంతో స్వాధీన పర్చుకోవటమే! ఇశ్రాయేలు ముందు ఉంచబడిన సవాలు౼'విశ్వాసం'. కానీ వారిలో చాలా మంది దేవుణ్ని నమ్మలేకపోయ్యారు. వారిలో నమ్మిన వారు మ...

26 July 2017

  దేవుని మాట ప్రకారం ఎలీషా నయమాను యొక్క కుష్ఠురోగాన్ని బాగుచేశాడు. కృతజ్ఞతతో నయమాను కానుకలను ఇవ్వగా, దైవజనుడైన ఎలీషా వాటిని తిరస్కరించాడు. ఎలీషా దగ్గర గేహజీ అనే శిష్యుడొకడు ఉన్నాడు. గేహజీ౼“గురువు గారు నయమాను తెచ్చిన వాటిని తీసుకోకుండా అతణ్ణి ఊరికే వెళ్ళనిచ్చాడు. యెహోవా జీవము తోడు, నేను అతడివెంట పరుగెత్తి అతడి నుంచి ఏదైనా తీసుకుంటాను" అనుకొని వెళ్ళి, నయమానుకు ఎలీషా తీసుకురమ్మానాడని అబద్ధమాడి, రెండు జతల విలువైన దుస్తులనూ, డెబ్భై కిలోగ్రాముల వెండి రెండు సంచుల నిండా తీసుకొని వచ్చి  దాచి, ఏమీ తెలియనట్లు ఎలీషా ముందుకు తిరిగి వచ్చాడు. ఎలీషా౼“గేహజీ, నీవు ఎక్కడికి వెళ్లావు?" గేహజీ౼“నీ దాసుడైన నేను ఎక్కడికీ వెళ్ళలేదు" ఎలీషా౼"నయమాను నిన్ను కలుసుకోవడానికి రథం దిగినప్పుడు, నా హృదయం నీతో వున్నది. వెండి, దుస్తులు, ఒలీవచెట్ల తోటలు, ద్రాక్షతోటలు, గొఱ్ఱెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఇప్పుడు నయమానుకు ఉన్న కుష్ఠు నీకూ, నీ సంతానానికీ సోకుతుంది" అన్నాడు. మంచులాగా తెల్లటి కుష్ఠు పుట్టి గేహజీ ఎలీషా ముందు నుంచి బయటికి వెళ్ళాడు .  ❇ -- నిజానికి దేవుడు గేహజీ ...

25 July 2017

  యేసు, ఆయన శిష్యులు గలలీకి ఎదురుగా ఉండే గెరాసేను ప్రాంతానికి వచ్చారు. ఆయన ఒడ్డున దిగగానే దయ్యాలు పట్టి చాలా కాలం నుండి బట్టలు కట్టుకోకుండా, సమాధుల్లో తిరుగాడే ఆ ఊరి వాడొకడు ఆయన్ని ఎదురుగా వచ్చాడు.. ఆయన "ఈ వ్యక్తిని వదిలి బయటకు రా" అని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞ ఇచ్చాడు..."పాతాళంలోకి వెళ్ళమని తమకు ఆజ్ఞ ఇవ్వవద్దని" దెయ్యాలు ఆయనను ఎంతో బతిమాలాయి.పందుల మందలో చొరబడడానికి అనుమతినిమ్మని ఆయనను బతిమాలినప్పుడు ఆయన వాటికి అనుమతినిచ్చాడు. వెంటనే ఆ మంద ఎత్తైన కొండపై నుండి పరుగెత్తుకుంటూ వెళ్లి  సరస్సులో పడి ఊపిరి ఆడక చచ్చాయి. ఆ పందుల్ని మేపుతున్న వారు వెళ్ళి, పట్టణంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ జరిగిందంతా చెప్పారు.ఆ ఊరి ప్రజలు యేసు దగ్గరకు వచ్చి, అక్కడ దయ్యాలు వదిలిన వాడు బట్టలు కట్టుకుని స్థిమితంగా యేసు పాదాల దగ్గర కూర్చుని ఉండటం చూసి భయపడి, తమను విడిచి వెళ్ళమని ఆయనను బతిమాలుకున్నారు. ఆయన తిరిగి పడవ ఎక్కి వెళ్లబోతుంటే దయ్యాలు విడిచిన వ్యక్తి తనను కూడా ఆయనతో ఉండనిమ్మని బతిమాలాడు. కానీ ఆయన "నువ్వు నీ ఇంటికి వెళ్లి దేవుడు నీకు చేసిన గొప్ప విషయాలను చెప్పు" అన...

22 July 2017

పరిశుద్ధాత్మ-"ఆనాడు ఎడారిలో మూర్ఖులైన మీ పూర్వీకులు నాకు కోపం రేపి ఎదురు తిరిగారు. నా సహనాన్ని పరీక్షించారు. కాని నేడు మీరాయన మాటలు వినబడుతున్నప్పుడు మీ హృదయాలు కఠిన చేసుకోకండి. నేను 40 సంవత్సరాలు చేసినదంతా చూసి కూడా మీ పూర్వీకులు నన్నూ, నా సహనాన్ని పరీక్షించారు. కనుక నేను ఆ తరంవారిమీద కోపపడి, ౼ 'వీళ్ళు ఎప్పుడూ తమ హృదయాల్లో సత్యానికి దూరంగా ఉంటున్నారు. నా మార్గాలు తెలుసుకోలేదు. వాళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశింపరు' అని ప్రమాణం చేశాను" ✔  "సోదరులారా(విశ్వాసులారా), జీవం గల దేవుని నుండి తొలగిపోయే, విశ్వాసంలేని చెడ్డ హృదయం హృదయం మీలో ఉండకుండా జాగ్రత్త పడండి. ఆ ‘నేడు’ అనేది యింకా ఉంది గనుక, పరస్పరం ప్రతి రోజు ప్రోత్సాహపరచుకొంటూ ఉండండి. అప్పుడు పాపం మిమ్మల్ని మోసం చెయ్యలేదు. 'మనలో మొదటినుండి ఉన్న విశ్వాసాన్ని చివరిదాకా గట్టిగా పట్టుకొనివుంటే, మనం క్రీస్తుతో కలిసి భాగం పంచుకొంటాం! (పాలివారమైఉంటాము)' ✔  దేవుని మాట విని కూడా తిరుగుబాటు చేసిందెవరు? ఐగుప్తులో నుండి మోషే బయటకు నడిపించిన వారందరే కదా! దేవుడు 40 ఏళ్ళు ఎవరి మీద కోపపడ్డాడు? పాపం చేసిన వారి...