Skip to main content

09Aug2017

ఫరో రాజుకు ద్రాక్షరసం గిన్నె అందించే సేవకుడు నేరారోపణ ఎదుర్కొకొని యోసేపు ఉన్న జైలుకు వచ్చాడు.ఒక రాత్రి అతనొక కల కన్నాడు. దాని అర్ధం తెలియక విచారంగా ఉన్నప్పుడు.. యోసేపు విషయం తెలుసుకుని ఆ కల చెప్పమన్నాడు.

ఆ సేవకుడు-"నా కలలో ఒక ద్రాక్షచెట్టు కనబడింది.
ఆ చెట్టుకు 3 తీగెలున్నాయి. నేను చూస్తుండగా ఆ తీగెలకు పూలు పూసి, ద్రాక్షాగెలలు అయ్యాయి. ఫరో గిన్నె నా చేతిలో ఉంది. నేనా ద్రాక్షపళ్ళు తీసుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి, ఆ గిన్నె ఫరో చేతికందించాను"

యోసేపు౼"దాని భావం ఇదే! ఆ 3 తీగెలు 3 రోజులు. ఇంకా 3 రోజుల లోపల, ఫరో మిమ్మల్ని ఇక్కడ నుంచి విడిపించి మీ ఉద్యోగం మీకు మళ్ళీ ఇప్పిస్తాడు. 'అయితే నీకు క్షేమం కలిగేటప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొని, నామీద దయచూపి, నా విషయం ఫరోతో మాట్లాడి, నన్ను ఈ ఇంటిలోనుంచి విడిపించండి. ఎందుకంటే, నన్ను అన్యాయంగా బలవంతంగా నా యింటినుండి, నా ప్రజలైన హీబ్రూవారి దేశంలో నుండి తీసుకొనివచ్చారు. అంతేగాక, ఈ చెరసాలలో నన్ను వేయడానికి ఇక్కడ కూడా నేనేమీ నేరం చేయలేదు'" అన్నాడు.
యోసేపు చెప్పినట్లే 3 రోజుల్లో ఫరో అతని ఉద్యోగం మళ్ళీ ఇప్పించాడు. కాని యోసేపు విషయం ఫరోతో అతడేమీ చెప్పలేదు. అతను యోసేపుకు సహాయం చెయ్యటం మరచిపోయాడు!!

యోసేపు దేవుని ప్రణాళికలో ఐగుప్తుకు తీసుకురాబడ్డాడు.కొంత మంది అతని విషయంలో అన్యాయంగా ప్రవర్తించిన మాట నిజమే! కాని దానిని కూడా దేవుడు ఆయన చిత్తానికి వాడుకున్నాడు.అతనికి హాని చెయ్యాలని చూసిన వారందరి చర్యలను దేవుడు తన ఆధీనంలోకి తీసుకున్నాడు. దేవుని చేత పంపబడినప్పుడు విడిపించగలిగిన వాడు కూడా ఆయనే కదా! శ్రమలో యోసేపు ఆ సేవకుని వైపు సహాయం కోసం చూసాడు.కాని అతను మర్చిపోయ్యాడు(దానిని కూడా దేవుడు ఆయన ఆధీనంలోకి తీసుకున్నాడు). యోసేపు ఆ సేవకుడు విడిపిస్తాడని ఎంతో ఎదురుచూశాడు. కాని అలా జరగలేదు.అప్పుడతను ఒక పాఠం నేర్చుకున్నాడు.

విడిపించే(సహాయం చేసే) హస్తం దేవునిదే కాని మానవునిది కాదు. తిరిగి యోసేపు దేవునిపై మనస్సు నిలిపాడు. 2 సం|| తర్వాత యోసేపు బయటికి రావడానికి అదే సేవకుణ్ణి దేవుడు వాడుకున్నాడు. ఆయన ఆకాశం నుండి గొప్ప సూచన ద్వారా విడిపించలేదు కాని మనుష్యులనే వాడుకున్నాడు. ఐతే విశ్వాసి చూపు సర్వశక్తుడైన దేవుని హస్తం వైపే ఉండాలి, కాని మానవ హస్తం వైపు కాదు.ఆయనదైన సమయంలో ఆయన చిత్తానుసారం ఆయన పని ఆయన చేస్తుంటాడు. విశ్వాసి విశ్వాసంతో దేవునిపై ఆనుకొనటమే 'విశ్వాసి' అనే తన పిలుపుకు తగిన జీవితం.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...