Skip to main content

17Aug2017

'పరలోకానికి వెళ్లాలంటే మనం ఏమి చెయ్యాలి?' అనే అంతుచిక్కని ఆ ప్రశ్నకు సమాధానం కోసం నీకొదేము అనే బోధకుడు రాత్రివేళ యేసు దగ్గరకు వచ్చాడు.

యేసు జవాబు చెబుతూ౼“ఇది సత్యం! క్రొత్తగా జన్మిస్తేనే తప్ప ఎవ్వరూ దేవుని రాజ్యాన్ని చూడలేరు” అని స్పష్టంగా చెప్పాడు.

నీకొదేము౼“మనిషి ముసలి వాడయ్యాక మళ్ళీ ఎలా పుడతాడు? అతడు రెండో సారి తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టలేడు గదా!” అన్నాడు.

యేసు-"మనిషి (శరీరంతో) భౌతికంగా జన్మిస్తాడు.అది శరీర జన్మ. ఆత్మలో కూడా జన్మించడం ఉంటుంది. అది ఆత్మీయ జన్మ. పరలోకంలో ప్రవేశించేది ఆత్మే గనుక నేను ఆత్మ గురించి చెప్తున్నాను. గాలి వీచినప్పుడు శబ్ధం మాత్రమే వినబడుతుంది, కాని కంటికి కనిపించదు(దాని ప్రభావం మనకు తెలుస్తుంది). ఆత్మలో క్రొత్తగా పుట్టడం కూడా అలాగే ఉంటుంది.అలా జరిగిందనే రుజువులు మనలో కనబడతాయి"


“ఈ విషయాలు ఎలా సాధ్యం?” అని నీకొదేము అడిగాడు.


యేసు౼"పాపక్షమాపణ కొరకై లోకరక్షకుడు సిలువపై ఎత్తబడతాడు. ఆయనలో విశ్వాసముంచిన ప్రతివారు రక్షించబడతారు. అందుకే దేవుడు ఆయన్ను లోకానికి అనుగ్రహించాడు. మన పట్ల తన ప్రేమను దేవుడు ఇలా రుజువు చేసుకున్నాడు. సత్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఆయన్ను అంగీకరిస్తారు" అని చెప్పాడు.


పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో(పరలోకంలో), నిత్యకాలంలో జీవించాలంటే ఖచ్చితంగా ఆయనలాంటి పరిశుద్ధులైతే తప్ప ఎవ్వరూ అక్కడ నివసించలేరు. కాబట్టి మొదట యదార్ధంగా మనం దానికి అర్హులం కాదని గుర్తించాలి.ఈ విషయంలో మన మనసాక్షే మన మీద నేరారోపణ చేస్తుంది. నిస్సాహయులమైన మన మీద దేవుడు తన కరుణను చూపుతున్నాడు. ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపి, లోక పాపాన్ని(నీ పాపాన్ని) యేసుపై మోపి, మన (నీ) పాపపు శిక్షను ఆయనకు విధించాడు. ఆయన నీతిని ఉచితంగా మనకు (నీకు) అనుగ్రహించాడు.

ఈ సత్యాన్ని విశ్వసించి, పాపముల విషయమై పశ్చాత్తాపడిన వెంటనే మనం ఆత్మలో క్రొత్త జన్మను పొందుతాము.ఆ క్షణమందే పరలోక తండ్రి బిడ్డలంమౌతాము.మనకు సహాయంగా, మనం ఆయానవారం అనడానికి గుర్తుగా ఆయన ఆత్మ మనలో నివసిస్తాడు, కనుక ఇకను పాప సంభంధులముగా కాకుండా, నీతికి వారసులుగా ఆయన్ను పోలి నడచుకోవాల్సినవారము.ఇక మన జీవితంలో, దేవునితో క్రొత్త ప్రయాణం ఆరంభమౌతుంది.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...