అహాబు-"రామోత్గిలాదు ప్రాంతంపై దండెత్తటానికి నీవు నాతో వస్తావా?"
యెహోషాపాతు-"తప్పక వస్తాను! కాని ముందు, యెహోవా సందేశం కోసం విచారణ చేద్దాం!"
అహాబు తనకు అనుకూలంగా చెప్పే ప్రవక్తల గుంపును పిలిచాడు. వారంతా 'వెళ్ళండి! దేవుడు జయమిచ్చేస్తాడు' అన్నారు.
కాని యెహోషాపాతు-"యెహోవా ప్రవక్త ఒకడు కూడా ఇక్కడ లేడా?"
అహాబు-"మీకాయా అనే ఇంకో ప్రవక్త ఉన్నాడు. కానీ నాకు అతడంటే ద్వేషం. ఎందుకంటే ఒక్క మంచి వర్తమానం కూడ తీసుకొనిరాడు. నాకు ఎప్పుడూ చెడువార్తలే తెస్తాడు"
యెహోషాపాతు-“అహాబూ! నీవు అలా అనకూడదు.అతణ్ణి పిలిపించండి" అన్నాడు.
మీకాయాను పిలవటానికి వెళ్లిన మనిషి అతనితో ౼“మీకాయా! ప్రవక్తలంతా ఒకే రీతిగా ప్రవచిస్తున్నారు. రాజుకు విజయం చేకూరుతుందని వారు చెప్తున్నారు. వారు చెప్పినట్లుగానే నీవు కూడా తెలియజేయి. నీవు కూడ మంచి విషయాలే చెప్పు"
“యెహోవా జీవము తోడు నేను నా దేవుడు తెలియజేసిన రీతినే చెపుతాను" అని మీకాయా అన్నాడు.
వెళ్లి దేవుడు చెప్పినట్లే 'యుద్ధంలో మరణమౌతావని' ప్రవచించాడు. రాజు కోపంతో ప్రవక్తను ఆకలిపస్తుల ఉండేట్లు ఖైదుకు అప్పగించి యుద్దానికి వెళ్ళాడు. దేవుడు ప్రవక్త ద్వారా పలికినట్లు అహాబు (మారువేషంలో వెళ్లినా కూడా) చంపబడ్డాడు. దేవుని కనికరాన్ని బట్టి యెహోషాపాతు ప్రాణాలతో తప్పించుకొని పారిపోయ్యాడు. (2దిన 18) ❇
పౌలు-"ఇప్పుడు నేను 'మనుష్యుల మెప్పును(దయను)' సంపాదించుకోవాలను కొంటున్నానా? లేక 'దేవుని మెప్పునా'? మనుషులను సంతోషపెట్టాలని చూస్తున్నానా? నేను ఇంకా మనుష్యులను సంతోషపెట్టాలని చూస్తున్నట్లయితే క్రీస్తు సేవకుణ్ణి కాదు" (గలతీ 1:10)
↪నీ ఆత్మకు మేలు కలిగే మాటలు వినాలనుకుంటున్నావా? లేక నీకు అనుకూలమైన, నీకిష్టమైన బోధ వినాలనుకుంటున్నావా? నీవు చేస్తున్న, నీకు నచ్చిన పనులకు వాక్యం సపోర్ట్ చేస్తుందా అని వెతుకుతున్నావా? లేక వాక్యానుసారం నీవు నడచుకోవాలను కొంటున్నావా? (వాక్యం క్రింద ఉన్నావా? వాక్యం పైన ఉన్నావా). హృదయం కఠినపర్చుకొంటే పర్యవసానం తప్పక కోస్తాము.
దేవుని నమ్మకత్వం నీపైన ఉన్నట్లయితే, నమ్మకమైన సాక్షులైన పౌలు వలె, మీకాయా వలె శ్రమను అనుభవించు! దేవుడు నీతో ఉన్నాడు.
Comments
Post a Comment