❇"నాబాలు అనే ఒక ధనవంతుడు ఉండేవాడు, అతడు క్రూరుడు, నీచుడు. అతను కాలేబు సంతతివాడు"
నాబాలు వంశానికి మూలపురుషుడైన కాలేబు దేవునిపై ఎంతో ౼ విశ్వాసం కలిగి, దేవుని చేత ఆశీర్వదించబడినవాడు కాగా అతని సంతతి వాడైన నాబాలులో మచ్చుకైనా ఆ భక్తి కనిపించదు.
బాప్తిస్మమిచ్చు యోహాను.. పరిసయ్యులు, సద్దూకయ్యులు చూసి -'సర్పసంతానమా! దేవుని కోపం నుండి తప్పించుకొనుటకు మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? మీరు మారుమనస్సు పొందినట్లుగా మీ ప్రవర్తన మార్చుకోండి. అబ్రాహాము మా తండ్రి’ అని మీలో మీరు గర్వించకండి' ❇
✔ ఎవరి భక్తి జీవితం వారిదే! గాని మన పితరుల భక్తి మనకు ఆపాదించబడదు. కొన్ని సార్లు మునుషులు వాటిని బట్టి అతిశయిస్తూ ఉంటారు. భక్తిగల తల్లిదండ్రుల బట్టి, పితరులను బట్టి, భక్తిగల నాయకులతో వారికున్న సన్నిహిత్యాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, పరిచర్యను బట్టి.. ఇలా రకరకాలుగా తమది కానీ భక్తిని బట్టి లోలోపల అతిశయిస్తూ ఉంటారు. కానీ దేవుడు అలా చూడడు. వారు తమ పితరుల జీవితం గూర్చి తెలుసుకొని ఉండొచ్చు కానీ వారు ఎవ్వరితో నడిచారో ఆ దేవుణ్ణి తెలుసుకున్నవారు కాదు. వారి జీవితాలను చూస్తూ, బోధనలను అభిమానిస్తూ ఉండొచ్చు కానీ దాని శక్తిని తమతో కొనసాగించిన వారు కాకపోవచ్చు. దేవునిలో కాక, ఈ లోక వ్యర్ధాతిశయాల యందే ఆనందించే వారుగా ఉంటారు. కాలేబు విశ్వాసాన్ని బట్టి దేవుని చేత ఆశీర్వదించబడితే, నాబాలు దేవున్ని విడచి, ఆయనచేత చంపబడ్డాడు.
✔ నాబాలు మరణం వరకు ధనవంతుడిగా ఉన్నాడు. నీతిమంతుడైన దావీదు శ్రమతో, లేమితో గడిపాడు. పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధానయాజకులు రాజులకు, అధికారులకు నెళవైన వారీగా ఉన్నారు, కానీ బాప్తిస్మమిచ్చు యోహాను, తిరస్కరించబడి చెఱసాలలో వెయ్యబడ్డాడు.
ఒకని ఈ లోక పేరు ప్రతిష్టలు, ఒకని భూసంభంధమైన సంమృద్ది దేవుని అంగీకారానికి గుర్తు కాదు. అవి భక్తిహీనులకు కూడా దొరుకుతున్నాయి కదా! కాబట్టి అతిశయించడానికి ఏమీ లేదు!
✔ అతిశయించువాడు తన దేవుణ్ణి నిదానించి చూడటంలో, ఆయన నీతి మనలో కార్యరూపం దాల్చడంలో, క్రీస్తు పునరుద్ధన శక్తిని బట్టి, దేవుని రూపాన్ని పొందటంలోనే అతిశయించాలి. దేవుడు మనకు తోడై ఉంటే లేమిలో(ఏ స్థితిలోనైన) ఉన్న ఆనందం, శ్రమలో ఉన్న సంతోషం, ఆయన ప్రేమలోని పరిపూర్ణతను మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటాము.
Comments
Post a Comment