❇ యేసు..పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కాడు. ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖరూపం మారిపోయింది. ఆయన ధరించిన బట్టలు తెల్లగా ధగ ధగ మెరిసాయి.ఉన్నట్టుండి ఇద్దరు మనుషులు కనబడి ఆయనతో మాట్లాడారు. వారు మోషే, ఏలీయా. వారు తమ మహిమతో కనపడి ఆయన యెరూషలేములో పొందబోయే మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. పేతురూ ఇంకా అతనితో ఉన్నవారూ నిద్ర మత్తులో ఉన్నారు. వారు మేలుకున్నప్పుడు ఆయన తేజస్సునూ ఆయనతో ఉన్న ఇద్దరు మనుషులనూ చూశారు.
ఆ ఇద్దరు యేసును విడిచి వెళ్లిపోతూ ఉంటే..
పేతురు౼"ప్రభూ! మనం ఇక్కడ ఉండడం మంచిది. మూడు పర్ణశాలలను కడతాము– ఒకటి నీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలీయాకు" అంటూ తానేం మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండా మాట్లాడాడు. అతడు ఈ మాటలు పలుకుతుండగానే ఒక మేఘం వచ్చి వారిని కమ్ముకొంది. అప్పుడు శిష్యులు ఎంతో భయపడ్డారు. ఆ మేఘంలో నుంచి ఒక స్వరం ౼“ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన మాట వినండి.”ఆ శబ్దం వచ్చిన తర్వాత వారికి యేసు ఒక్కడే వారికి కనబడ్డాడు. ఆ రోజుల్లో వారు తాము చూసిన వాటిలో దేనినీ ఎవరికీ చెప్పలేదు. ❇
✔ మోషే, ఏలియాలు క్రీస్తుకు పూర్వం వందల యేళ్ళ క్రితం జీవించిన భక్తులు. క్రీస్తు మరణం గూర్చి మాట్లాడటానికి దేవుడు వీరిని తిరిగి భూమిపైకి పంపాడు. దేవుని కృప యెంత గొప్పదంటే౼ఒకప్పుడు మరణం గూర్చి భయపడిన ఏలియాను 'గొప్పదైన క్రీస్తు మరణం' గూర్చి మాట్లాడే రాయబారిగా పంపాడు. ఒకప్పుడు నరహత్య చేసిన మోషేను, లోకం చేయ్యబోవు 'గొప్ప హత్య' గూర్చి ప్రకటించే వానిగా పంపాడు. ఇలాంటి మానవాళికి అంతు చిక్కని కార్యాలు దేవునితోనే సాధ్యం. మనం దేవుని శక్తితో నింపబడినప్పుడు, మన జీవితంలో క్రీస్తును కలుసుకోక ముందు(లేదా నేడు) ఏ విషయంలో బలహీనులుగా కనిపిస్తున్నామో౼అదే విషయంలో బలవంతునిగా నిలిపి దేవుడు మనల్ని వాడుకొన సమర్ధుడు.
✔ క్రీస్తు యేసులో ఉన్న దీనత్వం, తగ్గింపును గమనించారా! సమీపింపరాని తేజస్సులో నివాసముండే సృష్టికర్త, బలహీనులు సృష్టించబడిన వ్యక్తులలో కలసి, వారిలో ఒకనిగా మాట్లాడుతున్నాడు. దేవ దూతలచే బలపరచబడు బలహీన శరీరాన్ని దాల్చాడు. క్రీస్తు అంతగా తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. కుమారుడు కాబట్టి అంగీకరించబడలేదు కాని, అందరి కంటే దీనుడుగా దేవుని ముందు ఉన్నాడు కాబట్టే అందరికి పైగా హెచ్చించబడ్డాడు. శిష్యులకు ఆ తర్వాత ధర్మశాస్త్రం(మోషే), ప్రవక్తల(ఏలీయా) కంటే శ్రేష్ఠుడైన యేసు ఒక్కడే కనిపించాడు. నేడు మనం యేసు మాట వినాలని(అనుసరించాలని) దేవుడు ఆదేశిస్తున్నాడు (హెబ్రీ1:1,2).ఆయనే మనకు సంపూర్ణ మాదిరి.

Comments
Post a Comment