Skip to main content

19Aug2017

❇ సిరియా రాజు, ఇశ్రాయేలును వారిని చంపాలని రహస్యంగా మాటు వేసిన ప్రతిసారి, దైవజనుడైన ఎలీషా ముందుగానే తన ఆత్మలో తెల్సుకొని ఆ ప్రదేశానికి వెళ్ళొదని ఇశ్రాయేలు రాజును హెచ్చరించి ప్రమాదం నుండి అనేక సార్లు రక్షించాడు.

● సిరియా రాజు౼"ఇశ్రాయేలు రాజు కోసం గూఢచారి పని చేస్తున్నదెవరో చెప్పండి" అని తన సేవకులను ప్రశ్నించాడు.

● సేవకుల్లో ఒకడు౼“రాజా!మాలో ఎవ్వరమూ గూఢాచారులం కాము. ఇశ్రాయేలు ప్రవక్త అయిన ఎలీషా ఇశ్రాయేలు రాజుకు అనేక రహస్య విషయాలు చెప్పగలడు.మీరు నిద్రించే గృహంలో మీరు మాట్లాడే మాటలు కూడా చెప్పగలడు"

౼ ఎలీషా దోతానులో ఉన్నాడని తెల్సుకొని పట్టుకొని రండని గుర్రాలు, రథాలు, ఒక పెద్ద సైన్యం దోతానుకు పంపాడు.రాత్రి వేళ వారు నగరాన్ని చుట్టుముట్టారు.

ఆ ఉదయం ఎలీషా సేవకుడు తర్వగా మేల్కోన్నాడు. అతను వెలుపలికి పోయి నగరం చుట్టూ ఒక పెద్ద సైన్యం రథాలు, గుర్రాలు ఉండటం చూసి..

● సేవకుడు౼“నా యజమాని! మనమేమి చేయగలము?" అని ఎలీషాని చూసి అడిగాడు.

● ఎలీషా౼"భయపడకు, సిరియా సైన్యం కంటె మన కోసం యుద్ధం చేసే సైన్యమే చాలా పెద్దది" అని చెప్పి, ఎలీషా దేవునికి ఇలా ప్రార్థన చేశాడు౼“యెహోవా! ఇతడు చూచేలా ఇతడి కండ్లు తెరువు”.

౼యెహోవా ఆ యువకుని కళ్లు తెరిపించాడు. సేవకుడు కొండ చుట్టూ అగ్నిరథాలు గుర్రాలు వుండటం చూశాడు. అవి ఎలీషా చుట్టూ ఉన్నాయి. ❇


ఈ లోకాన్ని చూసే, ఆధ్యాత్మిక లోకం మరొకటి ఉందని బైబిల్ చెప్తుంది(లూకా16:25, 9:31, ప్రక 2:19, 4:1). దేవుడు సమస్త పరిస్థితులను పరిశీలనగా చూస్తాడని, వివేచిస్తాడని లేఖనాలు తెలియజేస్తున్నాయి. పాపం మన మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేస్తాయి, కనుక ఈ విషయాలను గుర్తించలేము. దేవుణ్ణి విశ్వసించని వాడు ఈ లోకసంబంధియై, ఈ లోకం కొరకే బ్రతుకుతాడు, ఈ లోకం వరకే సమస్తం కూర్చుకుంటాడు. కానీ మిగిలేది శూన్యమే!

దేవుడు ఒకని ఆత్మీయ నేత్రాలు తెరిస్తే తప్ప, ఆయన కార్యాలను గాని, సృష్టికర్త కదలికలను గాని గుర్తించలేము. దేవునితో సంభంధం ఉన్న వ్యక్తి ఈ లోకంలో ఉంటూనే ఆధ్యాత్మిక లోక సంబంధిగా జీవిస్తాడు. పరలోక సహవాసాన్ని భూమిపై నిలిపేది, దేవుని యందు మనకున్న విశ్వాసమే! నరులెవ్వరూ చూడలేని గొప్ప దేవుని సన్నిధి నివసించేది మన హృదయాల్లోనే! ఆయనతో ఆ సంభంధం వ్యక్తిగతమైనది. దాని లోతుల్లోకి దేవుడు నడిపించాలని,(దేవుడు కన్నులు తెరువగా) ఆయన లేఖనాల్లోని దైవ జ్ఞానాన్ని (అనుభవపూర్వకంగా) తెల్సుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...