❇ యిర్మియా ద్వారా దేవుడు పలికిన మాటలు.
"మీరు నా మాట వినలేదు...నన్ను విసికించి, మీకు మీరే హాని కొనితెచ్చుకొన్నారు..ఈ దేశమంతా పాడైపోతుంది! శిథిలాలవుతుంది. ఈ జనాలు బబులోను రాజుకు డెబ్భై ఏళ్ళు సేవ చేస్తారు"(యిర్మియా 25:7-11)
అప్పుడు అధికారులు రాజుతో ఇలా చెప్పారు౼“ఆ మనిషికి మరణశిక్ష వేయండి. అలాంటి మాటలు చెప్పి నగరంలో ఉన్న సైనికులనూ ప్రజలందరినీ నిరుత్సాహపరుస్తున్నాడు. అతడు ఈ ప్రజల క్షేమం కోరడం లేదు గాని, కీడునే కోరుతున్నాడు” అన్నారు.(యిర్మియా 38:4)
౼ కానీ యిర్మీయా ఇశ్రాయేలు కోసం విలపించాడు.
"దేవా, నాకు దుఃఖం వస్తూ ఉంది. నాకు మనసులో క్రుంగిపోయినట్లు ఉంది. భయమేస్తూ ఉంది. నా జనులు బాధపడివుండటం వల్ల నేను బాధపడుతున్నాను. నేను మాటలాడలేనంత విచారముగా ఉన్నాను.
నా తల బావిగా, నా కండ్లు కన్నీళ్ళ ఊటగా ఉంటే ఎంత బాగుండేది! అలాంటప్పుడు నా ప్రజలో హతమైన వారికోసం రాత్రింబగళ్ళు కన్నీళ్ళు విడుస్తూ ఉంటాను"(యిర్మియా 8:18,21, 9:1)
౼ యేసు యెరూషలేం పట్టణానికి దగ్గరగా వచ్చినప్పుడు దానిని చూస్తూ దాని కోసం ఏడ్చి౼"ప్రభువు నిన్ను సందర్శించిన కాలం నువ్వు తెలుసుకోలేదు. కాబట్టి నీ శత్రువులు నీ చుట్టూ మట్టి దిబ్బ కట్టి నిన్ను ముట్టడించి అన్ని వైపులనుండి నిన్ను అణచివేస్తారు. నిన్నూ నీలో ఉన్న నీ పిల్లలనూ మంటిపాలు చేస్తారు"(లూకా 19:41- 43) ❇
✔ దేవుని సమాచారం ఎవ్వరు మోసుకొస్తారో వారు దేవుని మనసు కలిగి ఆ పని చెయ్యాలని లేఖనాలు మనకు భోదిస్తున్నాయి. ప్రవక్తలు (చాటున ) ఏడుస్తూనే దేవుడు చెప్పమన్న మాటలు చెప్పక మానలేదు. అది దేవుని మనస్సు. ఇలాంటి మనస్సు లేకుండా చేస్తే , అది నేరాన్ని ఎంచినట్లు అవుతుంది. నేరాన్ని ఎంచడమే ఐతే, సాతాను ఎప్పుడు అదే పనిలో సిద్ధంగా ఉంటాడు కదా!
✔ అలాగని మౌనంగా ఉండటం..దేవుని ప్రేమ చూపటమా?కాదు! దాని తీవ్రతను తెలియజేయటమే(గద్దించడమే) నిజంగా వారిని దైవ ప్రేమతో ప్రేమించినట్లు..చాటున వారి కోసం దుఃఖిస్తూ, (విజ్ఞాపన) ప్రార్థన చేస్తూ ఈ పని చేయాల్సివుంటుంది. ఇలా చేస్తున్నప్పుడు ప్రశ్నించుకోవాల్సిన కొన్ని విషయాలు..
1.నేను దేవుని (ప్రేమా) మనస్సుతోనే ఈ పని చేస్తున్నానా?
2.నిజంగా ఆ స్థితి నుండి బయటకు రావాలని, వారిని హృదయంలో హత్తుకునే ఈ పని చేస్తున్నానా?
3. వారి ఆధ్యాత్మిక జీవితం గూర్చి నిజంగా నాకు భారం ఉందా(ప్రార్ధించానా)?
4. నేను ఎప్పుడైనా వారిని ప్రోత్సహించానా?
5. క్రీస్తు నా స్థానంలో ఉంటే ఆయన వారితో ఇలానే మాట్లాడుతాడా?(ఆయన జాలి, క్షమాపణ, గద్దింపు, కోపం, కొరడా.. ఎవ్వరితో, ఎక్కడ, ఎలా వాడాడో లేఖనాలను చూడండి. అవి తారుమారు అవ్వకూడదు)
★ పాపాన్ని అంగీకరించని(కప్పుకొనే) వేషధారణను, తిరుగుబాటును గద్దించాలి. పాపభంధకాల్లో చిక్కబడి అపవాది కాడి క్రింద ఉన్న బలహీనులకు (సహాయం)కృప చూపాలి. ఏదీ చేసినా పాపభంధకాల్లో నుండి, దేవుని కృపలోకి తేవడమే మన ధ్యేయంగా ఉండాలి.

Comments
Post a Comment