❇
● ప్రభువు ఐగుప్తు నుండి ఒక జనాంగాన్ని రక్షించాడు. కాని నమ్మని వాళ్ళని ఆయన ఆ తరువాత నాశనం చేశాడు.
● తమ స్థానం నిలుపుకోని, అధికారాలను వదిలిన దూతలు, తమకు ఏర్పరచిన నివాస స్థలాలను విడిచిపెట్టారు. దేవుడు వాళ్ళని సంకెళ్ళతో బంధించి కటిక చీకటిలో మహా తీర్పు రోజు కోసం ఉంచాడు.
● అదేవిధంగా, సొదొమ గొమొర్రా, వాటి చుట్టూ ఉన్న పట్టణాలవారు లైంగిక అవినీతికి, అసహజమైన లైంగిక కోరికలకు తమను తాము అప్పగించుకున్నారు. వాళ్ళు శాశ్వత అగ్నికి గురై శిక్ష అనుభవించి, ఉదాహరణగా నిలిచారు (యూదా 5-7) ❇
పైన మూడు ఉదాహరణల్లో చెప్పబడిన వారంతా మొదట దేవుని కృపలో నిలచినవారే! దేవునిచే నిలుపబడి కాపాడబడి, కృపను పొంది, తమ స్వేచ్చాపూర్వకంగా దేవున్నుండి వెరైన వారిగా ఉన్నారు. దేవుడు ఎన్నడూ, ఎవ్వరి స్వేచ్చనూ హరించడు (విశ్వాసుల సైతం).
✔ దేవుడు ఇశ్రాయేలీయులతో-"అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ఒక గొప్ప వాగ్దానం చేసాను. అందుచేత నేనే మిమ్మల్ని ఆ దేశానికి నడిపిస్తాను. ఆ దేశాన్ని నేను మీకు ఇస్తాను. అది మీదే అవుతుంది. నేను యెహోవాను"(నిర్గ 6:8)
౼ వాగ్దానం ఐతే నిలిచి ఉంది, అది స్వతంత్రించుకోవాలంటే విశ్వాసంలో నిలిచివుండాలి.కాబట్టే పస్కా బలిపశువు ద్వారా రక్షించబడి, ఎఱ్ఱ సముద్రమనే బాప్తిస్మం నుండి దాటి(1కోరింధి 10), అంతం వరకు కొనసాగలేని విశ్వాసాన్ని, రక్షించిన హస్తమే నశింపజేసింది. నశించునట్లు చేసింది వారి అవిశ్వాసమే (క్రీస్తులో నిలిచి ఉండని జీవితం)
✔ పూర్వం పాపం చేసిన దేవదూతల్ని కూడా విడిచిపెట్టకుండా దేవుడు వాళ్ళను సంకెళ్లకు అప్పగించి నరకంలో దట్టమైన చీకటిలో తీర్పు వరకు ఉంచాడు.(2పేతు 2:4)
౼దేవదూతలు పరిశుద్ధ దేవుని సముఖంలో నిలిచే గొప్ప అవకాశాన్ని దేవుని వల్ల పొందారు. అక్కడ నిత్యము నిలిచేట్లుగా దేవుని చేత సృష్టించబడ్డారు! ప్రధాన దూత పాపం చేసినప్పుడు, మిగితా దూతలు పాపం చేసినప్పుడు దేవుడే ఆ స్థానాల నుండి వారిని త్రోసేశాడు. అవిశ్వాసాన్ని బట్టి, తిరుగుబాటును బట్టి వారు కోల్పోయారు.(ఆదాము విషయంలోనూ అదే జరిగింది)
✔ శత్రువుల చెరకు సొదొమ గొమొర్రా ప్రజలు వెళ్ళినప్పుడు దేవుడు అబ్రాహాము ద్వారా కాపాడాడు(ఆది 14)
౼కానీ వారు తమ పాపాన్ని వదిలి దేవుని దగ్గరకు వచ్చిన వారు కాదు. కనుకనే దేవుడే వారిని తిరిగి సంహరించాడు.చివరికి దేవదూత చేత చెయ్యి పట్టుకొని కాపాడబడిన లోతు భార్య సైతం వారిలో ఒక దానిగా యెంచబడింది.
★ యూదా, పేతురు, పౌలు ఆ ఉదాహరణలతో క్రొత్త నిబంధనలోని విశ్వాసులను, సంఘాలను హెచ్చరిస్తున్నాడు.మొదట చేప్పటిన విశ్వాసాన్ని దొంగిలించడానికి దొంగ(సాతాను) ఇప్పటికీ సిద్ధంగావున్నాడు(తప్పుడు సిద్దాంతాలే కాదు, లోకం దాని కోరికలతో సైతం. ఈ రెండింటిలో ఏ ఆయుధానైన వాడు వాడతాడు). ఆయన గొఱ్ఱెలు ఆయన స్వరం వింటాయి..అంటే మాట విని, వెంబడిస్తాయి. ఆయనలో ఉంటాయి. కృప పాపానికి లైసెన్సు కాదు. నేడు దేవుని వాగ్దానం ఐతే నిలిచి ఉంది, అంతం వరకు క్రీస్తు యేసులో ఉన్నవారే రక్షించబడినవారు. విశ్వాసం అనే దీపాలు కడ దాకా, ఆయన వచ్చేంత వరకు వెలగాలి. విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించే క్రీస్తు అనే చెట్టులో నిలిచిఉన్నంత వరకు, క్రీస్తు నందు మనం భద్రం చేయబడిన ఉన్నవారము.

Comments
Post a Comment