
అప్పుడు పౌలు కొన్ని పుల్లలేరి నిప్పుల మీద వేస్తుండగా ఒక పాము ఆ వేడికి బయటికి వచ్చి అతని చెయ్యి పట్టుకుంది. ఆ ప్రజలు ఆ పాము అతని చేతిని పట్టుకొని వేలాడటం చూసి, 'ఈ మనిషి తప్పకుండా హంతకుడై ఉంటాడు. ఇతడు సముద్రం నుండి తప్పించుకొన్నప్పటికీ న్యాయం మాత్రం అతణ్ణి బతకనియ్యద'ని తమలో తాము చెప్పుకొన్నారు. కానీ పౌలు మాత్రం ఆ విష జంతువును మంటలో జాడించివేసి, ఏ హానీ పొందలేదు.
వారైతే అతని శరీరం వాచి పోవడమో, అతడు అకస్మాత్తుగా పడి చనిపోవడమో జరుగుతుందని కనిపెడుతున్నారు. చాలాసేపు కనిపెట్టిన తరువాత అతనికి ఏ హానీ కలగకపోవడం చూసి తమ అభిప్రాయం మార్చుకొని, 'ఇతడొక దేవుడు' అని చెప్పసాగారు.🔹(అపో 28:1-6) 


ఒక దేవదూత అతనితో౼'పౌలూ! భయపడకు. నీవు కైసరు ముందు నిలబడాల్సివుంది. ఇదిగో! నీతో కూడ ఓడలో ప్రయాణిస్తున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించాడు' అని చెప్పాడు.(అపో 27:23,24)


◆ విశ్వాసం అంటే దేవుని పనులు(ఉద్దేశ్యాలు/ప్రణాళికలు) ఏమీ అర్థం కాకముందే, మేలు చేయు ఆ దేవుని నమ్మకత్వాన్ని నమ్మడం.
Comments
Post a Comment