Skip to main content

15Aug2017

యేసు-"ఇది మీ ఘడియ. సైతాను శక్తులు రాజ్యం చేస్తున్న ఘడియ"(లూకా 22:53).
క్రీస్తు సిలువపై ఉన్నప్పుడు..

◆ ఆ దారిని పొయ్యేవారు- "దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కట్టేవాడా, నిన్ను నీవే రక్షించుకో..నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీదనుండి దిగిరా!" అంటూ ఆయనను తిట్టారు.


◆ ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు-"వీడు ఇతరుల్ని రక్షించాడు. తనను తాను రక్షించుకోలేడు! 'క్రీస్తు' అనే ఈ 'ఇశ్రాయేలు రాజు' సిలువ మీద నుండి కిందికి దిగి వస్తే అప్పుడు నమ్ముతాం!"

◆ సైనికులు-"నువ్వు యూదుల రాజువైతే నిన్ను నువ్వే రక్షించుకో" అని ఆయనను వెక్కిరించారు.

◆ వేలాడుతున్న ఆ నేరస్థులలో ఒకడు ఆయన్ని దూషిస్తూ- "నువ్వు నిజంగా క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు" అన్నాడు.


✔ యేసు లోక పాపాన్ని మోసుకొనే దేవుని గొఱ్ఱెపిల్ల వలె శిలువలో వధించబడటం దేవుని అనాది కాల ప్రణాళిక!(ఆయన నేరస్తులలో ఒకని వలె ఎంచబడతాడు! యెషయా 53:12). యేసుకు ఈ విషయం బాగా తెలుసు, సిలువ మరణమే దేవుని చిత్తమని! ఆదిలో నుండి సాతానుని ప్రయత్నం..దేవుని మాట పట్ల అవిశ్వాసం చూపేటట్లుగా చేసి, అత్రికమించేట్లు చేయడమే! శిలువలో యేసుపై అంధకార శక్తుల ప్రభావం బహు బలంగా పనిచేసాయి.ఆయనను శోధించిన వారిని మాటలు గమనిస్తే, చీకటి శక్తులు వారిని ఆక్రమించి ౼'సిలువ దిగి, ఆయనను ఆయన రుజువు చేసుకోమన్న' సవాలేనని మనం గమనించొచ్చు. ఒకవేళ ఆయన ఆవిధంగా రుజువు చేసుకుంటే నేడు మానవాళికి రక్షణ, నిరీక్షణ లేదు. ఎందుకంటే లోక పాపానికి దేవుడు సిలువలో శిక్ష విధించాడు.

✔ నూతన నిబంధన పాత నిబంధన కంటే శ్రేష్టమైనది, ఆత్మ సంభంధమైనది. దేవుని ఆమోదం, దేవుడు మన పక్షాన (భౌతికంగా) కలుగజేసుకుంటేనే కాదు..మన శరీరాలు నలగొట్టబడుతూ కూడా సంతోషంతో దేవుణ్ని మహిమపరచడాన్ని నేర్పిస్తుంది. హెబ్రీ 11:35 ముందు వచనాలు, తర్వాత వచనాలకు గల తేడా గమనించండి.రెండు నిబంధనల్లో దేవుడు చూపిన వ్యత్యాసం మనం చూడొచ్చు. నూతన నిబంధన శ్రేష్టమైనది! మన శరీరం ద్వారా ఆత్మలో నుండి దేవుణ్ని మహిమపరచడం!

✔ ఆత్మీయ అంధకారంలో ఉన్న ఆ ప్రజలు క్రీస్తు బలసంపన్నాన్ని గ్రహించలేకపోయ్యారు. క్రీస్తు అంధకార శక్తుల కుయుక్తులను గ్రహిస్తున్నాడు.ఆయనకు బాగా తెలుసు.. ఆయన పోరాడాల్సింది శరీరులతో కాదు గాని అంధకార శక్తులతోనని.ఆయన శరీరులను అప్పుడే క్షమించాడు కదా!.. క్రొత్త నిబంధన మనకు బోధిస్తుంది..మనది ఆత్మీయ పోరాటం! శరీరులతో యుద్ధం ఆడకూడదు.(కొలస్సి 2:15, 1యోహా4:4)

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...