Skip to main content

21Aug2017

■ దేవుడు ఎంతో ధనవంతుడైన యోబు ఆస్తినంతటిని తీసివేసినా, అతని అరికాలునుంచి నడినెత్తివరకు చాలా బాధకరమైన కురుపులను అనుమతించినా...

౼"నేను నా తల్లి గర్భంలోనుంచి వచ్చినప్పుడు దిగంబరిగా వచ్చాను. దిగంబరి గానే తిరిగి వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చాడు. యెహోవా తీసివేశాడు. యెహోవా పేరుకు స్తుతి కలుగుతుంది గాక! మనం దేవుడిచ్చే మేలును మాత్రమేనా అనుభవించేది? కీడు అనుభవించకూడదా?" అన్నాడు.(యోబు 1:21,2:10)

కాని ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి ఎన్నో అద్భుతాల ద్వారా బయటికి తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు వారిని పరీక్షించాడు. అరణ్యములో వారికి నీళ్లు దొరకలేదు.

అప్పుడు ప్రజలు మోషే మీద సణిగారు
౼“ఇప్పుడు మేము ఏమి త్రాగాలి? అసలు నీవు మమ్మల్ని ఈజిప్టు నుండి ఎందుకు తీసుకొచ్చావు? నీళ్లు లేక మేము, మా పిల్లలు, మా పశువులు చావాలని నీవు మమ్మల్ని యిక్కడికి తీసుకొచ్చావా?” అన్నారు (నిర్గ 17:3)

■ "చెరనుంచి తప్పించుకొనిపోయి యింకా యూదాలోనే ఉన్న యూదులు చాలా యిబ్బందుల్లో వున్నారు. వాళ్లు చాలా సిగ్గుతోను, అనేక కష్టాలతోను వుంటున్నారు. యెరూషలేము గోడలు కూల్చబడ్డాయి. వాటి తలుపులు కాల్చివేయబడ్డాయి"

౼అని షూషను కోటలో ఎంతో సౌఖ్యముగా జీవిస్తున్న యూదుడైన నెహెమ్యా విని ఏడ్చి, కొన్ని రోజులు దుఃఖంతో ఉపవాసముండి, దేవునికి విజ్ఞాపన ప్రార్ధన చేశాడు.తిరిగి నిర్మించడానికి బయలుదేరాడు(నెహెమ్యా 1:1-4).

మొదట్లో ఉజ్జియా తన తండ్రి అమజ్యాలాగే యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించేవాడు. ఉజ్జియా యెహోవాను వెదికి అనుసరించాడు. యెహోవాను వెదికి అనుసరించినంత కాలం దేవుడు అతణ్ణి వర్ధిల్లేట్టు చేశాడు.అయితే అతని రాజ్యం స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి(విర్రవీగి) చెడిపోయ్యాడు.(2దిన 26:16)

◆ ఇది ఏమి తెలియజేస్తుంది, ఒకని హృదయం దేవుని ఎదుట సరిగా ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఆయనకు నమ్మకస్తునిగా ఉండగలడు. ఏ స్థితి, పరిస్థితి దేవుని నుండి తొలగటానికి/నిర్లక్ష్య పెట్టడాన్ని కారణంగా చెప్ప సాహసించకూడదు. ఇలా మేఘము వలె ఆవరించే కొన్ని ఉదాహరణలను దేవుడు మన ముందు సాక్షాలుగా ఉంచాడు(ఉంచుతూ ఉన్నాడు).

పౌలు౼"నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితిల్లో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను"(ఫిలిప్పీ 4:11)

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...