Skip to main content

Posts

20Oct2017

❇ దేవుడు అబ్రాహామును పరీక్షించాలనుకొన్నాడు. దేవుడు అబ్రాహాముతో౼"నీకున్న ఒకే కొడుకును, నీవు ప్రేమిస్తున్న ఇస్సాకును తీసుకొని మోరీయా ప్రదేశానికి వెళ్ళు. అక్కడ నేను నీకు చెప్పబోయే పర్వతం మీద అతణ్ణి దహనబలిగా నాకు అర్పించు!" అన్నాడు.... అబ్రాహాము ఉదయాన్నే లేచి దేవుడు తనకు వెళ్లమని చెప్పిన చోటుకి కుమారునితో వెళ్లాడు. అక్కడ అబ్రహాము ఒక బలిపీఠం కట్టాడు. కట్టెలను ఆ బలిపీఠం మీద పెట్టాడు. తర్వాత తన కుమారుడు ఇస్సాకును కట్టివేసాడు. బలిపీఠం మీద కట్టెలపై ఇస్సాకును పరుండబెట్టాడు. దేవునికి బలిగా అర్పించడానికి తన చెయ్యి చాపి ఖడ్గం పైకెత్తి సిద్ధమయ్యాడు.. అప్పుడు దేవునిదూత ఆకాశం నుండి౼"అతణ్ణేమీ చేయకు. దేవుడంటే నీకు భయభక్తులు ఉన్నాయని ఇప్పుడు నాకు తెలుస్తుంది. నా కోసం నీ కొడుకును బలిగా అర్పించడానికి నీవు సిద్ధపడ్డావు. అతడు నీకున్న ఏకైక కుమారుడు. అతణ్ణి సైతం నాకివ్వడానికి వెనక్కు తీయలేదు కనుక నీకు ఈ వాగ్దానం చేస్తున్నాను...."(ఆది 22) ❇ ■ అబ్రాహాము అప్పటికే ధనాన్ని తుచ్ఛమైనది ఎంచి, దేవుని మాటను ఘనపర్చాడు. కానీ ఈ సంఘటనతో దేవుణ్ని పరిపూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నాడని రుజువు చేసుకున్నాడు. ...

18Oct2017

★ i) క్రూరుడు, క్రీస్తు సంఘాన్ని హింసించిన సౌలు(పౌలు) క్రైస్తవునిగా మారిపోయిన తర్వాత తొలిసారిగా యెరూషలేములో ఉన్న అపొస్తలులను(క్రీస్తు శిష్యులును) కలవడానికి ప్రయత్నం చేశాడు, కానీ అతడు మారిపోయ్యాడని నమ్మలేక అందరూ అతనికి భయపడ్డారు. ఎవ్వరూ సహాయం చెయ్యలేదు. ఐతే "బర్నబా" అతనిని చేరదీసి, అపొస్తలుల దగ్గరికి తీసుకొని వచ్చి వారికి పరిచయం చేశాడు (అ.కా 9:26-29). కొన్ని సంవత్సరాల తర్వాత.. ii) పౌలు బర్నబాతో౼ "మనం ఏ ఏ పట్టణాల్లో ప్రభువు వాక్యం ప్రకటించామో, ఆ ప్రతి పట్టణంలో ఉన్న సోదరుల దగ్గరికి తిరిగి వెళ్లి, వారెలా ఉన్నారో చూద్దాము" అన్నాడు. మునుపు తమతో రాకుండా మధ్యలో విడిచి వెళ్ళిపోయిన మార్కును వెంట బెట్టుకొని పోవడం భావ్యం కాదని పౌలు తలంచాడు. ఐతే అతణ్ని వెంటబెట్టుకొని వెళ్ళడానికి బర్నబా ఇష్టపడ్డాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారు ఒకరి నొకరు విడిచి వేరైపోయారు (అ.కా 15:36-41). iii) పౌలు-"పేతురు (క్రీస్తు శిష్యులలో ముఖ్యుడు) అంతియొకయకు వచ్చినప్పుడు అతడు తప్పు చేశాడు. అతడు అన్యులతో(యూదులు కాని వారితో) భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో యూదులు రాగానే వా...

17Oct2017

❇ అమాలేకీయులు వచ్చి రెఫిదీంలో ఇశ్రాయేలీయులతో యుద్ధం జరిగించారు. గనుక మోషే యెహోషువతో ౼"మనకోసం మనుషులను ఎన్నుకొని వారిని తీసుకువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చెయ్యి. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరంపై నిలబడతాను" అన్నాడు. మోషే తనకు చెప్పినట్టే యెహోషువ చేసి అమాలేకీయులతో యుద్ధం జరిగించాడు. మోషే, అహరోను, హూరు ఆ కొండ శిఖరమెక్కారు. అప్పుడు జరిగినదేమిటంటే, మోషే తన చెయ్యి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలవసాగారు; చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలవసాగారు. అయితే మోషే చేతులు బరువెక్కాయి. అందుచేత వారు ఒక రాయి తీసుకువచ్చి దానిమీద మోషేను కూర్చోబెట్టారు. అహరోను ఈ ప్రక్క, హూరు ఆ ప్రక్క ఉండి, అతని చేతులు క్రిందకు దించకుండా ఎత్తి పట్టుకొన్నారు. అలా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకూ కదలకుండా ఉన్నాయి. ఆలోగా యెహోషువ ఖడ్గంతో అమాలేకీయుల రాజునూ, అతని సైన్యాన్ని ఓడించాడు. ❇ ■ రెఫిదీంకు దేవుడే ఇశ్రాయేలీయులను నడిపించాడు(నిర్గ 17:1). మొదట అక్కడ నీళ్లు దొరకనదుకు వాళ్ళు మోషేపై దేవునిపై సణిగారు. దేవుడు బండను చీల్చి వారి దాహాన్ని తీర్చాడు. తర్వాత అక్కడే అమాలేకీయులు వారితో యుద్దానికి దిగారు...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...

14Oct2017

❇ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు. వారి ముందు ఇశ్రాయేలీయులు నిలువలేక పారిపోయారు.చాలా మంది సైనికులు గిల్బోవ పర్వతం మీద చంపబడ్డారు. రాజైన సౌలు యొక్క ముగ్గురు కుమారులను అతని కళ్ళ ముందే చంపారు. ఇది చూసి అప్పటికే బాగా గాయపడిన సౌలు తనను తాను పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిలిష్తీయులు సౌలు తలను ఛేదించి దాగోను దేవుడి గుడిలో తగిలించారు. అతని మొండాన్ని బేత్షాను పట్టణపు గోడకు తగిలించారు. ఇలా దేవుని చేత అభిషేకించబడిన రాజైన సౌలు జీవితం విషాదంతో ముగిసింది. సౌలు దేవుని ఆజ్ఞలను త్రోసిపుచ్చి, దేవుని దృష్టి యెదుట ద్రోహము చేశాడు. అంతేకాకుండా దేవుని దగ్గర కనిపెట్టకుండా కర్ణపిశాచముల సహాయంతో సోదె చెప్పె దానిని వెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ కారణాలను బట్టి దేవుడు అతనికి మరణశిక్ష విధించి, రాజ్యాన్ని దావీదు వశము చేసెను.(1దిన 10) ❇ ✔ ఒకప్పుడు ఇదే ఇశ్రాయేలీయులే ఫిలిష్తీయులను తరిమి తరిమి చంపారు(1సమూ 17:52). శత్రువులైన ఫిలిష్తీయులు దండెత్తి వచ్చిన ప్రతిసారీ వారి ప్రయత్నాలను తిప్పికొట్టారు. కారణం దైవభయం కలిగిన శూరుడైన దావీదు. దేవుని యెదుట సుబుద్ధి కలిగిన ఒక్క వ్యక్తి ప్రభావం, ఆ దేశం అంతటిపైనా కన...

11Oct2017

❇ "దేవుని మీద విశ్వాసం వల్లే మోషే, పెద్దవాడయిన తరువాత ఐగుప్తు చక్రవర్తి కూతురి కుమారుడని అనిపించుకోవడానికి నిరాకరించాడు. అల్పకాలం పాపంలోని సుఖభోగాలు అనుభవించడానికి బదులు దేవుని ప్రజలతో హింసలు అనుభవించడానికే అతడు కోరుకొన్నాడు" "తన ద్వారానే ఇశ్రాయేలీయులను దేవుడు విడిపిస్తాడనే విషయం తన బానిస సోదరులు గ్రహిస్తారని, మోషే అనుకొన్నాడు. కానీ వారు గ్రహించలేదు. వారి నిమిత్తమే మోషే ఒక ఐగుప్తుయుని హత్య చేశాడు. ఆ విషయం బయటపడినందుకు మోషే మిద్యానుకు పారిపోయాడు" ❇ ■ ఐగుప్తు రాజకుమారుడుగా పెరిగిన మోషే, దేవుని మీద విశ్వాసంతో ఎవ్వరూ చేయ్యలేని త్యాగాన్ని చేశాడు. అంతఃపురాన్ని, విలాసవంతమైన సుఖసౌఖ్యాలు వదిలి, బానిసల్లో ఒకనిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. కానీ బానిసలైన అతని స్వంత ప్రజలే అతన్ని తిరస్కరించారు. అతని విశ్వాసం, త్యాగపూరితమైన నిర్ణయం.. అతణ్ణి దేవుని పనికి సమర్థునిగా చెయ్యలేకపోయింది. అవమాన భారంతో,చివరికి చేదైన అనుభవాలతో కృంగిపోయి, అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ■ ఒకవేళ ఆ సమయంలో ఎన్నో ప్రశ్నలు మోషేలో మదిలో మెదిలి ఉండొచ్చు. "వీరి కోసం ఎంత చేసినా గుర్తించని కఠినమైన ప...

10Oct2017

❇  "మీరు పాపం విషయంలో చనిపోయారనీ, దేవుని విషయంలో మన ప్రభువైన క్రీస్తు యేసులో సజీవులనీ మిమ్ములను మీరే ఎంచుకోండి" (రోమా 6:11) "మరణించిన యేసును సజీవంగా లేపిన దేవుని ఆత్మ (పరిశుద్ధాత్ముడు) మీలో నివసిస్తున్నట్లైతే, చనిపోయిన వారిలో నుంచి క్రీస్తును లేపిన దేవుడే, చావుకు లోనయ్యే మీ శరీరాలను కూడా, మీలో నివాసముంటున్న ఆయన ఆత్మ ద్వారానే బ్రతికిస్తాడు" (రోమా 8:11) ❇ ✔ మన పాపం వల్ల దేవునితో ఎడబాటు(ఆత్మలో చచ్చిన స్థితి)౼ రక్షకుడైన యేసులో విశ్వాసం వల్ల దేవుని ఉగ్రత నుండి రక్షణ గూర్చి నిన్నటి ధ్యానంలో తెల్సుకున్నాము. "ఒకప్పుడు పాపంలో స్వేచ్ఛగా జీవించి, దేవునితో సంభంధం విషయంలో చచ్చిన మనం, నేడు పాపం విషయంలో చనిపోయిన వారిగా, దేవుని విషయంలో జీవం గలిగిన వారిగా ఎంచుకోమని" బైబిల్ బోధిస్తుంది. ✔ అంటే "యేసు సిలువలో నా పాపం నిమిత్తం చనిపోయాడు, నా పాపంపై సంపూర్ణ విజయంతో తిరిగి లేచాడు" అని నమ్మిన మనం,అదే విశ్వాసాన్ని మన జీవితంలో కూడా రుజువు చెయ్యాల్సివుంది. క్రీస్తు సిలువలో చనిపోయినప్పుడు నీ పాపాన్ని తనపై వేసుకొని, నీ స్థానంలో చనిపోయ్యాడు అని నమ్ముతున్నావు కదా! ఇప్పుడు రక...

07Oct2017

❇ యేసు ఒక కథ చెప్పాడు–"తన పొలంలో మంచి విత్తనాలు చల్లించిన రైతులా పరలోకరాజ్యం ఉంది. ఆ రైతు పనివాళ్ళు నిద్రపోతూ ఉంటే, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య కలుపు మొక్కల విత్తనాలు చల్లి పోయాడు. మొక్కలు పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి . అప్పుడు పనివాళ్ళు ఆ రైతు దగ్గరికి వచ్చి౼"అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం చల్లించావు గదా! అందులో కలుపు మొక్కలు ఎలా వచ్చాయి?" అని అడిగారు. "ఇది పగవాడు చేసిన పని!" అని అతడు వారితో అన్నాడు. పనివాళ్ళు౼"మేము వెళ్లి ఆ కలుపు మొక్కల్ని పీకేయ మంటారా?" అని అతన్ని అడిగారు. అందుకా రైతు౼"వద్దు! కలుపు మొక్కల్ని పీకివేసేటప్పుడు, వాటితోపాటు గోధుమ మొక్కల్నీ పెళ్లగిస్తారేమో..కోతకాలం వరకు రెండింటిని కలిసి పెరగనివ్వండి. కోతకాలంలో 'ముందుగా కలుపు మొక్కలు పోగుచేసి కాల్చి వేయడానికి కట్టలు కట్టండి. అప్పుడు గోధుమలు నా గిడ్డంగిలో చేర్చండి' అని కోత కోసే వారికి చెబుతాను" అన్నాడు ❇ ✔ ప్రతి రైతు తన పొలం నుండి శ్రేష్ఠమైన పంటనే ఆశిస్తాడు. దేవుడు ఈ లోకమనే పొలంను శ్రేష్ఠమైన వాటితో నింపాడు. ఆయన మాటలనే మంచి...

09Oct2017

❇ మన అతిక్రమాల వల్ల, పాపాల వల్ల మనం చచ్చిన వాళ్ళంగా ఉన్నాము...ఐతే దేవుడు కరుణాసంపన్నుడు కాబట్టి, మనం ఇలాంటి స్థితిలో ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనల్ని క్రీస్తుతో ద్వారా బ్రతికించాడు.క్రీస్తులో విశ్వాసం ద్వారా, దేవుని కృప చేతనే మనకు రక్షణ కలుగుతుంది. ఇది మన మంచి పనుల వల్ల కలిగింది కాదు, దేవుడిచ్చిన బహుమానమే! కాబట్టి ఎవరూ దేవుని రక్షణ గూర్చి గొప్పలు చెప్పుకోడానికి వీల్లేదు. ❇ ✔ మనం దేవునితో ఏమాత్రం సంబంధం లేనివారమై, పాపం చేస్తూ ఉన్నాము. దేవునితో ఉన్న ఈ ఎడబాటునే బైబిల్ "ఆత్మలో చచ్చిన స్థితి" అని పిలుస్తుంది. చనిపోయిన వాడు లోకంతో ఉన్న అన్ని సంభంధాలను, అనుబంధాలను కోల్పోతాడు. అలాగే దేవుడు సృష్టించిన సృష్టిలో బ్రతుకుతున్నప్పటికీ, ఆ దేవుని ఉనికిని, సహవాసాన్ని ఏమాత్రం గుర్తించని వాడిగా ఉంటాడు. కానీ మానవాళి(సృష్టి) అంతా ఆ దేవుని మీదే ఆధారపడి జీవిస్తువుంది. దేవుడు మనిషికి దూరంగా ఉన్నాడా?లేదు..మనమే చచ్చిన స్థితిలో దేవునితో సంభంధం లేక ఉన్నాము. వాయుమండలంలో తిరుగాడే (సాతాను) దైవవిరోధమైన ఆత్మ సృష్టిలో ఉంది. ఎంతో జ్ఞానపూరితమైన ఈ లోకంలో, అత్యంత అసహ్యమైన పనులు జరుగుతూ ఉన్నాయి...

05Oct2017

❇ పేతురు పెంతుకోస్తూ దినాన నిలువబడి౼"ఇశ్రాయేలు ప్రజలారా! ఈ మాటలు వినండి..దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలూ మహత్కార్యాలూ సూచకక్రియలూ మీ మధ్య చేయించి, ఆయనను తన దృష్టికి యోగ్యుడుగా కనపరిచాడు. ఇది మీకూ తెలుసు!..ఈయన్ని మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించారు. మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం గనుక దేవుడు మరణ వేదనల నుంచి ఆయన్ను విడిపించి సజీవంగా లేపాడు" ఇది వింటూ ఉంటే వారికి గుండెలలో బాకుతో పొడిచినట్లయి ౼"సోదరులారా, మేమేం చేయ్యాలి?"అని పేతురునూ మిగతా అపొస్తలులనూ అడిగారు. దానికి పేతురు౼"మీరు పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ కోసం ప్రతివాడూ యేసుక్రీస్తు పేరున బాప్తిస్మం పొందండి". ఇంకా అతడు అనేక రకాలైన మాటలతో వారికి సాక్ష్యమిచ్చి "మీరు యీ దుష్టతరం నుండి వేరుపడి రక్షణ పొందండి" అని వారిని హెచ్చరించాడు. ❇ ✔ ఇశ్రాయేలు ప్రజలు అప్పటికే వారు యేసును సిలువకు అప్పగించి మహా పాపానికి ఒడిగట్టారు. నిజానికి యేసును ప్రధాన యాజకులు, మత పెద్దలే కుట్రపన్ని చంపినా..పరోక్షంగా ప్రజలు దానికి సమ్మతి పలికారు. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైన సమ్మతించిన పాపం పాపమేనని ఈ మాటల ద్వారా గ్ర...

04Oct2017

❇ మనుషులవల్ల లోకం దౌర్జన్యంతో నిండి ఉంది. మనుషులంతా తమ జీవిత విధానాన్ని పాడు చేసుకొన్నందుకు లోకం భ్రష్టమైన స్థితిలో ఉంది. అది దేవుడు చూశాడు. కానీ నోవహు తన తరంవారిలో న్యాయవంతుడూ,నిందారహితుడూ దేవుని సహవాసంలో నడిచినవాడు. ఒకరోజు దేవుడు నోవహుతో౼"మనుషుల దౌర్జన్యన్ని బట్టి నా సముఖం నుంచి వారిని, ప్రతి శరీరి నిర్మూలమైపోబోతుంది. నేను మానవాళిని భూమితోపాటు నాశనం చేస్తాను.నీవైతే తమాల మ్రానుతో ఒక ఓడను నీకోసం చేసుకో...నేను భూలోకం మీదికి జలప్రళయాన్ని రప్పిస్తున్నాను. అవును, నేనే ప్రతి శరీరినీ, ఊపిరి ఉన్న ప్రతిదానిని ఆకాశం క్రింద ఉండకుండా నిర్మూలం చేస్తాను. అయితే నేను నీతో నా నిబంధన చేస్తాను. నీవూ, నీతోపాటు నీ కొడుకులూ, నీ భార్యా, నీ కోడళ్ళూ ఓడలోకి వెళ్ళాలి. వాటి వాటి జాతుల ప్రకారం అన్ని విధాల పక్షుల్లో, పశువుల్లో, భూమిమీద తిరిగే ప్రతి జాతిలో మగది, ఆడది బ్రతికునట్లు అవి నీ దగ్గరికి వస్తాయి" ❇ ✔ దేవునికి విసుగు పుట్టించిన మనుష్యులతో నీతిమంతుడైన నోవహు ఎలాంటి భాధలు పడుతూ బ్రతికి ఉంటాడో ఉహించండి. ఒకవేళ వారిలో ఒకడైతే సమస్యే ఉండదు కానీ లోకానికి వేరుగా జీవించి దేవునితో నడిచే వ్యక్తియైతే(odd man...

03Oct2017

❇ నయోమి బెత్లెహేము ప్రజలతో౼“నన్ను నయోమి అనకండి. సర్వశక్తిమంతుడు నాకు దుఃఖం కలిగించాడు..నేను మోయాబు వెళ్ళిపోయినప్పుడు నాకు సమృద్ధి ఉంది. ఇప్పుడు ఏమీ లేకుండా నన్ను తిరిగి వచ్చేలా యెహోవా చేశాడు.. యెహోవా నాకు విరుద్ధ సాక్షిగా నిలబడ్డాడు. సర్వశక్తిమంతుడు నామీదికి ఆపద రప్పించాడు.” బోయజు రూతుతో౼“నీ భర్త చనిపోయిన తరువాత...నీవు నీ తల్లిదండ్రులనూ నీ జన్మభూమినీ విడిచి, ఇంతకుముందు నీకు తెలియని ఈ ప్రజలమధ్యకు వచ్చావు. నీవు చేసినదానికి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు. ఇస్రాయేల్ దేవుడైన యెహోవా రెక్కల కింద శరణు కోరి నీవు వచ్చావు. ఆయన నీకు పరిపూర్ణ బహుమతి ఇస్తాడు" ❇ ✔ బెత్లెహేములో కరువు వచ్చినందుకు నయోమీ, ఆమె భర్త-ఇద్దరు పిల్లలతో బ్రతుకు తెరువు కోసం మోయాబు దేశానికి వలస వెళ్లారు. వారు భూసంభందమైన విషయాలకు మాత్రమే విలువనిచ్చారు. దేవుని వాక్యాన్ని-విశ్వాసుల సహవాసాన్ని, దేవుని వాగ్ధాన దేశాన్ని వదలిపెట్టి, విశ్వాసరహిత ప్రయాణం చేశారు. కొన్నిరోజుల తర్వాత ధర్మశాస్త్రనికి విరుద్ధంగా అవిశ్వాసులతో వియ్యమొందారు. ఐతే నయోమీ ఊహించిన జీవితానికి విరుద్ధంగా వాస్తవ జీవితంలో దుఃఖమే మిగిలింది. ఆమె తన భర్తను, ఇద్ద...

30Sep2017

❇ యేసు పరిశుద్ధాత్మతో నిండి యొర్దాను నది నుండి తిరిగి రాగా దేవుని ఆత్మ ఆయన్ని అరణ్యంలోకి నడిపించాడు. అక్కడ 40 రోజులు సాతాను ఆయన్ని విషమ పరీక్షలకు గురి చేశాడు. ఆ రోజుల్లో ఆయన ఏమీ తినలేదు గనుక ఆయనకు బాగా ఆకలి వేసింది. అప్పుడు.... ● సాతాను ఆయనతో౼"నీవు దేవుని కుమారుడివయితే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు" అన్నాడు. యేసు౼"మనిషి కేవలం ఆహారంతోనే బతకడు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్లా బతుకుతాడు అని రాసి ఉంది"   ✔ 40 రోజుల క్రిందట దేవుడు-యేసును గూర్చి'ఈయనే నా ప్రియమైన కుమారుడు' అని సాక్ష్యం పలికాడు. ఆ మాటతోనే మొదలు పెడుతూ సాతాను ఆయన్ను శోధించడం మనం గమనించవచ్చు. అపవాది యేసులోని దైవత్వం నిరూపించు కొమ్మని అడిగితే, సాత్వికుడైన యేసు తను తాను మానవుని (మనుష్యుడు)గా బదులు పలుకుతున్నాడు. ఏదేనులో దేవతల వలె ఉంటారన్న సాతాను అబద్ధపు ప్రలోభాలకు మొదటి మనుష్యులు పూర్తిగా లోబడ్డారు. వారు ఆత్మకంటే శరీరాన్ని, భూసంభందమైన సౌఖ్యలకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ యేసు తన శరీర ఆకలిదప్పుల కృశించి పోతున్నప్పటికి దేవునితో సంభంధం కలిగి ఉండటాన్నే విలువైనదిగా ఎంచాడు. ● ఆ తర్వాత ...

26Sep2017

❇ సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో భోజనానికి కూర్చున్నాడు. వారంతా భోజనం చేస్తుండగా యేసు౼"మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను" అన్నాడు. అందుకు వారు చాలా దుఃఖంలో మునిగిపోయారు. ఒకరి తరువాత ఒకరు ఆయనతో౼"నేను కాదు కదా!" అని ఆయన్ని అడగటం ప్రారంభించారు. ఆయన౼"నాతో కలిసి పాత్రలో చెయ్యి ముంచి భోజనం చేసేవాడే నన్ను పట్టిస్తాడు. దేవుని నిర్ణయం ప్రకారం మనుష్యకుమారుడు చనిపోవలసిందే గాని ఆయనను ఎవరు పట్టిస్తాడో ఆ వ్యక్తికి 'శిక్ష (యాతన)' తప్పదు. ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండక పోయి ఉంటే అతనికి మంచిది." ❇ ✔ 'క్రీస్తుకు సిలువ మరణం' దేవుని నిర్ణయమే కానీ ఇస్కరియోతు యూదా కుయుక్తి-ద్రోహం దేవుడు ఆదేశించినవి కావు. దేవుడు ఎన్నడూ చెడుకు కర్త కాదు. కాబట్టి కీడు తలపెట్టి దేవుని చిత్తం జరిగించానని ఎవడూ అనకూడదు. అంటే "క్రీస్తు సిలువ వేయబడి చనిపోవడం వల్లే నేడు అనేకులు రక్షించ బడ్డారు/బడుతున్నారు, కనుక నా ద్వారా దేవుడు ఈ పనిని జరిగించాడు, ఈ మంచి పని కోసం దేవుడు నన్ను వాడుకున్నాడు" అని ఇస్కరియోతు యూదా చెప్ప కూడదు/చెప్పలేడు. ద...

25Sep2015

❇ బాప్తిస్మమిచ్చే యోహాను పుట్టుక గురించి దేవదూత ముందుగానే అతని తండ్రికి ఈ విధంగా తెలియజేశాడు.. గబ్రియేలు దూత జెకర్యాతో౼"జెకర్యా, భయపడకు. నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కొడుకును కంటుంది. అతనికి యోహాను అని పేరు పెడతావు...తల్లి గర్భాన పుట్టింది మొదలు దేవుని పరిశుద్ధాత్మతో నిండి ఉంటాడు. ఇశ్రాయేలీయుల్లో అనేకమందిని వారి ప్రభువైన దేవుని వైపుకు మళ్ళిస్తాడు. తండ్రుల హృదయాలను పిల్లల వైపుకీ, అవిధేయులను నీతిమంతుల జ్ఞానానికీ మళ్ళించడానికీ, తద్వారా ప్రభువు కోసం సిద్ధపడిన ప్రజానీకాన్ని తయారు చేయడానికి అతడు 'ఏలియా' మనసుతో బలప్రభావాలతో ప్రభువు కంటే ముందుగా వస్తాడు" ❇ ✔ బాప్తిస్మమిచ్చే యోహాను తన తల్లిదండ్రుల ముసలితనంలో పుట్టడం వల్ల, వారిని తన చిన్నతనంలోనే కోల్పోయాడు. ఒకవేళ అందువల్లే కాబోలు..అతని జీవనం అరణ్యములో కొనసాగింది. మిడతలు, అడవి తేనెను తింటూ, ఒంటె చర్మం ధరించాడు(మత్తయి 3:4). ఇతని వస్త్రధారణకు, మత పెద్దలు ధరించిన వస్త్రధారణకు చాలా తేడా ఉండేది. చూడగానే అడవి మనిషిని తలపించే ఆకారం.బాప్తిస్మమిచ్చే యోహానును అప్పటి మత పెద్దలు దైవ సంభంధిగా అంగీకరించ లేదు, పైగా దెయ్యం...

23Sep2017

❇ ఆదిలో దేవుడు భూమి, ఆకాశాలనూ సృజించాడు. అప్పుడు భూమి మొత్తం శూన్యంగా, రూపం లేకుండా ఉంది. మహా సముద్రాన్ని చీకటి ఆవరించింది. దేవుని ఆత్మ నీళ్ళపై సంచరిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు౼“వెలుగు కలుగును గాక!” అనగానే, వెలుగు వచ్చింది. దేవుడు ఆ వెలుగు చూశాడు. అది చక్కగా ఉన్నట్లు ఆయన చూసాడు. అప్పుడు దేవుడు ఆ వెలుగును, చీకటి నుండి 'వేరు' చేసాడు. వెలుగుకు “పగలు” అని, చీకటికి “రాత్రి” అని పేరు పెట్టాడు. అస్తమయము, ఉదయం అయ్యింది. ఇది మొదటి రోజు ❇ ■ దేవుడు సృష్టి నిర్మాణం అంతటిని ఆరు రోజుల్లో ముగించాడు. ఆదిలో ఖాళీగా, ఆకారం లేకుండా ఉన్న భూమిని దేవుడు తన ఆలోచనల్లోని రూపంతో నింపాలని కోరుకున్నాడు. ఆయన మాట పలుకగా, తన ఆత్మ ద్వారా నూతన నిర్మాణం జరిగింది. దినదినం ఆయన కోరుకున్న రూపంలోకి మార్పు చెందుతూ వచ్చింది.నేడు ఏ మాత్రం నిరీక్షణ లేని (శూన్యంగా, రూపంలేకుండా ఉన్న) జీవితాలపై దేవుడు పని చేయడానికి ఇష్టపడతాడు (మానవులందరి జీవితాలు ఈ స్థితిలోనే ఉన్నట్లు దేవుడు చూస్తున్నాడు). ■ నేర్పరియైన శిల్పి ఆకృతి లేని రాయిలో అందమైన రూపాన్ని ముందుగానే తన ఆలోచనల్లో చూచినట్లే...దేవుడు కూడా అస్తవ్యస్తంగా, ని...

21Sep2017

❇ యేసు ఆ దార్లోనే వస్తున్నాడని, జక్కయ్య తెల్సుకొని ముందుగా పరిగెత్తి వెళ్లి ఒక మేడి చెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, తలెత్తి చూసి౼"జక్కయ్యా, త్వరగా దిగిరా. ఈ రోజు నేను నీ ఇంట్లో ఉండాలి" అన్నాడు అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను తన ఇంటికి తీసుకు వెళ్ళాడు.అది చూసి జనులందరూ౼"ఈయన ఒక పాపి ఇంటికి అతిథిగా వెళ్ళాడు" అని గొణగడం మొదలు పెట్టారు ❇ ✔ యేసు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నవారందరిలో పాపాత్ములైన వారిని, తిరస్కరించబడిన వారిని, బలహీనులైన వారిని, నిస్సాహయులైన వారిని, ఈ లోకం వెలివేసిన వారిని, యదార్థవంతులను వెతుక్కుంటూ వెళ్తాడు. సమరయ స్త్రీ, సేన దెయ్యం పట్టిన వాడు, 38 సం|| నుండి కోనేరు దగ్గర ఉన్న రోగి, గుడ్డివాడై స్వస్థత పొంది వెలివేయబడిన వ్యక్తి , జక్కయ్య, జాలరులు, సుంకరులు, పాపులు మరియు సిలువపై దొంగ..మె||. నీవు క్రీస్తును అనుసరించాలి అనుకుంటున్నావా(క్రీస్తు శిష్యుడవా)? ఐతే ఆయన స్వభావాన్ని అనుసరించు. నీవు ఉన్న చోట..పాపంలో కూరుకుపోయిన వారు, సరిగ్గా ప్రవర్తించడం చేతకానివారు, నిర్లక్ష్యం చేయబడిన వారు, లోకరిత్యా హీనపర్చబడిన వారు, ఒంటరులను కనిపెట్టు. ఈ లోకసంబంధులు ఇ...