Skip to main content

20Oct2017

❇ దేవుడు అబ్రాహామును పరీక్షించాలనుకొన్నాడు.

దేవుడు అబ్రాహాముతో౼"నీకున్న ఒకే కొడుకును, నీవు ప్రేమిస్తున్న ఇస్సాకును తీసుకొని మోరీయా ప్రదేశానికి వెళ్ళు. అక్కడ నేను నీకు చెప్పబోయే పర్వతం మీద అతణ్ణి దహనబలిగా నాకు అర్పించు!" అన్నాడు....

అబ్రాహాము ఉదయాన్నే లేచి దేవుడు తనకు వెళ్లమని చెప్పిన చోటుకి కుమారునితో వెళ్లాడు. అక్కడ అబ్రహాము ఒక బలిపీఠం కట్టాడు. కట్టెలను ఆ బలిపీఠం మీద పెట్టాడు. తర్వాత తన కుమారుడు ఇస్సాకును కట్టివేసాడు. బలిపీఠం మీద కట్టెలపై ఇస్సాకును పరుండబెట్టాడు. దేవునికి బలిగా అర్పించడానికి తన చెయ్యి చాపి ఖడ్గం పైకెత్తి సిద్ధమయ్యాడు..

అప్పుడు దేవునిదూత ఆకాశం నుండి౼"అతణ్ణేమీ చేయకు. దేవుడంటే నీకు భయభక్తులు ఉన్నాయని ఇప్పుడు నాకు తెలుస్తుంది. నా కోసం నీ కొడుకును బలిగా అర్పించడానికి నీవు సిద్ధపడ్డావు. అతడు నీకున్న ఏకైక కుమారుడు. అతణ్ణి సైతం నాకివ్వడానికి వెనక్కు తీయలేదు కనుక నీకు ఈ వాగ్దానం చేస్తున్నాను...."(ఆది 22) ❇


■ అబ్రాహాము అప్పటికే ధనాన్ని తుచ్ఛమైనది ఎంచి, దేవుని మాటను ఘనపర్చాడు. కానీ ఈ సంఘటనతో దేవుణ్ని పరిపూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నాడని రుజువు చేసుకున్నాడు. తన ముసలితనంలో పుట్టిన, తాను ఎంతో ప్రేమించిన ఏకైక కుమారుడ్ని దేవునికి అర్పించడానికి సిద్ధపడినప్పుడు..ఇక దేవునికి ఇవ్వకుండా తన దగ్గర దాచుకునేది ఏమి లేదని స్పష్టం చేస్తున్నాడు.ఏకైక కుమారుడ్ని సైతం చంపుకోవడానికి ఇష్టపడుతున్నాడంటే దేవునికి తన హృదయంలో ఎలాంటి స్థానం ఇచ్చాడో అర్ధం చేసుకోవచ్చు!

■ ఇంతకీ దేవుడు ఇస్సాకును బలిగా కోరలేదు..మరి ఈ విధంగా ఎందుకు జరిగించునట్లు? దేవుడు తన ప్రేమను మనుష్యులకు చెప్పాలనుకుంటున్నాడు. తన ఏకైక కుమారుడైన యేసును బలిగా సిలువలో వధించడం ద్వారా లోకాన్ని ఎంత పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడో తెలియజేస్తున్నాడు. అబ్రాహాము లాగా దేవుడు తన ఏకైక కుమారుడ్ని(యేసును సిలువలో) విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడంటే, మన విలువ ఆయన హృదయంలో ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు!మనకు ఆ అర్హత ఉందని కాదు..ఆయన ప్రేమ గొప్పది. అబ్రాహాము దేవుని కోసం ఎందుకు వదులుకున్నాడంటే ఒక కారణం ఉంటుంది..దేవుడు అందుకు అర్హుడు. ఏ అర్హత లేని నన్ను/నిన్ను దేవుడు క్రీస్తుతో సమానంగా ప్రేమిస్తున్నాడు. (అబ్రాహాము-దేవుని కోసం ఇస్సాకును వదులుకున్నాడు,మరి దేవుడు-మన కోసం క్రీస్తును విడిచిపెట్టాడు గనుక )ఆయన హృదయంలో మొదటి స్థానం మనకివ్వడానికి ఇష్టపడ్తున్నాడని గ్రహించవచ్చు!కొన్ని వేల యుగాలుగా ఆయన్ను ఆరాధించే కోటానుకోట్ల నమ్మకస్తులైన దేవదూతలు, ఆయన చేతి పనియైన విలువైన సృష్టి ఆయనకు సంతోషాన్ని ఇవ్వలేదు. కానీ, ఆయన రూపంలో చేయబడ్డ కుమారులమైన మన సహవాసంలో(స్నేహంలో) దేవుడు గొప్ప ఆనందాన్ని పొందుతాడని లేఖనాలు చెప్తున్నాయి (లూకా 15:7).ఇది నిత్యుడైన పరమ తండ్రి ప్రేమ! పరిపూర్ణ ప్రేమ!

■ పరిపూర్ణమైన ప్రేమ ఏమి తన కోసం దాచుకోదు. దేవుడు మన కోసం ఏమి దాచుకోక సమస్తం కంటే మనల్ని ముందు పెట్టుకున్నట్లే, మానవుడు కూడా దేవుణ్ని పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమిస్తేనే అతని జన్మ సార్ధకం అవుతుంది.ఎందుకంటే మానవుడు దేవుని పొలికలో ఉన్నాడు. అలా మనం ప్రేమించనప్పుడు అది శూన్యతకు దారి తీస్తుంది. కనుకనే అన్ని ఉన్నా ఏదో వెలితి మనుష్యులు హృదయాన్ని ఆవరిస్తుంది. దేవుడు అతని జీవితంలోకి వచ్చినప్పుడే పరిపూర్ణమైన, ఆనందమైన, సంతృప్తికరమైన జీవితాన్ని జీవించగలడు.అది ఎలాగో యేసయ్య జీవితం మనకు నేర్పిస్తుంది. ఆ జీవితానికి దేవుని ఆత్మ మనకు సహాయకుడు. ఈ జీవిత అనుభవంలోకి నడిపించమని దేవుణ్ని అడుగు!నిన్ను ప్రేమిస్తున్న ఆ దేవుడు, నిజంగా నీ ప్రార్ధన వింటాడు.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...