❇ మన అతిక్రమాల వల్ల, పాపాల వల్ల మనం చచ్చిన వాళ్ళంగా ఉన్నాము...ఐతే దేవుడు కరుణాసంపన్నుడు కాబట్టి, మనం ఇలాంటి స్థితిలో ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనల్ని క్రీస్తుతో ద్వారా బ్రతికించాడు.క్రీస్తులో విశ్వాసం ద్వారా, దేవుని కృప చేతనే మనకు రక్షణ కలుగుతుంది. ఇది మన మంచి పనుల వల్ల కలిగింది కాదు, దేవుడిచ్చిన బహుమానమే! కాబట్టి ఎవరూ దేవుని రక్షణ గూర్చి గొప్పలు చెప్పుకోడానికి వీల్లేదు. ❇
✔ మనం దేవునితో ఏమాత్రం సంబంధం లేనివారమై, పాపం చేస్తూ ఉన్నాము. దేవునితో ఉన్న ఈ ఎడబాటునే బైబిల్ "ఆత్మలో చచ్చిన స్థితి" అని పిలుస్తుంది. చనిపోయిన వాడు లోకంతో ఉన్న అన్ని సంభంధాలను, అనుబంధాలను కోల్పోతాడు. అలాగే దేవుడు సృష్టించిన సృష్టిలో బ్రతుకుతున్నప్పటికీ, ఆ దేవుని ఉనికిని, సహవాసాన్ని ఏమాత్రం గుర్తించని వాడిగా ఉంటాడు. కానీ మానవాళి(సృష్టి) అంతా ఆ దేవుని మీదే ఆధారపడి జీవిస్తువుంది. దేవుడు మనిషికి దూరంగా ఉన్నాడా?లేదు..మనమే చచ్చిన స్థితిలో దేవునితో సంభంధం లేక ఉన్నాము. వాయుమండలంలో తిరుగాడే (సాతాను) దైవవిరోధమైన ఆత్మ సృష్టిలో ఉంది. ఎంతో జ్ఞానపూరితమైన ఈ లోకంలో, అత్యంత అసహ్యమైన పనులు జరుగుతూ ఉన్నాయి. మనకు తెలియకుండానే ఆ దురాత్మ ప్రేరణలకు లోబడుతూ మన శరీర కోర్కెల చొప్పున, దురాశల చొప్పున నడుచుకుంటూ మనల్ని మనం దేవుని ఉగ్రతకు యోగ్యులంగా బ్రతుకుతున్నాం. ఈ లోకం అంతా దేవుని శిక్ష క్రింద ఉందని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. చిన్న తప్పులు-పెద్ద తప్పులు, బయటికి కనబడేవి-లోపల ఆలోచించినవి, మంచివారు-చెడ్డవారు అనే తేడా లేకుండా అందరూ దేవుని శిక్ష క్రింద ఉన్నవారే! కారణం..దేవుని కొలమానం దేవుని నీతి. ఆ కొలత క్రింద అందరూ ఆ త్రాసులో తెలిపోయ్యారు.
✔ కనుకనే మానవాళి అందరికి ఒక రక్షకుడు అవసరమయ్యాడు.
ఆయన దేవుని అవతారంగా, మానవుని రూపం ధరించుకొని, పాపం లేని నిష్కల్మషుడిగా ఈ లోకానికి వచ్చాడు.ఆయన మానవ శరీరం ధరించుకొని మనలో ఒకని వలె కనిపించాడు, కానీ సృష్టికి పునాది వేసిన సృష్టికర్త. చారిత్రక పురుషునిగా, చరిత్ర మధ్యలోకి వచ్చాడు. ఇప్పటికీ కాలమానాలు ఆయనతోనే లెక్కించబడ్తున్నాయి. మనిషి ఎలా నడుచుకోవాలో నిజమైన మాదిరి జీవితాన్ని చూపాడు. లోక పాపాన్ని తనపై మోసుకొని, బలిగా, అర్పణగా తన ప్రాణం సిలువపై అర్పించాడు.తిరిగి మూడవ రోజున పునరుద్దానుడు అవ్వడం ద్వారా లోక పాపంపై, మరణంపై తనకు జయముందని నిరూపించాడు. మానవాళికి రక్షణ మార్గాన్ని సిద్ధం చేశాడు.
✔మనుష్యులంతా నీతిమంతుడైన క్రీస్తు అనే ఈ రక్షకుని చెంతకు వచ్చి, ఈ మాటలను విశ్వసించడం ద్వారా వారి పాపాలు క్రీస్తు రక్తంలో కడుగ బడటం ద్వారా రక్షించబడతారు. మనం ఆయన మరణం-పునరుద్ధనాల యందు విశ్వాసముంచి,మారుమనస్సు పొంది, దేవుని పక్షాన నిలవాల్సివుంది. అప్పుడు సాతాను (చీకటి) అధికారం నుండి, దేవుని(వెలుగు) అధికారంలోకి వస్తారు. దేవుని ఆత్మ వారి హృదయంలోకి తక్షణమే వస్తాడు. వారు తిరిగి దేవుణ్ని కలుసుకునే వరకు వారికి తోడుగా ఉంటాడు కనుక వారు అనాధలుగా, నిరీక్షణలేని వారిగా ఉండరు.
✔ స్నేహితుడా! ఈ మాటలు సత్యం, వాస్తవమై ఉన్నాయని సాక్ష్యమిస్తున్నాను. నేనే కాదు, నీ చుట్టూ ఉన్న అనేక మంది మారిపోయిన జివితాలతో దేవునికి చెందిన వారిగా సాక్ష్యం పలుకుతున్నారు. ఒకవేళ యేసు ఆయన తరానికే పరిమితమై, నేడు నీ జీవితంపై ప్రభావితం చెయ్యకపోతే ఆయనలో సత్యం ఉండదు. కానీ పునరుద్దానుడైన క్రీస్తు నేటికి సజీవుడు. మనుష్యులకు, వారి హృదయాలకు దగ్గరగా ఉండి, జీవితాలను మార్చే దేవుడు. నిజమైన (దేవుని)దైవత్వం యొక్క గొప్ప లక్షణం పరిశుద్ధత. దేవుణ్ని నమ్మిన వారిలో మొదట ఆయన కొనసాగించే కార్యం అదే! పరిశుద్ధత..
దేవుడు నేడు ఈ రక్షణ శుభవార్త నీ దగ్గరకు తీసుకొని వచ్చాడు. క్రీస్తు యేసులో విశ్వాసమంచు! ఈ మాటలు చదువుతున్నప్పుడు నీ భావనలు(feelings) ఏంటో అవే దేవునితో యదార్ధంగా చెప్పు..దేవుడు నీకు నిశ్చయతను అనుగ్రహిస్తాడు. నీవు సత్యమైన మార్గంలో నిలవాలనే బలిష్టమైన కోరిక మొదట దేవునిది, కనుక ఆయనే నిన్ను ఒప్పింపజేస్తాడు. ఆయన నిశ్చయతను కలిగించగా, తలవంచి స్వీకరించాల్సిన బాధ్యత మాత్రం నీదే!

Comments
Post a Comment