❇ అమాలేకీయులు వచ్చి రెఫిదీంలో ఇశ్రాయేలీయులతో యుద్ధం జరిగించారు. గనుక మోషే యెహోషువతో ౼"మనకోసం మనుషులను ఎన్నుకొని వారిని తీసుకువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చెయ్యి. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరంపై నిలబడతాను" అన్నాడు.
మోషే తనకు చెప్పినట్టే యెహోషువ చేసి అమాలేకీయులతో యుద్ధం జరిగించాడు. మోషే, అహరోను, హూరు ఆ కొండ శిఖరమెక్కారు. అప్పుడు జరిగినదేమిటంటే, మోషే తన చెయ్యి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలవసాగారు; చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలవసాగారు. అయితే మోషే చేతులు బరువెక్కాయి. అందుచేత వారు ఒక రాయి తీసుకువచ్చి దానిమీద మోషేను కూర్చోబెట్టారు. అహరోను ఈ ప్రక్క, హూరు ఆ ప్రక్క ఉండి, అతని చేతులు క్రిందకు దించకుండా ఎత్తి పట్టుకొన్నారు. అలా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకూ కదలకుండా ఉన్నాయి.
ఆలోగా యెహోషువ ఖడ్గంతో అమాలేకీయుల రాజునూ, అతని సైన్యాన్ని ఓడించాడు. ❇
■ రెఫిదీంకు దేవుడే ఇశ్రాయేలీయులను నడిపించాడు(నిర్గ 17:1). మొదట అక్కడ నీళ్లు దొరకనదుకు వాళ్ళు మోషేపై దేవునిపై సణిగారు. దేవుడు బండను చీల్చి వారి దాహాన్ని తీర్చాడు. తర్వాత అక్కడే అమాలేకీయులు వారితో యుద్దానికి దిగారు. ఈ రెండు సంఘటనల్లో సమస్యలు వచ్చినప్పుడు ౼"వాటి పరిష్కరాలను" మోషే(ద్వారానే) దగ్గరే దేవుడు ఉంచటం చూస్తాము. మోషే తన చెయ్యి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. దించినప్పుడు ఓడిపోయ్యారు. మోషే చెయ్యి ఎత్తడానికి-ఇశ్రాయేలీయుల బలానికి దేవుడు ఏదో సంబంధాన్ని ఉంచాడని అర్ధమౌతుంది. నిర్గమ 17:16 ను బట్టి చూస్తే "అమాలేకీయులు తమ చెయ్యి యెహోవా సింహాసనానికి విరోధంగా ఎత్తారు" అని ఉంది. మోషే చెయ్యి ఎత్తి మొరపెట్టింది యెహోవా సింహాసనం వైపని , ఆయన బలం కొరకేనని సహజంగానే తెలుసుకోవచ్చు. అప్పటి వరకు (ఐగుప్తీయులతో) దేవుడే వారి యుద్ధాలను వారి పక్షాన చేశాడు(నిర్గ 14:14). కానీ నేడు వారు కూడా పోరాడాలని దేవుడు సూచిస్తున్నాడు. ఐతే ఇశ్రాయేలీయులు వారి స్వంత బలంతో ఖచ్చితంగా అమాలేకీయులను గెలవలేరు గాని దేవుని బలంతోనే మాత్రమే గెలవగలరనేది స్పష్టమైన విషయం.
■ పాత నిబంధనలోని ఈ విషయాలు క్రొత్త నిబంధనలోని మనకు నిజమైన, శ్రేష్ఠమైన, పరిపూర్ణమైన విషయాలకు గుర్తుగా మాత్రమే ఇవ్వబడ్డాయని గుర్తించాలి. పాత నిబంధన ఒక నీడ మాత్రమే. రక్షణలో మన భాగం౼దేవుడు మన పక్షాన (సిలువలో) ఏం చేశాడో దాని మీద విశ్వాసం మాత్రమే. దానిలో మానవుని స్వక్రియలు ఉండవు. ఇది ఐగుప్తు నుండి వారు పొందిన విడుదలను సూచిస్తుంది. ఊరకనే నిలువబడి దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను విశ్వాసంతో పొందుకోనే బహుమానం! కానీ రక్షించబడిన ప్రతి విశ్వాసి క్రీస్తులో ఆధ్యాత్మిక యోధునిగా మారాలి. మన స్వశక్తితో కాదు గానీ క్రీస్తు యేసులో ఉన్న కృపను బట్టి బలవంతులుగా మారాలి. నేడు మనం పొరాడేది దురాత్మ శక్తులతో, శరీర సంభంధమైన దురాశలతో.
■ ఇశ్రాయేలీయులు అప్పటి వరకు గెలుస్తున్నట్లే అనిపిస్తూ, మళ్ళీ ఓడిపోతూ ఉన్నప్పుడు మోషే గమనించి౼ చేతులెత్తి తాను చేసే ప్రార్ధనలోనే ఆ శక్తి ఉందని గ్రహించి, శిఖరంపై ప్రార్ధనలో పోరాడాడు. ఇప్పుడు కూడా విశ్వాసి మానవ బలంతో ఏమీ సాధించలేడని(ప్రాముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలు) అని గ్రహించి, విశ్వాసంతో చేతులెత్తి (నిస్సహయతను, అర్ధించడాన్ని సూచిస్తుంది) ప్రార్ధించినప్పుడు దేవుని శక్తి మనలోకి వస్తుంది. మన కోసం అలుపెరుగని, నిరంతరం ప్రార్ధించే విజ్ఞానకర్త ఒకరు పరలోకంలో ఉన్నారు. ఆయనే మన రక్ష కర్తయైన దేవుడు. ఆయనలోనే సమస్త (పరిష్కర మార్గాలను) విడుదలను, విమోచనను దేవుడు ఉంచాడు. కనుక ఆయన నుండే శక్తి పరలోక సింహాసనం నుండి వస్తుంది. గనుక అలుపెరుగక క్రీస్తు కృపను ఆశ్రయిద్దాం!
Comments
Post a Comment