ii) పౌలు బర్నబాతో౼ "మనం ఏ ఏ పట్టణాల్లో ప్రభువు వాక్యం ప్రకటించామో, ఆ ప్రతి పట్టణంలో ఉన్న సోదరుల దగ్గరికి తిరిగి వెళ్లి, వారెలా ఉన్నారో చూద్దాము" అన్నాడు. మునుపు తమతో రాకుండా మధ్యలో విడిచి వెళ్ళిపోయిన మార్కును వెంట బెట్టుకొని పోవడం భావ్యం కాదని పౌలు తలంచాడు. ఐతే అతణ్ని వెంటబెట్టుకొని వెళ్ళడానికి బర్నబా ఇష్టపడ్డాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారు ఒకరి నొకరు విడిచి వేరైపోయారు (అ.కా 15:36-41).
iii) పౌలు-"పేతురు (క్రీస్తు శిష్యులలో ముఖ్యుడు) అంతియొకయకు వచ్చినప్పుడు అతడు తప్పు చేశాడు. అతడు అన్యులతో(యూదులు కాని వారితో) భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో యూదులు రాగానే వారికి భయపడి వెనక్కి తగ్గి, పక్కకి వెళ్ళిపోయాడు. మిగతా యూదులు కూడా పేతురుతో ఈ కపటంలో కలిసిపోయారు. బర్నబా కూడా వారి కపటవేషధారణ వల్ల మోసపోయాడు. వారు సువార్త సత్యాన్ని అనుసరించడం లేదని నేను చూసి అందరి ముందు నేను పేతురును ముఖాముఖిగా అతన్ని నిలదీశాను" (గలతీ 2:11-21). ★
■ పౌలు ఎవ్వరూ తనను నమ్మలేని స్థితిలో ఉన్నప్పుడు, బర్నబా అతణ్ని నమ్మి, ఆదరించి అక్కున చేర్చుకున్నాడు. అతన్ని అపోస్తులలో ముఖ్యుడైన పేతురుకు పరిచయం చేశాడు(గలతీ 1:18,19). కొన్ని సంవత్సరాల తర్వాత అదే బర్నబాతోనూ, పేతురుతోనూ కొన్ని విషయాల్లో పౌలు విభేదించాడు. పౌలు గర్వంగా ప్రవర్తించాడా?లేదు.. పౌలు క్రీస్తు మాదిరిని సరిగా చూపిన వాడని పరిశుద్ధాత్ముని చేత సాక్ష్యం పొందాడు. ఒకప్పుడు క్రీస్తును ద్వేషించి, సత్యానికి ఎంత దూరంగా పరిగెత్తాడో, నేడు క్రీస్తులోని దైవత్వం గురించి వెలిగింపబడినప్పుడు, క్రీస్తులోని సత్యాలను అనుసరించడానికి అంతే వేగంతో పరుగెత్తాడు. క్రీస్తు నందు(వాక్యాన్ని బట్టి) ప్రతి వ్యక్తికి లోబడ్డాడు, కానీ క్రీస్తు సత్యాలకు వేరుగా ఒకరు ప్రవర్తించినప్పుడు, ఆ వ్యక్తులు ఎంతటి గొప్ప వారైనా వారితో విభేదించాడు. పౌలు మొదట క్రీస్తుకు దాసుడు-ఏ నరునికి కాదు(గలతీ 1:10, 2:5,6)
■ మనుష్యులు మనకు భౌతికంగా, ఆత్మీయంగా ఎంత మేలు చేసినప్పటికీ సైతం!ఏ మేలును బట్టి మనల్ని మనం(ఆత్మీయ జీవితాలను) అమ్మివేసుకోకూడదు. వారి మాటలను ప్రతిసారి దేవుని వాక్యంతో సరిపోల్చుకోవటం సరైన విషయం. దీనర్ధం మన స్వంత జ్ఞానంపై, అభిప్రాయాలపై ఆధారపడటమా? కాదు! 'నేను-నా అభిప్రాయాలకు' సిలువవేయబడి, నాపై క్రీస్తు వాక్యసత్యాలకు, ఆత్మ నడుపుదల అధికారానికి నన్ను నేను అప్పగించుకోవటం. ఒకవేళ తప్పు చేసినప్పుడు..వాక్యానికి, మనలోని దేవుని ఆత్మకు, ఆత్మీయుల సరిదిద్దు బాటుకు దీనులై అంగీకరించాలి. ఇది దేవునిపై ఆధారపడే వారి లక్షణం.
■ నిజమైన ఆత్మీయులు అలా నడిచే వారిని మరింతగా యదార్థవంతులై హత్తుకుంటారు, ప్రోత్సహిస్తారే కానీ ద్వేషించరు. కారణం! 'మనం నమ్మకత్వం మొదట క్రీస్తు సత్యానికే ఉండాలి' అనే మాటతో వారు ఏకీభవిస్తారు. అట్టివారు వారు ఏ వ్యక్తి జీవితంలో దేవుని స్థానాన్ని ఆక్రమించకూడదని భావిస్తారు. పౌలు కంటే పేతురుకు అతిశయించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఐనా క్రీస్తు సత్యం ముందు దోషిగా ప్రవర్తించినప్పుడు, దీనుడై లోబడ్డాడు, కానీ అహాన్ని చూపలేదు. ఇది! క్రీస్తుతో నడిచేవారి లక్షణం.
౼ఇలా దేవునిపై ఆధారపడి జీవించే వ్యక్తి ఒకడున్నట్లైతే అతను కొనియాడబడడు అనేది స్పష్టమైన సంగతే!తనకు మేలు చేసి, అక్కున చేర్చుకున్నవారిని, ఆత్మీయ పెద్దలతో విభేదించాడని తెల్సిన ఎవ్వరైనా పౌలు గురించి ఏమనుకుంటారు? కానీ దేవుని గూర్చి అగ్నిలా మండుతున్న అతన్ని (ఆత్మీయులు, అతని పరిచర్య ద్వారా మేలు పొందుచున్న వారు)కొద్ది మంది మాత్రమే గుర్తిస్తారు. మొదట దేవుడు గుర్తిస్తాడు..అది చాలు కదా!
Comments
Post a Comment