❇ యేసు ఆ దార్లోనే వస్తున్నాడని, జక్కయ్య తెల్సుకొని ముందుగా పరిగెత్తి వెళ్లి ఒక మేడి చెట్టు ఎక్కాడు.
యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, తలెత్తి చూసి౼"జక్కయ్యా, త్వరగా దిగిరా. ఈ రోజు నేను నీ ఇంట్లో ఉండాలి" అన్నాడు
అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను తన ఇంటికి తీసుకు వెళ్ళాడు.అది చూసి జనులందరూ౼"ఈయన ఒక పాపి ఇంటికి అతిథిగా వెళ్ళాడు" అని గొణగడం మొదలు పెట్టారు ❇
✔ యేసు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నవారందరిలో పాపాత్ములైన వారిని, తిరస్కరించబడిన వారిని, బలహీనులైన వారిని, నిస్సాహయులైన వారిని, ఈ లోకం వెలివేసిన వారిని, యదార్థవంతులను వెతుక్కుంటూ వెళ్తాడు.
సమరయ స్త్రీ, సేన దెయ్యం పట్టిన వాడు, 38 సం|| నుండి కోనేరు దగ్గర ఉన్న రోగి, గుడ్డివాడై స్వస్థత పొంది వెలివేయబడిన వ్యక్తి , జక్కయ్య, జాలరులు, సుంకరులు, పాపులు మరియు సిలువపై దొంగ..మె||.
నీవు క్రీస్తును అనుసరించాలి అనుకుంటున్నావా(క్రీస్తు శిష్యుడవా)? ఐతే ఆయన స్వభావాన్ని అనుసరించు.
నీవు ఉన్న చోట..పాపంలో కూరుకుపోయిన వారు, సరిగ్గా ప్రవర్తించడం చేతకానివారు, నిర్లక్ష్యం చేయబడిన వారు, లోకరిత్యా హీనపర్చబడిన వారు, ఒంటరులను కనిపెట్టు. ఈ లోకసంబంధులు ఇలాంటి వారిని నిర్లక్ష్యం చేస్తారు (వదిలివేస్తారు). నీవు ఆయన వలె ప్రవర్తించడానికి, ఆయన చేత వీరంతా నీ చుట్టూ ఉంచబడి ఉన్నారు(మత్తయి 25:40,45).
✔ఇంతకీ బలహీనులెవరు? బలవంతులెవరు?
నిజానికి మనుష్యులందరూ బలహీన ఘట్టాలేనని బైబిల్ చెప్తుంది(రోమా 3:10). తోటివారితో పోల్చుకొని బలవంతులం అనుకునే బలహీనులు. అలాగే తమ స్థితిని తాము యదార్థంగా ఒప్పుకొనే బలహీనులు. క్రీస్తు వెతుక్కుంటూ వెళ్లిన వారంతా తమ నిస్సహయతను యదార్థంగా గ్రహించి ఒప్పుకున్నవారే! బలహీన పాత్రను(ఓటి కుండను) యజమాని మరింత శ్రద్ధ చూపి, జాగ్రత్త వహిస్తాడు కదా! హృదయానికి దగ్గరగా హత్తుకుంటాడు. బలహీన గొఱ్ఱెను మంచి కాపరి మెల్లి మెల్లిగా నడుపుతాడు కదా! బలహీన ఘట్టాలలో దైవశక్తి పరిపూర్ణంగా నింపబడుతుంది(1కోరింధి 1:28-29, 1తిమో 1:12-16)
బలమైన/దృఢమైన కుండకు కృప ఎందుకు? యజమాని హస్తం దానిపై బలంగానే పనిచేస్తుంది. అప్పుడు ఆయన శక్తి ముందు వాటి ఓటితనం స్పష్టంగా కనిపిస్తుంది. కనుక అది బయట పారవేయ బడుతుంది. వాక్య జ్ఞానం కోసం తహతహలాడే వారికి వాక్యమే(అక్షర జ్ఞానమే) దొరుకుతుంది. దేవుణ్ని చూడకుండా అడ్డుపడే ముసుగు వారి హృదయాలకు వేయబడివుంటుంది. జ్ఞానులకు మరుగు చేయబడిన దేవుడు..పసిబిడ్డలకు(యదార్థ హృదయులకు) దొరుకుతాడు. అలాంటి మనస్సున్న వారితోనే దేవుడు స్నేహం చేస్తాడు.
✔ క్రీస్తు స్వభావం లోకాన్ని ప్రేమించే వారికి ఎన్నడూ అంతుచిక్కదు. అన్యాయస్తులైన పన్నులు వసూలు చేసేవారు, పాపులు యేసు దగ్గరకు ఆయన మాటలు వినాలని వచ్చేవారు.
ఆయన మాటలు వారికి నిరీక్షణను ఇచ్చాయి. ప్రధాన యాజకులు, శాస్రులు పరిసయ్యుల వద్ద దొరకని ఆదరణ, ప్రేమ క్రీస్తులో దొరికాయి. మనం అలానే ఉన్నామా? అందరిలో కంటే అత్యంత బలహీనులకు నీ స్నేహంలో..దేవుని ప్రేమ-ఆదరణ-నిరీక్షణ దొరుకుతున్నాయా? అప్పుడు మనం క్రీస్తును పోలి నడుస్తున్నాం అని అర్ధం. మనం ఏ కొలతతో కొలిస్తే, దేవుడు అదే కొలతతో మనకు కొలుస్తాడు. దేవుడు మనకు చూపిన క్షమాపణలో ఎప్పుడైనా హద్దులు గీసాడా? మరి మనమెందుకు తోటి వారి విషయంలో హద్దులు గీసుకొంటున్నాం! ఆ దిశగా మనం ఎదగాల్సి ఉందని గుర్తించి..ఆ పాఠాలను నేర్పించమని దేవుణ్ని మనం వేడుకోవాల్సివుంది(1యోహాను 2:6).
ఈ ఆత్మీయ పాఠాలను అనుభవపూర్వకంగా తెల్సుకునునట్లు దేవుడు మనకు సహాయం చేయును గాక!

Comments
Post a Comment