Skip to main content

04Oct2017

❇ మనుషులవల్ల లోకం దౌర్జన్యంతో నిండి ఉంది. మనుషులంతా తమ జీవిత విధానాన్ని పాడు చేసుకొన్నందుకు లోకం భ్రష్టమైన స్థితిలో ఉంది. అది దేవుడు చూశాడు. కానీ నోవహు తన తరంవారిలో న్యాయవంతుడూ,నిందారహితుడూ దేవుని సహవాసంలో నడిచినవాడు.

ఒకరోజు దేవుడు నోవహుతో౼"మనుషుల దౌర్జన్యన్ని బట్టి నా సముఖం నుంచి వారిని, ప్రతి శరీరి నిర్మూలమైపోబోతుంది. నేను మానవాళిని భూమితోపాటు నాశనం చేస్తాను.నీవైతే తమాల మ్రానుతో ఒక ఓడను నీకోసం చేసుకో...నేను భూలోకం మీదికి జలప్రళయాన్ని రప్పిస్తున్నాను. అవును, నేనే ప్రతి శరీరినీ, ఊపిరి ఉన్న ప్రతిదానిని ఆకాశం క్రింద ఉండకుండా నిర్మూలం చేస్తాను.
అయితే నేను నీతో నా నిబంధన చేస్తాను. నీవూ, నీతోపాటు నీ కొడుకులూ, నీ భార్యా, నీ కోడళ్ళూ ఓడలోకి వెళ్ళాలి. వాటి వాటి జాతుల ప్రకారం అన్ని విధాల పక్షుల్లో, పశువుల్లో, భూమిమీద తిరిగే ప్రతి జాతిలో మగది, ఆడది బ్రతికునట్లు అవి నీ దగ్గరికి వస్తాయి" ❇


✔ దేవునికి విసుగు పుట్టించిన మనుష్యులతో నీతిమంతుడైన నోవహు ఎలాంటి భాధలు పడుతూ బ్రతికి ఉంటాడో ఉహించండి. ఒకవేళ వారిలో ఒకడైతే సమస్యే ఉండదు కానీ లోకానికి వేరుగా జీవించి దేవునితో నడిచే వ్యక్తియైతే(odd man out) ఖచ్చితంగా ఇబ్బందులు పడతాడు. అతను ఎగతాళి చేయబడతాడు, ఒంటరైపోతాడు, నిందలు పడతాడు. అతన్ని కానీ, అతని మాటల్ని కానీ ఎవ్వరూ లక్యపెట్టలేదు.కానీ నోవాహు లోకపోకడను చులకనగా చూసి, దేవునిలోని సంతోషాన్నే అమితంగా లక్యపెట్టాడు.ఈ విధంగా నోవహు లోకంపై నేరం మోపాడు లేఖనాలు చెప్తున్నాయి (హెబ్రీ 11:7).

✔ కనుకనే దేవుని దృష్టిలో కూడా ప్రత్యేకి అయ్యాడు. ఆ ఒక్కనితోనే దేవుడు మాట్లాడాడు. నోవహు దేవుని స్వరం అనుదినం వినే అనుభవం లేకుంటే ఇంత పెద్ద కార్యాన్ని తలపెట్టేవాడు కాదు.ఇది ఆయన స్వరమే అని నిశ్చయత ఉండేది కాదు. అనుదినం దేవుని మాట వినే అలవాటు లేనివారు ఎవ్వరూ కూడా దేవుని గొప్ప కార్యాల్లో పాలుపంచు కోలేరు అనేది సుస్పష్టం.తను నమ్మిన మాటకు బాహ్యంగా ఏ రుజువులు కనిపించక పోయినా ఓడ కట్టడం మొదలు పెట్టాడు. జంతువులన్ని జతలు ఓడలో ప్రవేశించడం చూసినా కూడా ప్రజలు దేవుణ్ని లక్యపెట్టలేదు. విశ్వాసం ఏ రుజువులు కనిపించక పోయినా నమ్మగలిగితే, అవిశ్వాసం కళ్ళ ముందు సాక్షాలు చూస్తున్నా నమ్మలేదు(లూకా 16:31).

✔ భూమి అంతా నాశనమైపోతుంది, ఒక్క ఓడలోని వారే కాపాడబడతారని తెలియగానే నోవాహు తన ఇంటివారితో కలిసి శ్రమపడుతూ ఓడను కట్టే ఆ పనిలో ఉన్నాడు. ఇది దేవుడు ఆదేశించిన పని. అదే సమయంలో మిగిలిన వారు ఎలాంటి పనుల్లో తనమునకలై ఉండేవారో ఊహించండి!తినుచూ, త్రాగుచూ, వ్యర్ధమైన వాటికోసం ప్రయసపడుతూ, వారి నాశనానికి సిద్ధపడుతున్నారు(మత్తయి 24:37,38). కడవరి రోజులు నోవహు రోజుల్లోలనే ఉంటాయి. స్నేహితుడా! నీ ప్రయాస దేనికోసం? నీవు విశ్వాసివి అయ్యుంచొచ్చు కానీ, నీ ప్రాధాన్యతల్లో దేవుడు ఏ స్థానంలో ఉన్నాడు? మొదట దేవునికి స్థానం ఇవ్వు! (అంటే అబ్రాహాము ప్రేమించిన ఇస్సాకును బలిపీఠంపై పెట్టినట్లు). నేడు దేవుడు కోరే పని మొదట నీలో క్రీస్తు రూపం (రోమా 8:29). క్రీస్తులో ప్రతి ఆత్మీయ ఆశీర్వదం దేవుడు మనకు అనుగ్రహించాడు(ఎఫెస్సి 1:3). వాగ్ధానాలను ఆసక్తితో, విశ్వాసంతో నీవు స్వంతం చేసుకోవాలి. అప్పుడు క్రీస్తు మనస్సు కలిగి నశించుపోతున్న ఆత్మల పట్ల భారాన్ని పుట్టిస్తుంది.

(క్రీస్తు స్వభావం మనలో రూపాంతరానికి మనసివ్వకుండా కూడా సేవ చెయ్యొచ్చు.అలా చేసే అనేక మంది సేవకుల్లో/విశ్వాసుల్లో ఆత్మలో శూన్యతకు కారణం అదే! ఎఫెస్సు సంఘ పతనం ఇలాగే జరిగింది,ప్రకటన 2:2-5. ఇది మరవొద్దు!మొదట దేవుని పని నీలో ఆరంభం అవ్వాలి, అది జరుగుతూ ఉండాలి)

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...