Skip to main content

05Oct2017

❇ పేతురు పెంతుకోస్తూ దినాన నిలువబడి౼"ఇశ్రాయేలు ప్రజలారా! ఈ మాటలు వినండి..దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలూ మహత్కార్యాలూ సూచకక్రియలూ మీ మధ్య చేయించి, ఆయనను తన దృష్టికి యోగ్యుడుగా కనపరిచాడు. ఇది మీకూ తెలుసు!..ఈయన్ని మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించారు. మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం గనుక దేవుడు మరణ వేదనల నుంచి ఆయన్ను విడిపించి సజీవంగా లేపాడు"

ఇది వింటూ ఉంటే వారికి గుండెలలో బాకుతో పొడిచినట్లయి ౼"సోదరులారా, మేమేం చేయ్యాలి?"అని పేతురునూ మిగతా అపొస్తలులనూ అడిగారు.
దానికి పేతురు౼"మీరు పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ కోసం ప్రతివాడూ యేసుక్రీస్తు పేరున బాప్తిస్మం పొందండి".
ఇంకా అతడు అనేక రకాలైన మాటలతో వారికి సాక్ష్యమిచ్చి
"మీరు యీ దుష్టతరం నుండి వేరుపడి రక్షణ పొందండి" అని వారిని హెచ్చరించాడు. ❇

✔ ఇశ్రాయేలు ప్రజలు అప్పటికే వారు యేసును సిలువకు అప్పగించి మహా పాపానికి ఒడిగట్టారు. నిజానికి యేసును ప్రధాన యాజకులు, మత పెద్దలే కుట్రపన్ని చంపినా..పరోక్షంగా ప్రజలు దానికి సమ్మతి పలికారు. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైన సమ్మతించిన పాపం పాపమేనని ఈ మాటల ద్వారా గ్రహించవచ్చు. ఐతే దేవుడు ఆ ప్రజలను ప్రేమించి,వారిని వెలిగించి, వారున్న అపాయకరమైన స్థితి నుండి బయటికి తీసుకొని రావాలనే దేవుడు చూస్తున్నాడు. ఇది దేవుని మనస్సు! ప్రసంగికుని సంపూర్ణ మనస్సు ఇదే అయ్యివుండాలి.(to HELP the people to get rid from sins&prejudices)
క్రీస్తు యొక్క సిలువ బలియాగానికి అర్ధం అదే కదా!

✔ పాపం గూర్చి మాట్లాడకుండా రక్షకుని యొక్క అవసరాన్ని భోధించలేవు. కనుక పాపం దాని యొక్క తీవ్రతను గూర్చి మాట్లాడవల్సిందే! పాపం, నరకం గూర్చి యేసుక్రీస్తు మాట్లాడినంత తీవ్రంగా మరెవ్వరూ మాట్లాడలేదు. ఆయన కంటే ప్రేమామయులుగా నటించొద్దు. ఐతే అది అక్కడే ఆగి పోనివ్వవొద్దు! రోగం ఏంటో చెప్పి, మందు ఇవ్వని(చికిత్స చేయని) డాక్టర్ వలె ఉంటుంది. ఐతే వారు ఏవిధంగా క్షమించబడగలరో, విడుదల పొందగలరో చెప్పి వారిని అమితంగా ప్రేమించి, వారి కోసం ప్రాణం పెట్టిన వారి దేవునికి అనుసంధానం చెయ్యాల్సివుంది(వ్యక్తిగతంగా వారు దేవుణ్ని సొంతం చేసుకొననివ్వండి). నీవు ప్రసంగిస్తున్న ప్రజలను దేవుడు అమితంగా ప్రేమిస్తున్నాడని మొదట గుర్తించు. అప్పుడు దేవుని మనస్సుతో భోధిస్తావు. మొదట వ్యర్ధ అతిశయాల నుండి నిన్ను నీవు శూన్యం చేసుకో! ఆయన ఆత్మ చేత నింపమని ప్రార్ధించు. అప్పుడు ఆయన నిన్ను తన ఆధీనంలోకి తీసుకుంటాడు.నీ ప్రమేయం లేకుండానే మాటల సరళి, క్రమం, ఆలోచనలు నీలో నుండి రావడం గమనిస్తావు. ఆ (దేవుని) మాటలు ఎదుటి వారిని తాకుతాయి. జీవితాలను మార్చుతాయి. ఎందుకంటే అవి దేవుని ఆత్మ చేత పలుకబడిన మాటలు. ప్రసంగం తర్వాత ఎవ్వరైనా నిన్ను పొగిడినా నీకు అతిశయం కలుగదు..ఎందుకంటే నీకు బాగా తెల్సు! అవి నీ మాటలు కావని. ఇలా దేవునికి మహిమ వెళ్తుంది.

✔ మనుషులు వారి ఎదుటి వారిలో తప్పులను ఎరడం పుట్టుకతోనే వచ్చిన విద్య. క్రైస్తవుల్లో కూడా లోతైన విశ్లేషణ చేసే విశ్లేషకులూ ఉన్నారు. ఐతే ఆ వారు విమర్శించిన/విశ్లేషించిన ఆ సమస్యకు వాక్యానుసారమైన సమాధానం ఇవ్వకపోతే అది సద్విమర్శ(మంచి బోధ) కాదు. అంతే కాదు అంతరంగంలో ప్రేమ లేకుండా(వారు ఆ తప్పు నుండి బయటకు తీసుకురావాలనే మనస్సు లేనితనంతో) ఎదుటి వారిని సరిదిద్దే ప్రయత్నం కూడా సద్విమర్శ కాదు! అంతకంటే నీవు మౌనంగా ఉండటం నీకు మేలు. కనుక మొదట మనల్ని మనం పరిశీలించుకోవాలి. నీ మనస్సాక్షిని దేవుని యెదుట శుభ్రంగా ఉంచుకున్నప్పుడు దేవుని ఆత్మ నీతో స్పష్టంగా మాట్లాడటం చూస్తావు. నీవు వాక్యానుసారంగా ప్రవర్తించకపోతే నీ ఆత్మలో నీకు తెలిసిపోతుంది. (నేను చెప్తున్న ఈ మాటలు దేవునితో నడుస్తున్న వారికి అర్ధమౌతాయి. ఒకవేళ నీకు అనుభవం లేనట్లేతే ఆసక్తితో దేవుణ్ని అడుగు! ఆయన నేర్పుతాడు)
కొన్నిసార్లు కఠినమైన మాటలో ప్రేమ ఉండొచ్చు, మెత్తటి మాటలో నీ ఆత్మకు కీడూ జరగొచ్చు. కాబట్టి మనస్సును చూడాలి. ఆత్మను వివేచించాలి. క్రీస్తు మాటలను/ప్రవర్తనను నిశితంగా పరిశీలన చేస్తే ఈ విషయాలు గమనించగలము.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...