❇ "మీరు పాపం విషయంలో చనిపోయారనీ, దేవుని విషయంలో మన ప్రభువైన క్రీస్తు యేసులో సజీవులనీ మిమ్ములను మీరే ఎంచుకోండి" (రోమా 6:11)
"మరణించిన యేసును సజీవంగా లేపిన దేవుని ఆత్మ (పరిశుద్ధాత్ముడు) మీలో నివసిస్తున్నట్లైతే, చనిపోయిన వారిలో నుంచి క్రీస్తును లేపిన దేవుడే, చావుకు లోనయ్యే మీ శరీరాలను కూడా, మీలో నివాసముంటున్న ఆయన ఆత్మ ద్వారానే బ్రతికిస్తాడు" (రోమా 8:11) ❇
✔ మన పాపం వల్ల దేవునితో ఎడబాటు(ఆత్మలో చచ్చిన స్థితి)౼ రక్షకుడైన యేసులో విశ్వాసం వల్ల దేవుని ఉగ్రత నుండి రక్షణ గూర్చి నిన్నటి ధ్యానంలో తెల్సుకున్నాము.
"ఒకప్పుడు పాపంలో స్వేచ్ఛగా జీవించి, దేవునితో సంభంధం విషయంలో చచ్చిన మనం, నేడు పాపం విషయంలో చనిపోయిన వారిగా, దేవుని విషయంలో జీవం గలిగిన వారిగా ఎంచుకోమని" బైబిల్ బోధిస్తుంది.
✔ అంటే "యేసు సిలువలో నా పాపం నిమిత్తం చనిపోయాడు, నా పాపంపై సంపూర్ణ విజయంతో తిరిగి లేచాడు" అని నమ్మిన మనం,అదే విశ్వాసాన్ని మన జీవితంలో కూడా రుజువు చెయ్యాల్సివుంది. క్రీస్తు సిలువలో చనిపోయినప్పుడు నీ పాపాన్ని తనపై వేసుకొని, నీ స్థానంలో చనిపోయ్యాడు అని నమ్ముతున్నావు కదా! ఇప్పుడు రక్షణ పొందిన నిన్ను నీ పాపాల విషయంలో చనిపోయిన వాడిగా ఎంచుకోమని దేవుడు ఆదేశిస్తున్నాడు. ఇకపై నీకు నీ పాత స్వభావంలో జరిగించిన (నిన్ను ఏలిన) పాపాలకు ఎలాంటి సంబంధం లేదు, కనుక ఇకను నువ్వు పాపానికి దాసుడవు కావు గానీ, క్రీస్తు యేసుకే దాసుడవు. నిన్ను నీవు పాపం విషయంలో చనిపోయిన వాడిగా ఎంచుకునట్లైతే, మరణించిన వాడు లోకం నుండి వేరు పడిన వాడు గనుక ఇకను లోక సంభంధిలా బ్రతకకూడదు.శరీర దురాశల కోర్కెల విషయంలో చనిపోవాలి. సాతాను ఇదివరకు మనం ప్రేమించిన పాపాలతో ప్రేరేపిస్తాడు.కానీ చనిపోయిన వాడిలో ఏ దురాశ కోరిక ఉండదని మనకు తెల్సు. ఇంకా మనలో బ్రతికి ఉన్న పాపాల విషయమై క్రీస్తు కృపా సింహాసనాన్ని సమీపిస్తూ ఉండాలి. ఇది క్రీస్తుతో పాటు సిలువ వేయబడటం.క్రీస్తును వెంబడించడం. అనుదినం మన సిలువను మోస్తూ, లోకానికి వేరుగా, కల్వరి దారిలో ప్రయాణం చెయ్యడం. ఈ మార్గంలో అందరికంటే ఉన్నతంగా దేవుని మాటకే ప్రధమ స్థానం ఉంటుంది. "నేను" అనే వాడు సిలువ వేయబడుతూ, క్రీస్తే మనలో పరిపాలన చేయడం
✔ ఐతే ఇది నీకు నువ్వు స్వతహాగా జీవించడం అసాధ్యం. మానవుడు కాలినడకన చేరుకోలేని దూరాన్ని ప్రయాణ సాధనాల ద్వారా వేగంగా చేరుకోగలడు. అతని శక్తికి, సాధ్యం కానిది జరిగించడానికి బయటి నుండి కొంత శక్తి అవసరమౌతుంది. అలాగే స్వంత శక్తితో సాధ్య పడని ఈ భూమిపై పరలోక జీవితాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యమవుతోంది.చనిపోయిన యేసును, దేవుని మహిమ ద్వారా, పరిశుద్ధాత్ముని శక్తి ద్వారా లేపబడ్డాడని లేఖనం చెప్తుంది.క్రీస్తు మరణంలో ఐక్యత కలిగిన మనం, ఆయన పునరుద్ధణంలో ఐక్యతనూ పొందాలి. అంటే దేవుని(ఆత్మ) శక్తి ద్వారానే ఈ క్రొత్త జీవితం సాధ్యం. మనం చనిపోయిన వారిగా ఎంచుకోవడం ఎంత అవసరమో, అనుదినం దేవుని శక్తితో నింపబడటం కూడా అంతే అవసరం.దేవుని శక్తి లేకుండా దేవుని పని మనపై జరగటం అసాద్యం.(ఈ అనుభవంను నిర్లక్ష్యం చేసి చాలా మంది క్రైస్తవులు చల్లారిపోయ్యారు.మన సొంత శక్తితో ప్రయత్నిస్తే మహా ఐతే జీవం లేని(జీవితంగా మారని) వాక్య జ్ఞానాన్ని మాత్రమే సాధిస్తాము. వాక్యన్ని వివరించ వచ్చు గాని ఆత్మీయ జీవితాలకు సహాయకులగా ఉండలేము).
✔ ఒకప్పుడు పాపానికి బానిసలుగా ఉన్న మనం, నేడు నీతికి దాసులుగా మనల్ని మనం అప్పగించుకోవాలి. వాక్యనికి లోబడటం ధ్యానించడం, ఆత్మ ద్వారా దేవునితో సహవాసం చెయ్యడం ద్వారా, క్రీస్తులో అనుదినం ఆసక్తితో నిలిచివుండాలి. ఫలితంగా దేవుని లక్షణాలు మనలో పెంపారతాయి. పాత స్వభావం మనలో పోయి, దేవుని సంబంధియైన క్రొత్త స్వభావం కనబడుతుంది.

Comments
Post a Comment