సౌలు దేవుని ఆజ్ఞలను త్రోసిపుచ్చి, దేవుని దృష్టి యెదుట ద్రోహము చేశాడు. అంతేకాకుండా దేవుని దగ్గర కనిపెట్టకుండా కర్ణపిశాచముల సహాయంతో సోదె చెప్పె దానిని వెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ కారణాలను బట్టి దేవుడు అతనికి మరణశిక్ష విధించి, రాజ్యాన్ని దావీదు వశము చేసెను.(1దిన 10) ❇
✔ ఒకప్పుడు ఇదే ఇశ్రాయేలీయులే ఫిలిష్తీయులను తరిమి తరిమి చంపారు(1సమూ 17:52). శత్రువులైన ఫిలిష్తీయులు దండెత్తి వచ్చిన ప్రతిసారీ వారి ప్రయత్నాలను తిప్పికొట్టారు. కారణం దైవభయం కలిగిన శూరుడైన దావీదు. దేవుని యెదుట సుబుద్ధి కలిగిన ఒక్క వ్యక్తి ప్రభావం, ఆ దేశం అంతటిపైనా కనిపించింది. అలాగే ఒక వ్యక్తి (సౌలు) యొక్క అవిధేయత కూడా అనేకుల పతనానికి కారణమైయ్యింది. దావీదు ప్రాణాలకు తెగించి ఫిలిష్తీయుడు, శూరుడైన గోల్యతును చంపి ఇశ్రాయేలు రాజ్యాన్ని రక్షించాడు. తన స్థానం ఎక్కడ ఆక్రమిస్తాడోనని, అప్పట్నుంచి సౌలు దావీదుపై విషపు చూపు చూస్తూ చంపాలని ప్రయత్నిస్తూనే వచ్చాడు. సౌలు దేవుని చేత అభిషేకం చెయ్యబడిన రాజు అనే కారణాన్ని బట్టి దావీదు సుబుద్ధితో అవకాశం వచ్చినా ఏ హాని చెయ్యలేదు (నిజానికి దేవుడు దావీదును కూడా తర్వాతి రాజుగా అభిషేకించాడు. కానీ సౌలు దేవునికి బయపడక దావీదుకు హాని చెయ్యాలని చూశాడు). దేవుడు తనను విడిచాడని, దావీదును తోడై ఉన్నాడని తెల్సినా కూడా సరిచేసుకోలేదు. సౌలు మనస్సును కఠినం చేసుకొన్నాడు. అనేక సంవత్సరాలు దేవుడు అతనికి అవకాశాలను ఇచ్చినా బుద్ధిపూర్వకంగా త్రోసిపుచ్చి, అవిధేయుడై దెయ్యాపు శక్తిని ఆశ్రయించాడు.
✔ "దేవుడు సౌలుకు మరణశిక్ష విధించి, రాజ్యాన్ని దావీదు వశము చేసెను" (10:14). పై వచనాన్ని జాగ్రత్తగా గమనిస్తే..
దేవుడు అన్ని అధికారాల కంటే పైన ఉన్నత సింహాసనంపై తన అధికారాన్ని స్థాపించాడని, ఆయనే మనుషులను ఉంచేవాడు, తొలగించే వాడనే సత్యం గ్రహించవచ్చు. కానీ సౌలు తన అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకోన్నాడు. తన స్వశక్తితో దాన్ని నిలుపుకోవాలని అనుకున్నాడు. దావీదునకు అధికారం దేవుని నుండి వచ్చింది. కానీ దేవుని మనస్సులేని మనుష్యులు అతన్ని అధికార దాహం కలవాడని నిందించారు(2సమూ 16:8). దావీదు అధికారం కోసం ఎన్నడూ ప్రాకులాడలేదు. కానీ దేవుని అధికారానికి తనను తాను నమ్మకంగా అప్పగించుకొన్నాడు. ఆయనదైన సమయంలో దేవుడు దావీదునకు ఇచ్చిన మాట నిలుపుకున్నాడు. ఒకవేళ తప్పు చేసినా(దేవుడు శిక్షించినా), శ్రమలోనూ, సంతోషంలోనూ దావీదు దేవుని సన్నిధి నుండి ఎన్నడూ ఎదురాడలేదు, తొలగిపోలేదు, గానీ చిరకాలం దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలనే కోరుకున్నాడు. కనుకనే నేటికి దేవుని హృదయంలో దావీదుకు ప్రత్యేకమైన చోటు ఉంది.
Comments
Post a Comment