❇ "దేవుని మీద విశ్వాసం వల్లే మోషే, పెద్దవాడయిన తరువాత ఐగుప్తు చక్రవర్తి కూతురి కుమారుడని అనిపించుకోవడానికి నిరాకరించాడు. అల్పకాలం పాపంలోని సుఖభోగాలు అనుభవించడానికి బదులు దేవుని ప్రజలతో హింసలు అనుభవించడానికే అతడు కోరుకొన్నాడు"
"తన ద్వారానే ఇశ్రాయేలీయులను దేవుడు విడిపిస్తాడనే విషయం తన బానిస సోదరులు గ్రహిస్తారని, మోషే అనుకొన్నాడు. కానీ వారు గ్రహించలేదు. వారి నిమిత్తమే మోషే ఒక ఐగుప్తుయుని హత్య చేశాడు. ఆ విషయం బయటపడినందుకు మోషే మిద్యానుకు పారిపోయాడు" ❇
■ ఐగుప్తు రాజకుమారుడుగా పెరిగిన మోషే, దేవుని మీద విశ్వాసంతో ఎవ్వరూ చేయ్యలేని త్యాగాన్ని చేశాడు. అంతఃపురాన్ని, విలాసవంతమైన సుఖసౌఖ్యాలు వదిలి, బానిసల్లో ఒకనిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. కానీ బానిసలైన అతని స్వంత ప్రజలే అతన్ని తిరస్కరించారు. అతని విశ్వాసం, త్యాగపూరితమైన నిర్ణయం.. అతణ్ణి దేవుని పనికి సమర్థునిగా చెయ్యలేకపోయింది. అవమాన భారంతో,చివరికి చేదైన అనుభవాలతో కృంగిపోయి, అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయాడు.
■ ఒకవేళ ఆ సమయంలో ఎన్నో ప్రశ్నలు మోషేలో మదిలో మెదిలి ఉండొచ్చు.
"వీరి కోసం ఎంత చేసినా గుర్తించని కఠినమైన ప్రజలు వీళ్ళు! వీరికి దేవుడు విధించిన శిక్ష సరైనదే! ఐనా దేవుడు నన్నెందుకు అంతఃపురంలో పెంచాడు? నా ద్వారా దేవుడు విడిపిస్తాడని ఇన్ని రోజులు వ్యర్ధంగానే నమ్మానా! నా తొందరపాటు వల్లే ఇదంతా జరిగింది. నా గురించి నేను అతిగా ఉహించుకొన్నానేమో!"
అతని విఫలయత్నం అతన్ని తీవ్రంగా కలచివేసింది.ఇక ఎన్నడూ తిరిగి ఇలాంటి సహసాన్ని చేయకూడదని తీర్మానించు కొన్నాడు.
■ విశ్వాసం, త్యాగపూరితమైన జీవితంతో దేవుని నిమిత్తం ముందుకు వెళ్లిన మెషేను, మరి దేవుడేందుకు వాడుకోలేదు? ఇవి మాత్రమే సరిపోవు గానీ మోషే నేర్చుకోవాల్సిన పాఠాలు ఇంకా ఉన్నాయి. మోషే ఆ ప్రజలకు నాయకుడిగా ఉండడం దేవుని అనాధికాల ప్రణాళికే ఐనా, అతను దేవుని విధానంలోనే ఆ పని కొనసాగించాలి.కనుకనే అతని సొంత సామర్ధ్యాలను ఖాళీ చేయడానికి, విరగొట్టబడే అనుభవం అవసరమయ్యింది. ఒక మనిషి జీవితంలో దేవుని ప్రణాళికల నెరవేర్పుకు, అతను సంపూర్ణంగా దేవునిపై ఆధారపడే మనస్సును కలిగి ఉండాలి. అప్పుడు ఏ పరిస్థితికైనా కృంగిపోడు. మోషే జీవితంలో ఆ 40సం|| మౌన సమయంగా ఉండిపోయింది. దానార్ధం దేవుడు వదిలేశాడా?లేదు..ఆయన,అతని జీవితంపై పని చేస్తున్నాడు!మిద్యానులో ఉన్న మోషేను దేవుడు మళ్ళీ దర్శించాడు.దేవుడు తన శక్తితో నింపి, గొప్ప నాయకునిగా చేశాడు.
■ స్నేహితుడా! దేవుని కోసం ఎంతో నిలబడి, కృంగిపోయిన మోషే లాంటి అనుభవాల్లో నీవు ఉన్నావా?ఐతే నీతో మాట్లాడనివ్వు! అందరి కంటే ఉన్నతంగా ఆలోచించిన నీ హృదయాన్ని దేవుడు చూశాడు. నీ విశ్వాసం, త్యాగపూరిత నిర్ణయాలను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు.ఆయన నీపై ఆలోచన నిలిపాడు.ఈ మౌన సమయంలో కూడా నీపై ఆయన పని జరుగుతూనే ఉంది.ప్రస్తుతం ఎండిన ఎముకలావున్న నీ జీవితంపై జీవాత్మ (పరిశుద్ధాత్ముడు) తిరిగి జీవాన్ని కుమ్మరించగలడు. తిరిగి నీ పాదాలు మోపి నిలవబడు! చిన్న బిడ్డ వలె సంపూర్ణంగా దేవునిపై ఆనుకో!ప్రతి చిన్న విషయం దేవునితో చర్చించు! దైవశక్తిని నీ శక్తిగా చేసుకో! నీవేమి నేర్చుకోవాలో అడుగు! ఆలోచించు! కృంగిపోవాల్సిన అవసరం లేదు.మనుషుల వైపు చూడొద్దు!దేవుని ఆత్మ కలిగిన అతి కొద్దిమందే నిన్ను అర్ధం చేసుకుని, ప్రోత్సహించగలరు. దేవుని సంభంధులు ఇలాంటి అనుభవాల గుండా వెళ్లడం కొత్త ఏమీ కాదు! గొప్ప పరిచర్యను దేవుడు అప్పగించడానికి/నమ్మకత్వానికి ముందు ఇలాంటి అనుభవాలను దేవుడు వాడుకుంటాడు. నిన్ను గురించి ఆయనకున్న ఆలోచనలు ఏ ఒక్కటీ తప్పిపోలేదు. నేను సత్యమే చెప్తున్నాను!
★ ఇది నీవేలా చెప్పగలవని నీవు నన్నడుగుతావా?నీ తోటి సహాఅనుభవం గల, నీ సహోదరుణ్ణి. అనేకసార్లు విరగొట్టబడ్డాను. ఇంకా ఆ పని నాలో జరుగుతూనేవుంది. జరిగిన ప్రతిసారి దేవునిపై ఆధారపడే బలమైన కోటగా దేవుడు తయారు చేస్తున్నాడు. కాబట్టే నిన్ను అర్ధం చేసుకోగలను!
Comments
Post a Comment