❇ సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో
భోజనానికి కూర్చున్నాడు. వారంతా భోజనం చేస్తుండగా యేసు౼"మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను" అన్నాడు.
అందుకు వారు చాలా దుఃఖంలో మునిగిపోయారు. ఒకరి తరువాత ఒకరు ఆయనతో౼"నేను కాదు కదా!" అని ఆయన్ని అడగటం ప్రారంభించారు.
ఆయన౼"నాతో కలిసి పాత్రలో చెయ్యి ముంచి భోజనం చేసేవాడే నన్ను పట్టిస్తాడు. దేవుని నిర్ణయం ప్రకారం మనుష్యకుమారుడు చనిపోవలసిందే గాని ఆయనను ఎవరు పట్టిస్తాడో ఆ వ్యక్తికి 'శిక్ష (యాతన)' తప్పదు. ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండక పోయి ఉంటే అతనికి మంచిది." ❇
✔ 'క్రీస్తుకు సిలువ మరణం' దేవుని నిర్ణయమే కానీ ఇస్కరియోతు యూదా కుయుక్తి-ద్రోహం దేవుడు ఆదేశించినవి కావు. దేవుడు ఎన్నడూ చెడుకు కర్త కాదు. కాబట్టి కీడు తలపెట్టి దేవుని చిత్తం జరిగించానని ఎవడూ అనకూడదు. అంటే "క్రీస్తు సిలువ వేయబడి చనిపోవడం వల్లే నేడు అనేకులు రక్షించ బడ్డారు/బడుతున్నారు, కనుక నా ద్వారా దేవుడు ఈ పనిని జరిగించాడు, ఈ మంచి పని కోసం దేవుడు నన్ను వాడుకున్నాడు" అని ఇస్కరియోతు యూదా చెప్ప కూడదు/చెప్పలేడు. దేవుడు అతన్ని శిక్షకు పాత్రునిగా ఎంచాడు.
✔ దేవుడు తన ఉద్దేశ్యాలను బట్టి తన ప్రజలను శ్రమల గుండా తీసుకొని వెళ్తూ అనేక పాఠాలను నేర్పిస్తాడు. వారు దేవునిపై మరి యెక్కువగా ఆధారపడటానికి, భవిష్యత్తుల్లో ఆయన ప్రణాళికలు వారిలో సంపూర్తి చెయ్యడానికి వాటి గుండా నడిపిస్తాడు. ఈ మధ్యలో నీతిమంతులకు కీడు తలపెట్టే భక్తిహీనుల చెడుతనాన్ని సైతం, దేవుడు తన ప్రజలను తర్బీదు నిమిత్తం వాడుకుంటాడు. అయ్యో! ఎవడు ఆ శ్రమకు కారణం అవుడుతాడో వానికి శ్రమ. వాడు నీతిని/దేవుణ్ని ద్వేషించాడు, తన స్వభావాన్ని బట్టి చెడు జరిగించాడు. ఈ మాటలు చెప్తున్నప్పుడు దేవుడు నాకు యేసేపును గుర్తుచేస్తున్నాడు.
✔ నీతిమంతుడైన యోసేపు దేవుణ్ని బట్టి యజమానికి మేలు చేయాలని రాత్రిపగళ్లు కష్టపడ్డాడు. అతని భార్య పాపానికి ప్రేరేపించినా దేవుణ్ణి, తన యజమానుడు తనపై ఉంచిన నమ్మకాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాని పోతిఫరు తప్పుడు విచారణ చేసాడు. భార్య అబద్ధపు మాటలు నమ్మి యేసేపును చెరసాలలో వేయించాడు. గొంత్తెత్తి తను నిర్దోషినని అరిచినా ఎలాంటి ప్రయోజనం లేని పరిస్థితుల్లో యోసేపు కుమిలి పోయాడు. నీతిమంతుడు శ్రమపడ్డాడు, అవమానించబడ్డాడు. దేవుడు అతణ్ణి చూచాడు. చెరసాలలో ఉన్న యోసేపును దేవుడు తనదైన సమయంలో హెచ్చించాడు. ఐగుప్తు సామ్రాజానికి గొప్ప అధికారిగా దేవుడు చేశాడు(నరుడు కాదు). ఇప్పుడు ఫోతిపరు నేను చెరసాలలో వేయించకపోతే ఇతనికి ఈ మేలు జరిగేది కాదు.నా ద్వారానే ఈ మేలు జరిగిందని అనవచ్చా? లేదు..అనకూడదు!దేవుని నిర్ణయం ప్రకారం యోసేపు వెళ్ళాడు..కాని ఎవని మూలంగా శ్రమ పొందాడో వారు శిక్షార్హులు.
౼దేవుడు ఒకనితో భూమిపై సజీవునిగా ఉన్నప్పుడు మాట్లాడితే(తప్పుదిద్దితే) వానికి మేలు. నిత్యత్వంలో సరిద్దిద్దుకునే అవకాశం ఏ వ్యక్తికి ఉండదు. దేవుడు ఎవరిపై ఎక్కువగా పని చేస్తే వారు ధన్యులు. ఎవరు దేవునికి అధికారం ఇవ్వక 'నేను బాగున్నానని' భ్రమపడతారో వారు నిత్యత్వంలో శాశ్వితంగా దుఃఖపడతారు.
Comments
Post a Comment