అక్కడ 40 రోజులు సాతాను ఆయన్ని విషమ పరీక్షలకు గురి చేశాడు. ఆ రోజుల్లో ఆయన ఏమీ తినలేదు గనుక ఆయనకు బాగా ఆకలి వేసింది. అప్పుడు....
● సాతాను ఆయనతో౼"నీవు దేవుని కుమారుడివయితే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు" అన్నాడు.
యేసు౼"మనిషి కేవలం ఆహారంతోనే బతకడు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్లా బతుకుతాడు అని రాసి ఉంది"
✔ 40 రోజుల క్రిందట దేవుడు-యేసును గూర్చి'ఈయనే నా ప్రియమైన కుమారుడు' అని సాక్ష్యం పలికాడు. ఆ మాటతోనే మొదలు పెడుతూ సాతాను ఆయన్ను శోధించడం మనం గమనించవచ్చు. అపవాది యేసులోని దైవత్వం నిరూపించు కొమ్మని అడిగితే, సాత్వికుడైన యేసు తను తాను మానవుని
(మనుష్యుడు)గా బదులు పలుకుతున్నాడు. ఏదేనులో దేవతల వలె ఉంటారన్న సాతాను అబద్ధపు ప్రలోభాలకు మొదటి మనుష్యులు పూర్తిగా లోబడ్డారు. వారు ఆత్మకంటే శరీరాన్ని, భూసంభందమైన సౌఖ్యలకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ యేసు తన శరీర ఆకలిదప్పుల కృశించి పోతున్నప్పటికి దేవునితో సంభంధం కలిగి ఉండటాన్నే విలువైనదిగా ఎంచాడు.
● ఆ తర్వాత సాతాను యేసును యెరూషలేముకు తీసుకెళ్ళి దేవాలయ గోపురంపై ఉంచి౼"నీవు దేవుని కుమారుడివయితే కిందికి దూకు! 'ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళు నీ పాదాలకు రాయి తగలకుండా నిన్ను తమ చేతుల్లో ఎత్తిపట్టుకుంటారు' అని రాసి ఉంది గదా!"
అయితే యేసు౼" 'నీ దేవుడైన ప్రభువుకు పరీక్ష పెట్టకూడదని' మరొక చోట రాసి ఉందని" జవాబిచ్చాడు
✔ నేడు మనకు కనిపించే తప్పుడు సిద్దాంతాలు సాతాను చేత వక్రీభించబడినవే! మరొక చోట ఇలా వ్రాయబడింది అని యేసు చెప్పిన వాక్యంతో సాతాను వక్రీభించిన వాక్యంకు సంపూర్ణమైన సరైన అర్ధం దొరికింది. నిజానికి సాతాను క్రీస్తును ఆత్మహత్యకు ప్రేరేపించాడు. దేవాలయం పైనుంచి దిగడానికి మెట్లు ఉంటే.. దూకటం ఎందుకు?(డాక్టర్లు, మందులను దేవుడు ఇస్తే దేవుడే నయ్యం చేస్తాడని తప్పుగా ఆపాదించుకోవటం ఈలాంటిదే!). ఆయన తనంతట తాను ఏమి చెయ్యలేదు, మాట్లాడలేదు కానీ తండ్రి సెలవిచ్చిన ప్రతి మాటను, పనిని మాత్రమే జరిగించాడు.
● మళ్ళీ సాతాను చాలా ఎత్తయిన ఒక కొండపైకి ఆయన్ని తీసుకుపోయి, ప్రపంచ రాజ్యాలను, వాటి వైభవాన్నీ ఆయనకు చూపించి౼"నీవు సాష్టాంగపడి నన్ను పూజిస్తే ఇదంతా నీకిస్తాను" అన్నాడు.
యేసు౼"సాతానా! అవతలికి పో! 'ప్రభువైన నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధించాలి. ఆయన్ని మాత్రమే సేవించాలి' అని రాసి ఉంది" అన్నాడు.
✔ అపవాది చేసే ప్రతి శోధన వెనుక ఉద్దేశ్యం౼మనం వాడి మాటకు లోబడాలని, దేవుని మాట మీద అపనమ్మిక ఉంచాలని, మనల్ని ఆయన్నుండి దూరం చేయడమే లక్ష్యంగా కనిపిస్తుంది. ఇందుకోసం దేవుని కుమారునికి సైతం లోక సుఖాలను ఎరగా వేస్తే, మనల్ని మరెంతగా ఈ విషయంలో శోధించవచ్చో ఊహించ వచ్చు. మానవుని పట్ల దేవుని ఉద్దేశ్యాలను యేసు సుస్పష్టంగా తన జవాబులో చెప్తున్నాడు. నరుడుగా ఆయన అలాగే జీవించాడు.
■ మన జీవితంలో సాతాను మనల్ని చేజిక్కిచుకోవాలని చూపే ప్రతి జిత్తులను, వాడి తంత్రాలను కనిపెట్టగలమని వాక్యం బోధిస్తుంది. నేటి చిన్న బిడ్డలే, తండ్రులుగా-వృద్ధులుగా వయస్సులో పరిణతి చెందినట్లే, ఆత్మీయ జీవితంలో దేవునితో నడిచే అనుభవాలే పాఠాలుగా, ఒడిదుడుకులే బలమైన వారిగా తయారవ్వడానికి దేవుడు వాడుకుంటాడు.మన పక్షాన యుద్ధం చేయు దేవుడే ఆసక్తి పరులకు ప్రతి పాఠం భోధిస్తాడు.తన బిడ్డలను (ఆత్మీయ)తండ్రులు కాపాడుకోవడం వారి బాధ్యత అని మనకెవ్వరూ భోధించనక్కరలేదు కదా!
Comments
Post a Comment