Skip to main content

Posts

14Sep2017

❇ దేవుని మాటను బట్టి అబ్రాహాము..తన భార్యయైన హాగరును(ఐగుప్తు నుండి తేబడిన బానిస), వారి కుమారుడైన ఇస్మాయేలును పంపివేయడానికి తీర్మానించుకొన్నాడు. తెల్లవారగానే అబ్రాహాము లేచి రొట్టెనూ, నీళ్ళతో నిండిన తిత్తినీ హాగరుకు ఇచ్చి, ఆమె భుజం మీద పెట్టి, ఆ కుర్రవాణ్ణి కూడా ఆమెకు అప్పగించి ఆమెను పంపివేశాడు. ఆమె వెళ్ళిపోయి, బెయేర్షెబా ఎడారిలో తిరుగుతూ ఉంది. తిత్తిలో నీళ్ళు అయిపోయినప్పుడు ఆమె ఆ కుర్రవాణ్ణి ఒక పొద క్రింద విడిచిపెట్టింది. "ఆ కుర్రవాడి చావు నేను చూడలేను" అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుంది. అలా కూర్చుండి వెక్కి వెక్కి ఏడ్చింది. దేవుడు ఆ కుర్రవాడి మొర విన్నప్పుడు దేవుని దూత పరలోకం నుంచి హాగరును పిలిచి ఆమెతో౼"హాగరూ, నీకేం వచ్చింది? ఆ కుర్రవాడు ఉన్నచోట దేవుడు అతడి మొర విన్నాడు. గనుక భయం పెట్టుకోకు. లేచి ఆ కుర్రవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకో. అతణ్ణి గొప్ప జనంగా చేస్తాను" అన్నాడు. అప్పుడామెకు ఒక ఊట కనపడేలా దేవుడు చేశాడు. ఆమె వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి కుర్రవాడికి త్రాగించింది. ❇ ✔ హాగరు అబ్రాహాము దేవుణ్ని విశ్వసించింది. సుమారు 17 సం|| క్ర...

12Sep2017

❇ యేసు ఒక కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడ కూర్చున్నాడు. ఆయన తలెత్తి చూసినప్పుడు పెద్ద జన సమూహం తన వైపు రావడం కనిపించింది.  యేసు తన శిష్యుడైన ఫిలిప్పుతో౼"వీళ్ళంతా భోజనం చేయడానికి రొట్టెలు ఎక్కడ కొన బోతున్నాం?" అని అడిగాడు. (యేసుకు తాను ఏం చేయబోతున్నాడో స్పష్టంగా తెలుసు. కేవలం ఫిలిప్పును పరీక్షించడానికి అలా అడిగాడు) ఫిలిప్పు౼"రెండు వందల దేనారాలతో రొట్టెలు కొని తెచ్చినా ఒక్కొక్కడికి చిన్న ముక్క ఇవ్వడానికి కూడా చాలదు" అన్నాడు. (మరొక శిష్యుడైన) అంద్రెయ౼"ఇక్కడ ఒక చిన్న కుర్రాడి దగ్గర ఐదు యవల రొట్టెలూ, రెండు చిన్న చేపలూ ఉన్నాయి గాని ఇంత మందికి ఎలా సరిపోతాయి?" అని ఆయనతో అన్నాడు. యేసు౼"ప్రజలందర్నీ కూర్చోబెట్టండి" అని శిష్యులకు చెప్పాడు. అక్కడ చాలా పచ్చిక ఉండటంతో ఆ ప్రజలంతా కూర్చున్నారు. వాళ్ళంతా సుమారు ఐదు వేలమంది ఉంటారు. యేసు ఆ రొట్టెల్ని చేతిలో పట్టుకుని కృతజ్ఞతలు చెప్పి కూర్చున్న వారికి పంచి ఇచ్చాడు. అలాగే చేపలు కూడా వాళ్లకు ఇష్టమైనంత వడ్డించాడు. అందరూ కడుపు నిండా తిన్నారు. తర్వాత ఆయన౼"మిగిలిన రొట్టే, చేపల ముక్కలన్నీ పోగు చేయండి. ఏదీ వ్య...

09Sep2017

❇ మోషే సీనాయి పర్వతం మీద నలభై పగళ్ళూ నలభై రాత్రులూ దేవునితో ఉన్నాడు. ఆ సమయంలో కొండ క్రింద ఇశ్రాయేలు ప్రజలంతా వారి బంగారు వస్తువులను పోగుచేసి వాటిని అహరోను దగ్గరకు తెచ్చారు. వాటితో ఒక దూడ విగ్రహం చేసాడు. అప్పుడు ప్రజలు౼"ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తు నుండి మిమ్మల్ని బయటకు నడిపించింది ఈ దేవుడే" అన్నారు. అహరోను ఆ దూడ ఎదుట ఒక బలిపీఠం కట్టాడు౼"రేపు యెహోవాకు పండుగ జరుగుతుంది" అంటూ ప్రకటన చేశాడు. మరుసటి రోజు తెల్లవారుతుండగానే వారు లేచి హోమాలు సమర్పించారు. శాంతి బలులు తెచ్చారు. తరువాత ప్రజలు తింటూ త్రాగుతూ కూర్చున్నారు, లేచి ఆడారు. ప్రజలు విచ్చలవిడిగా తిరిగారు. దేవుని కోపం వారిపై రగులుకొన్నది. ❇ ✔ ప్రజలు యెహోవా పేరునే మ్రొక్కారు౼బలులు అర్పించారు. తర్వాత తమకు నచ్చినట్లు ఆడారు. వీరికి దేవుడు ఏం చెప్తున్నాడో, ఏం చెయ్యమంటున్నాడో పనిలేదు. ఒకవేళ దేవుని వాక్యం ఉన్నట్లేతే వాటిని సైతం వారి కోరికలకు తగినట్లు అన్వయించుకునే వారు. నేడు ఈ వైఖరి సంఘాల్లో, సహవాసాల్లో కనిపించట్లేదా? ప్రజలను భావోద్రేకాలతో (emotions) చేసే భక్తిని ప్రోత్సహించే అహరోను లాంటి నాయకులు ఎందరో ఉన్నారు. వారి మనసుకు ఉల్ల...

08Sep2017

❇ జలప్రళయం తర్వాత మానవులంతా ఒకే భాష మాట్లాడేవారు. మనుషులు తూర్పు దిక్కునుండి బయలుదేరి, షీనారు దేశంలో మైదాన భూమిని వారు కనుగొని అక్కడే స్థిరపడి పోయారు. అప్పటి నుంచే ఇళ్లు కట్టుటకు ప్రజలు రాళ్లు కాకుండా ఇటుకలనే ఉపయోగించారు. అలానే అడుసు గాక తారును ఉపయోగించారు. అప్పుడు మనుషులు౼“మనం భూమి అంతటా చెదరిపోకుండేలా ఒక నగరాన్ని కట్టుకుందాం. ఆకాశన్నంటే గోపురం కట్టి మనం పేరు తెచ్చుకుందాం” అని అనుకున్నారు. ఆ పట్టణాన్ని, ఆ గోపుర శిఖరాన్ని చూచుటకు యెహోవా దిగి వచ్చాడు. వాటిని ప్రజలు నిర్మిస్తూ ఉండటం యెహోవా చూశాడు. అది ఆయన ఉద్దేశ్యాలకు వ్యతిరేకంగా ఉంది, కనుక వారి భాషలను తారుమారు చేశాడు. కాబట్టి వాళ్లు ఒకరు మాట్లాడేది ఒకరు అర్థం చేసుకోలేకపోయ్యారు. కనుక ఆ పట్టణాన్ని కట్టుకోవటం ప్రజలు ఆపివేసి, భూమిమీద ఇతర చోట్లన్నింటికీ చెదరిపోయ్యారు.ఆవిధంగా మనుషులు భూమి అంతటా చెదిరిపోయేటట్టు యెహోవా చేసాడు. దేవుడు వారి భాషను తారుమారు చేసినందు చేత ఆ నగరానికి "బాబెలు" అనే పేరు వచ్చింది. ❇ జలప్రళయం తర్వాత దేవుడు నోవహునూ, అతని కొడుకులనూ దీవించి వారితో౼"ఫలిస్తూ సంఖ్యలో అధికం కండి. భూలోకం నిండా విస్తరించండి...

06Sep2017

❇ యూదుల మహా సభలో అరిమతయియ యోసేపు అనే మంచివాడు, నీతిపరుడైన వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఇతడు యూదులకు భయపడి రహస్యంగా యేసును వెంబడించిన శిష్యుడుగా ఉన్నాడు. ఇతను దేవుని రాజ్యం రావాలని ఎదురు చూస్తూ ఉండే వ్యక్తి. యేసును చంపాలని మహాసభ చేసిన తీర్మానానికి ఇతడు సమ్మతించలేదు. యేసు సిలువపై చనిపోయినప్పుడు..తెగించి ధైర్యంగా పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు.పిలాతు అందుకు ఒప్పుకున్నాడు. కాబట్టి యేసు శరీరాన్ని సిలువ పైనుండి దించి, శుభ్రమైన నారబట్టతో చుట్టి, తాను రాతిలో తొలిపించుకొన్న తన కొత్త సమాధిలో ఆయన్ని ఉంచాడు. మొదట్లో రాత్రి సమయంలో ఆయన దగ్గరకు వచ్చిన నికోదేము కూడా ఇంచుమించు ముప్పై ఐదు కిలోల బోళం, అగరుల మిశ్రమం తనతో తీసుకొని వచ్చాడు.వాళ్ళు సుగంధ ధ్రవ్యాలతో, ఆ నార బట్టలతో యేసు దేహానికి చుట్టారు. తరువాత వారుపెద్ద రాయితో సమాధి ద్వారాన్ని మూసివేసి వెళ్లిపోయారు. ❇ ✔ యేసు బ్రతికి ఉన్న రోజుల్లో గుంపులు గుంపులుగా జనసమూహం ఎప్పుడూ ఆయన వెంట ఉండేవారు. ఆయన్నుండి స్వస్థతలు, అద్భుతాలు, భోధలు వంటి ఎన్నో మేలులు క్రీస్తు నుండి పొందుకున్నారు. ఆయన చనిపోయి తర్వాత నిశ్చేస్టూనిగా ఉన్నప్పుడు, ఆ గుం...

05Sep2015

❇ యేసు ఒక కథ చెప్పాడు.. "ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతడు పెద్ద కొడుకుతో౼ 'బాబూ, నీవు పోయి ఈ రోజు ద్రాక్షతోటలో పని చెయ్యి' అన్నాడు. అతడు౼'నేను వెళ్ళను' అని జవాబిచ్చాడు. కాని తరువాత మనస్సు మార్చుకొని వెళ్ళాడు. తండ్రి రెండోవాని దగ్గరకు వెళ్ళి అదేమాట చెప్పాడు. అతడు౼‘వెళ్తాను నాన్నగారు’ అన్నాడు గాని వెళ్ళలేదు" 'ఈ ఇద్దరిలో ఎవరు ఆ తండ్రి ఇష్టప్రకారం చేసినట్టు?' అని వారిని అడిగాడు. ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు౼"మొదటివాడే" అని జవాబిచ్చారు. యేసు౼"నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, అన్యాయంగా పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు మీకంటె ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ప్రవక్తయైన యోహాను నీతి మార్గంలో మీ దగ్గరకు వచ్చాడు గానీ అతణ్ణి మీరు నమ్మలేదు. అయితే పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు నమ్మారు. దాన్ని చూసైనా మీరు పశ్చాత్తాపపడి అతనిని నమ్మలేదు . ❇ ✔ గమనిస్తే మొదటి వాని మాటల్లో తండ్రి పట్ల గౌరవం లేదు. తిరుగుబాటు స్వరం, తన ఇష్టానుసారంగా ప్రవర్తన కనిపిస్తుంది. కాని ద్వేషించినా, తిరుగుబాటు చేసినా దాపరికం లేదు. వానిలో లోపట బయట ఒకే వ్యక్తి కనిపిస్తాడ...

04Sep2017

✔ దేవుణ్ని తెలుసుకోవడం అంటే వాక్యాలను, దాని మూలాలను (information), వివిధమైన పుస్తకాలను (refer చేసి) చదివి తెలుసుకోవడం కాదు. అదే నిజమైతే..చదువుకోని వారు,(ఈ లోక) జ్ఞానం లేని వారి విషయంలో దేవుడు అన్యాయస్తుడుగా ఉంటాడు. దేవుణ్ని తెలుసుకునే విధానం ఖచ్చితంగా జ్ఞాని౼అజ్ఞాని, చదువుకున్నా౼చదువు లేకున్నా, బీద౼ధనిక తేడా లేకుండా దేవుని తెల్సుకోగలిగేలా ఉండే విధానాన్నే దేవుడు ఎంచుకుంటాడు అనేది సుస్పష్టం. అది ఎలాగంటే..మన జీవితాల్లో ఆయన స్వభావాన్ని, ఆయన ప్రమేయాన్ని దగ్గర నుండి అనుభవాల గుండా తెలుసుకోవడం. ◆ మారు మూల పల్లెటూరులోని, ఏమాత్రం చదువులేని, బైబిల్లో వాక్యాలేమీ చదవలేని ఒక ముసలివాడైన వ్యక్తి దేవుణ్ని తెల్సుకొని ఉండి ఉండొచ్చు. అలాంటి వ్యక్తులకి దేవుణ్ని ఒక వ్యక్తిలాగా ప్రేమించడం మాత్రమే తెల్సు. దేవుణ్ని కన్న తండ్రిలాగా భావించడం తెల్సు. విన్న కొద్ది మాటలు విశ్వాసముంచి నమ్మకంగా దేవుణ్ని సేవించడం మాత్రమే వారికి తెల్సు. ఇలాంటి వారికి అత్యంత చేరువలో దేవుడు ఉంటాడు అనడంలో సందేహం లేదు. ◆ మరొక వ్యక్తి బైబిల్ యూనివర్సిటీలో పండితుడై, అక్కడ ఉన్నవారందరిలో జ్ఞానవతుడై ఉండొచ్చు కానీ దేవుణ్ని వ్యక్తిగతంగా తెల్...

02Sep2017

❇ ఇశ్రాయేలు జాతి ఐగుప్తుకు సుమారు 400 సం|| బానిసలుగా ఉన్నారు. వారిని బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు మోషే. అనేక అద్భుతాలు (విపత్తుల) ద్వారా ఐగుప్తును దేవుడు మొత్తి, తన ప్రజలను విడిచిపెట్టమని మోషే ద్వారా పలుకగా,ఫరో తన మనస్సును కఠిన పర్చుకున్నాడు కాని విడువలేదు.చివరి విపత్తుకు ముందు ఫరో మళ్లీ మోషేను పిలిపించి౼"మీరు వెళ్లి దేవుణ్ణి ఆరాధించండి. మీ పిల్లలు మీతో కూడా వెళ్ళవచ్చు. కాని మీ గొర్రెల్ని, పశువుల్ని మాత్రం ఇక్కడ విడిచి పెట్టిండి" అన్నాడు. మోషే౼"మా దేవునికి బలి అర్పించడానికి, ఆరాధించడానికి మాకు పశువులు కావాలి. కాబట్టి అలా కాదు. మా పశువులు కూడా మాతోపాటు రావాలి. ఒక్క డెక్క కూడ ఇక్కడ విడిచి మేము విడిచిపెట్టము" అన్నాడు. ❇ ✔ పాత నిబంధనలోని విషయాలు క్రొత్త నిబంధనలో ఉన్న మనకు ఆత్మీయ వర్ణనగా చూపబడతాయి. వారి బానిసత్వం నేడు సాతాను వేసిన (పాపపు బానిసత్వ) సంకేళ్ళకు, శరీర కోర్కెలకు గుర్తుగా ఉన్నాయి. మనలోని ప్రతి ఒక్కరం వివిధ రకాల పాపాలకు బానిసలుగా ఉన్నాము. ఇప్పటికీ వాటిలోని కొన్ని విషయాల ముందు మనం శక్తిహీనులుగా ఉన్నాము. ✔ బయట ప్రజలు నీ గ...

01Sep2017

❇ దేవుడు యోహానుకు ఈ లోక అంతంలో జరగబోయ్యే సంగతులను ముందుగానే చూపాడు. వాటిలో ఒక సంఘటన. యోహాను౼"లోక రక్షకుడు అయిదో ముద్రను విప్పినప్పుడు దేవుని సందేశాన్ని బోధించటాన్ని బట్టీ, తమ సాక్ష్యాన్ని బట్టీ హతమైన వారి ఆత్మలను ఒక బలిపీఠం క్రింద ఉండడం నేను చూశాను. వారు పెద్ద స్వరంతో ౼'సర్వాధికారీ, పరిశుద్ధుడా, సత్యస్వరూపీ, ఎంతకాలం ఇలా తీర్పు తీర్చకుండా ఉంటావు? మా రక్తానికి ప్రతిగా భూమిపై ఉన్న వారిని శిక్షించకుండా ఎంతకాలం ఉంటావు?' అని పలికారు. అప్పుడు వారిలో ప్రతి ఒక్కరికీ ఒక తెల్లటి వస్త్రం యివ్వబడింది. 'మీరు చంపబడినట్లే, మీ తోటి సేవకులు, సోదరులు చంపబడతారు. వారి లెక్క మొత్తం పూర్తి అయ్యేంతవరకూ ఇంకా కొంత సమయం వేచి ఉండాలి' అని వారికి చెప్పడం జరిగింది" (ప్రకటన 6:9-11) ❇ ✔ నీతిమంతులు హింసించబడ్డారు, చంపబడ్డారు..ఇప్పటికీ భాధింపబడుతూ, చంపబడుతూ ఉన్నారు. దేవుని భయంలేని దుష్టులకు, వారి పనులకు అడ్డుఅదుపు లేకుండా ఉన్నప్పటికీ, అన్యాయమే గెలుస్తున్నట్లు మనకు కనిపిస్తున్నప్పటికి, వారి చేతిలోనే సమస్తం ఉన్నదనట్లు మనకు అనిపిస్తున్నప్పుడు.. మన మనస్సుల్లో మెదిలే ప్రశ్నలకు సమాధానం ఇదే!...

31Aug2017

❇ సర్పం(సాతాను) హవ్వను మోసగించగా, హవ్వ దేవుడు తినవద్దన్న పండు తిని, తనతో పాటు తన భర్తయైన ఆదాముకు కొంత ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు. అప్పుడు వారి కన్నులు తెరువుబడ్డాయి. వారు నగ్నంగా ఉన్నామని తెల్సుకొని చెట్లు చాటున దాగారు. దేవుడు ఆదామును౼“నీవు ఎక్కడున్నావు?” అని పిలిచాడు. "చెట్టు చాటున నగ్నంగా ఉన్నాను కనుకనే రాలేకపోతున్నాను.. నీవు నా కిచ్చిన ఈ స్త్రీ వల్లే ఇదంతా జరిగిందని"బదులిచ్చాడు. అప్పుడు దేవుడు మోసగించిన సర్పాన్ని, (దురాశ చేత అవిధేయత చూపిన) మోసపోయిన హవ్వను శపించాడు. తర్వాత ఆదాముతో౼"నీవు 'నీ భార్య మాట విని, నేను నీకు తినవద్దని ఆజ్ఞాపించిన చెట్టు ఫలము తిన్నావు'..నేను నిన్ను చేసినప్పుడు మట్టిలో నుంచే నీవు తీయబడ్డావు. మళ్లీ నీవు చనిపోయినప్పుడు తిరిగి మట్టిలోనే కలిసిపోతావు" ❇ ✔ ఒంటరిగా ఉన్న ఆదాము కోసం సాటియైన సహకారిగా దేవుడే హవ్వను సృష్టించాడు. దేవుడిచ్చిన తోడును ఆదాము ఎంతో ప్రేమించాడు. (దేవుని కంటే )ఎవరి మాట ఎక్కువగా వినేందుకు ఆదాము ఇష్టపడతాడో సాతాను పసిగట్టాడు! ప్రత్యక్షంగా ఒకరిని, పరోక్షంగా మరొకరిని మోసాగించాడు. ఈ విధంగా మానవాళి జీవాన్నంతటిని వాడు దొంగ...

30Aug2017

❇ యేసు పునరుద్దారుడైన తర్వాత శిష్యులకు కనిపించాడు. అప్పుడు 12 మంది శిష్యులలో ఒకడైన తోమా వాళ్ళతో లేడు. తోమా వచ్చినప్పుడు మిగిలిన శిష్యులు౼"మేం ప్రభువును చూశాం" అని అతడితో చెప్పారు. అప్పుడు అతడు "నేను ఆయన మేకుల గుర్తును చూడాలి. నావేలు ఆ గాయపు రంధ్రం లో ఉంచాలి. అలాగే నేను నా చేతిని ఆయన పక్కలో ఉంచాలి. అప్పుడే నేను నమ్ముతాను" అన్నాడు. 8 రోజులైన తర్వాత మరల ఆయన శిష్యులు లోపల ఉన్నారు. ఈసారి తోమా కూడా వాళ్ళతో ఉన్నాడు. తలుపులు మూసి గడియ వేసి ఉన్నాయి. అప్పుడు యేసు వాళ్ళ మధ్యకు వచ్చి౼" మీకు శాంతి కలుగు గాక!" అని చెప్పి..ఆయన తోమాను చూసి౼"నీ వేలు ఇలా చాచి నా చేతిని చూడు. అలాగే నీ చెయ్యి చాచి నా పక్కలో పెట్టు. విశ్వాసిగా ఉండు. అవిశ్వాసివి కావద్దు" అన్నాడు. తోమా ఆయనతో౼"నా ప్రభూ, నా దేవా" అన్నాడు. యేసు౼"నువ్వు నన్ను చూసి నమ్మావు. అయితే నన్ను చూడకుండానే నమ్మిన వాళ్ళు ధన్యులు" అన్నాడు ❇ ✔ యేసును సిలువ వేసినప్పుడు, సమాధి చేసినప్పుడు తోమా అక్కడ లేడు. కాని ఆయన పక్కలో పొడిచారని మరొకరు చెప్పినప్పుడు చూడకపోయినా నమ్మాడు(యోహా 19:34, 20:25). కా...

29Aug2017

❇ పౌలు౼"ఒకప్పుడు నేను దైవదూషణ చేసినవాణ్ణి, హింసించిన వాణ్ణి, క్రూరుణ్ణి. నాలో విశ్వాసం లేకపోవడం వల్ల, తెలియక చేశాను కాబట్టి దేవుడు నాపై కనికరం చూపాడు. పాపుల్ని పాప విముక్తుల్ని చేయడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు.ఈ మాట నమ్మతగిన విషయం. దీన్ని అందరూ అంగీకరించాలి. పాపులందరిలోనూ ప్రముఖ పాపిని నేనే! నిత్యజీవం కోసం తనను విశ్వసించబోయే వారికి నేను మాదిరిగా ఉండేలా యేసు క్రీస్తు తన పరిపూర్ణమైన సహనాన్ని నాలో ప్రదర్శించి నన్ను కరుణించాడు" (1తిమో 1:15,16) ❇ ✔ ఈ లోకంలో మనుష్యులు మంచి లక్షణాలు/ అలవాట్లు గలవారిని వెతకి, వారిని ప్రేమించినట్లు దేవుడు కూడా అలానే చేస్తే, నాలాంటి అత్యంత బలహీనులకు నిరీక్షణ ఉండేది కాదు. దేవుని వెలుగు హృదయాన్ని తాకుతున్నా, సొంత జ్ఞానంతో కఠిన పర్చుకొని, త్రోసిపుచ్చడం అవిధేయత! అజ్ఞానం..తెలియక చేసి, దేవుని వెలిగింపునివ్వగా యదార్థవంతులై సత్యాన్ని ఒప్పుకొని, తమను తాము ఆ సత్యానికి అప్పగించుకొనువారు (పౌలు వంటి వారు). దేవునికి బాగా తెల్సు ఏది అజ్ఞానమో, ఏది అవిధేయతో! ✔ కొందరు తెలివిగల వారమనే బుద్ధిహీనులు, నేను కోరుకున్నది(పాపం) చేసి, తర్వాత దాన్ని ఒప్పుకొంటాను కనుక...

28Aug2017

❇ యాబీనుకు అనే కానానుకు రాజుకు 900 ఇనుప రథాలుండేవి. అతడు 20 సం|| ఇశ్రాయేలీయుల ప్రజలను తీవ్రంగా బాధించాడు, కనుక వారు దేవునికి మొర్రపెట్టారు. ఆ రోజుల్లో దెబోరా అనే స్త్రీ ఇశ్రాయేలు ప్రజలకు నాయాధిపతిగా ఉండేది. దెబోరా బారాకుతో౼"ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీకు ఇలా ఆజ్ఞ ఇస్తున్నాడు. ‘వెళ్ళు! నఫ్తాలి జెబూలూను వంశాల నుండి 10,000 మంది వెంటబెట్టుకొని తాబోరు కొండకు వెళ్ళు. యాబీను రాజు సైన్యాధిపతియైన సీసెరాను, అతని రథాలను, ఓడించేందుకు నేను నీకు సహాయం చేస్తాను. అతణ్ణి నీ వశం చేస్తాను". ఐతే బారాకు భయపడి దెబోరాతో౼"నువ్వు కూడా నాతో వస్తేనే వెళ్తానని" చెప్పాడు.కాబట్టి దెబోరా అతనితో పాటు యుద్దానికి వెళ్ళింది..దేవుడు యాయేలు అనే ఒక సామాన్య స్త్రీ చేత, గుడారపు మేకుతో యాబీను రాజు సైన్యాధిపతియైన సీసెరాను చంపించాడు ❇ ✔ మన అల్పవిశ్వాసం వల్ల(మన స్వంత శక్తి, జ్ఞానంలో నుండి అంచనా వేసి) దేవుని శక్తిని చులకన చేసి, దేవుణ్ని అవమానించకూడదు. యుద్ధం దేవునిదైతే బలహీనమైన వాని/వాటి నుండి బలమైన కార్యాలు చెయ్య సమర్ధుడాయన. విశ్వాసం దేవుని హస్తాన్ని కదిలిస్తుంది. నిజానికి సీసెరాను దేవుడు బారాకుకు అప్పగ...

25Aug2017

■ నెహెమ్యా౼"యెరూషలేము శిథిలాల గుట్టలావుంది. దాని తలుపులు మంటలకి కాలిపొయాయి. రండి, యెరూషలేము గోడలను తిరిగి కట్టుదాం!" అని ప్రజలతో అన్నాడు. తనకు తోడుగా ఉన్న దేవుని కరుణా హస్తాన్ని గురించి, చక్రవర్తి తనతో చెప్పిన మాటలను వారికి తెలియజేశాడు. -అప్పుడు ప్రజలు౼“మనం నిర్మించడం ఆరంభిద్దాం రండి” అని చెప్పి, ఆ మంచి పని చేయడానికి బలంతో మొదలుపెట్టారు. (నెహెమ్యా 2:17,18) ౼ఒకడు నమ్మకస్థుడై, దేవునికి ప్రధమ స్థానం ఇస్తూ, తన స్వంత పనులకంటే దేవున్ని(కార్యాలను) ఘనంగా ఎంచినవాడై దేవునితో నడుస్తున్నప్పుడు, ఆయన తన హృదయ భారాన్ని అతనితో పంచుకుంటాడు. ౼దేవునితో సంభంధం ఉన్న అలాంటి ఒక్క నాయకుడులో దేవుడు పుట్టించిన ఆలోచన, భారంలేని అనేకులకు దర్శనాన్ని అనుగ్రహిస్తుంది(ఆయన ఉద్దేశ్యాల్లోకి తెస్తుంది). ■ నెహెమ్యా ప్రజల ప్రధానులతో, అధికారులతో౼"శత్రువులకు మీరు భయపడకండి. మహా ఘనుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకోండి...దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు"(నెహెమ్యా 4:14,19) ౼నాయకుడు దేవుని బల ప్రభావాలను వ్యక్తిగతంగా తెల్సుకున్నవాడై, ప్రజలను ఎప్పుడూ దేవుని వైపు చూపించే గుర్తు(signpost)లాంటి వా...

24Aug2017

❇ యేసు దారిలో వెళ్తుండగా అధికారి, ధనవంతుడైన యవ్వనుడొకడు పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు మోకరిల్లి౼"మంచి బోధకుడా, పరలోక రాజ్యం వెళ్లాలంటే నేను ఏం మంచి పని చేయాలి?" అని ఆయన్ని అడిగాడు. యేసు౼"నన్ను మంచి వాడని ఎందుకంటున్నావు? దేవుడు తప్ప ఎవరు మంచి వారు కాదు!దేవుని ఆజ్ఞలు నీకు తెలుసు కదా! వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, తలిదండ్రుల్ని గౌరవించు మరియు నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో, నీ పొరుగువాణ్ణి కూడా అంతే ప్రేమించు" అని అతనితో అన్నాడు. అప్పుడతడు౼"వీటన్నిటినీ నా చిన్నతనం నుండీ పాటిస్తూనే ఉన్నాను. ఇవి కాక నేనింకేమి చెయ్యాలి?" అని అన్నాడు. యేసు అతన్ని ప్రేమతో చూసి౼"ఇంకా ఒకటి లోటుగా ఉంది. నీవు పరిపూర్ణత సాధించాలంటే, వెళ్ళి నీకున్నదంతా అమ్మి పేదవాళ్ళకు ఇవ్వు! అప్పుడు పరలోకంలో నీకు సంపద దొరుకుతుంది. తరువాత నీవు వచ్చి నన్ను అనుసరించు!" ఐతే అతడు గొప్ప ఆస్తిపరుడు కనుక యేసు చెప్పిన ఆ మాట వినగానే..చాలా విచారంగా, ముఖం చిన్నబుచ్చుకొని దుఖంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు ❇ ◆మంచి ఉద్దేశ్యం కలిగి ఆశగా పరుగెత్తుకొ...

22Aug2017

దేవుని దృష్టిలో భూమిపై నరులు అందరిని పాపులుగా, నాశనానికి పాత్రులుగా ఎంచబడ్డారని బైబిల్ చెప్తుంది. కొన్ని పాపాలు బయటికి కనిపించేవి, కొన్ని రహస్యంగా జరిగేవి, కొన్ని లోలోపలే అంతరంగంగా జరిగేవి. మనుష్యులకు తెల్సినవి బాహ్యంగా కనిపించేవే! పరిమితుడైన మానవుడు ఎదుటివారి రహస్య, అంతరంగాన్ని చూడలేదు. కాని దేవునికి మాత్రం అంతా సుస్పష్టమే!కాబట్టే దేవుని తీర్పులు, మానవుని అంచనాలను తారుమారు చేస్తాయి. ● పరాయి వాని భార్యను ఆశించి, వాణ్ని చంపి వేసిన వ్యక్తిని ఎవరైన భక్తిపరుడని(దేవుని హృదయం వంటి వాడని) అనగలరా? (దావీదు) ● బయటికి మంచి సాక్ష్యం కలిగి నీతిని పాటిస్తున్న వ్యక్తిని నరక అంచుల్లో ఉన్నాడని ఎవ్వరైనా చెప్పగలరా?(ధనవంతుడైన యవ్వన అధికారి) ● ఐదుగ్గురు భర్తలను మార్చి, ఇంకొకనితో ఉంటున్న స్త్రీని ఆ ఊరి రక్షణ కోసం దేవుడు ఎంచుకున్న సాధనం అని ఎవ్వరైనా గుర్తించగలరా?(సమరయ స్త్రీ) ● లంచగొండి, అన్యాయస్తుడైన అధికారిని..భక్తిపరుడు, దేవునికి విశ్వాసపాత్రుడైన వ్యక్తితో పాలినవాడని చెప్పగలరా?(జక్కయ్య) ● పాపాత్ముడైన ఒక మనిషికి పరలోక రాజ్యపు తాళపు చెవులను ఎవ్వరైనా అప్పగించగలరా?(పేతురు) ● జీవితకాలం అంతా దో...

21Aug2017

■ దేవుడు ఎంతో ధనవంతుడైన యోబు ఆస్తినంతటిని తీసివేసినా, అతని అరికాలునుంచి నడినెత్తివరకు చాలా బాధకరమైన కురుపులను అనుమతించినా... ౼"నేను నా తల్లి గర్భంలోనుంచి వచ్చినప్పుడు దిగంబరిగా వచ్చాను. దిగంబరి గానే తిరిగి వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చాడు. యెహోవా తీసివేశాడు. యెహోవా పేరుకు స్తుతి కలుగుతుంది గాక! మనం దేవుడిచ్చే మేలును మాత్రమేనా అనుభవించేది? కీడు అనుభవించకూడదా?" అన్నాడు.(యోబు 1:21,2:10) కాని ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి ఎన్నో అద్భుతాల ద్వారా బయటికి తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు వారిని పరీక్షించాడు. అరణ్యములో వారికి నీళ్లు దొరకలేదు. అప్పుడు ప్రజలు మోషే మీద సణిగారు ౼“ఇప్పుడు మేము ఏమి త్రాగాలి? అసలు నీవు మమ్మల్ని ఈజిప్టు నుండి ఎందుకు తీసుకొచ్చావు? నీళ్లు లేక మేము, మా పిల్లలు, మా పశువులు చావాలని నీవు మమ్మల్ని యిక్కడికి తీసుకొచ్చావా?” అన్నారు (నిర్గ 17:3) ■ "చెరనుంచి తప్పించుకొనిపోయి యింకా యూదాలోనే ఉన్న యూదులు చాలా యిబ్బందుల్లో వున్నారు. వాళ్లు చాలా సిగ్గుతోను, అనేక కష్టాలతోను వుంటున్నారు. యెరూషలేము గోడలు కూల్చబడ్డాయి. వాటి తలుపులు కాల్చివేయబడ్డాయి" ౼అని షూషను కోటలో...