❇ దేవుడు యోహానుకు ఈ లోక అంతంలో జరగబోయ్యే సంగతులను ముందుగానే చూపాడు. వాటిలో ఒక సంఘటన.
యోహాను౼"లోక రక్షకుడు అయిదో ముద్రను విప్పినప్పుడు దేవుని సందేశాన్ని బోధించటాన్ని బట్టీ, తమ సాక్ష్యాన్ని బట్టీ హతమైన వారి ఆత్మలను ఒక బలిపీఠం క్రింద ఉండడం నేను చూశాను.
వారు పెద్ద స్వరంతో ౼'సర్వాధికారీ, పరిశుద్ధుడా, సత్యస్వరూపీ, ఎంతకాలం ఇలా తీర్పు తీర్చకుండా ఉంటావు? మా రక్తానికి ప్రతిగా భూమిపై ఉన్న వారిని శిక్షించకుండా ఎంతకాలం ఉంటావు?' అని పలికారు.
అప్పుడు వారిలో ప్రతి ఒక్కరికీ ఒక తెల్లటి వస్త్రం యివ్వబడింది. 'మీరు చంపబడినట్లే, మీ తోటి సేవకులు, సోదరులు చంపబడతారు. వారి లెక్క మొత్తం పూర్తి అయ్యేంతవరకూ ఇంకా కొంత సమయం వేచి ఉండాలి' అని వారికి చెప్పడం జరిగింది" (ప్రకటన 6:9-11) ❇
✔ నీతిమంతులు హింసించబడ్డారు, చంపబడ్డారు..ఇప్పటికీ భాధింపబడుతూ, చంపబడుతూ ఉన్నారు. దేవుని భయంలేని దుష్టులకు, వారి పనులకు అడ్డుఅదుపు లేకుండా ఉన్నప్పటికీ, అన్యాయమే గెలుస్తున్నట్లు మనకు కనిపిస్తున్నప్పటికి, వారి చేతిలోనే సమస్తం ఉన్నదనట్లు మనకు అనిపిస్తున్నప్పుడు.. మన మనస్సుల్లో మెదిలే ప్రశ్నలకు సమాధానం ఇదే! (GOD is on the thrown) "దేవుడు సింహాసనాసీనుడై సర్వలోకాలను పరిపాలన చేస్తున్నాడు". ప్రతి విషయాన్ని పరిశీలనగా తెలుసుకున్నవాడు. నీతిమంతుల శ్రమను, మరణాన్ని అనుమతించిన వాడు ఆయనే(లూకా 12:7)! ఆయన అనుమతి లేకుండా ఎవ్వడూ ఏమి చేయలేడు. సర్వం దేవుని అధీనంలో ఉన్నది. నిశ్చింతగా ఉండండి! దీనమనస్కులై, సాత్వికంతో దేవుని చిత్తానికి తలవంచినప్పుడు..ఆయనదైన సమయంలో ఆయన కలుగజేసుకుంటాడు. ఒకవేళ భూమిపై కలుగజేసుకోపోయినా ఒక దినాన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. (శ్రమ దేవుని నిమిత్తం, ఆయన వాక్యం ప్రకారం జీవించడం నిమిత్తం నిలువబడితే వస్తుంది. అలా జీవించక పోయినట్లేతే నీవు లోకానికి స్నేహితుడవే కాబట్టి సాతానుకు, లోకానికి నీ వల్ల ఎలాంటి సమస్య లేదు కాబట్టి నీకు ఎలాంటి సమస్య ఉండదు..దేవుని దగ్గర తప్ప!)
✔ అందరికంటే ముందుగా నీతి నిమిత్తం హతుడైనవాడు క్రీస్తు! సృష్టికి పునాది వేయక మునుపే దేవుడు క్రీస్తును నియమించి, నీతి నిమిత్తం వధించాడు(ప్రక 13:8, 1పేతు 1:19,20). క్రీస్తు నీతి నిమిత్తం, దేవుని చిత్తం హత్తుకొను నిమిత్తం (వేదన పాత్రను సైతం) , శ్రమను, చావును లెక్కచేయకుండా, దేవునికి సజీవయాగంగా ప్రాణాత్మ దేహాలు బలిగా అర్పించాడు. కాబట్టి క్రీస్తు కూడా జ్ఞాపకం చేసుకోబడతాడు(ఫిలిప్పీ 2:9-11, ప్రక 1:7). అలాగే ఆయన కోసం బ్రతికేవారు జ్ఞాపకం చేసుకోబడతాడు. ఆయన ప్రవేశించని మార్గంలో మనల్ని నడవమని ఎన్నడూ దేవుడు ఆదేశించడు (1పేతు 2:21-23)
ఇది క్రొత్త మార్గం కాదు. హేబెలు మొదలుకొని మహా శ్రమల గుండా ప్రవేశించాల్సిన విశ్వాసుల వరకు వెళ్లవల్సిన మార్గం ఇది. గొఱ్ఱెపిల్లయైన క్రీస్తు మార్గం. వారిని దేవుడు ఆయన రాజ్యంలో ప్రత్యేకంగానే చూస్తాడు(ప్రక 3:12). మనకు గొప్ప నిరీక్షణ ఉంది, కాబట్టి శ్రమల్లో దేవుని హస్తాన్ని చూసి ధైర్యంగా ఉందాం!(మత్త 5:10-12). సర్వకాలల్లో ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు! ఆమెన్!
Comments
Post a Comment