❇ దేవుని మాటను బట్టి అబ్రాహాము..తన భార్యయైన హాగరును(ఐగుప్తు నుండి తేబడిన బానిస), వారి కుమారుడైన ఇస్మాయేలును పంపివేయడానికి తీర్మానించుకొన్నాడు.
తెల్లవారగానే అబ్రాహాము లేచి రొట్టెనూ, నీళ్ళతో నిండిన తిత్తినీ హాగరుకు ఇచ్చి, ఆమె భుజం మీద పెట్టి, ఆ కుర్రవాణ్ణి కూడా ఆమెకు అప్పగించి ఆమెను పంపివేశాడు.
ఆమె వెళ్ళిపోయి, బెయేర్షెబా ఎడారిలో తిరుగుతూ ఉంది. తిత్తిలో నీళ్ళు అయిపోయినప్పుడు ఆమె ఆ కుర్రవాణ్ణి ఒక పొద క్రింద విడిచిపెట్టింది. "ఆ కుర్రవాడి చావు నేను చూడలేను" అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుంది. అలా కూర్చుండి వెక్కి వెక్కి ఏడ్చింది.
దేవుడు ఆ కుర్రవాడి మొర విన్నప్పుడు దేవుని దూత పరలోకం నుంచి హాగరును పిలిచి ఆమెతో౼"హాగరూ, నీకేం వచ్చింది? ఆ కుర్రవాడు ఉన్నచోట దేవుడు అతడి మొర విన్నాడు. గనుక భయం పెట్టుకోకు. లేచి ఆ కుర్రవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకో. అతణ్ణి గొప్ప జనంగా చేస్తాను" అన్నాడు.
అప్పుడామెకు ఒక ఊట కనపడేలా దేవుడు చేశాడు. ఆమె వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి కుర్రవాడికి త్రాగించింది. ❇
✔ హాగరు అబ్రాహాము దేవుణ్ని విశ్వసించింది. సుమారు 17 సం|| క్రితం, ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు, శారయి(అబ్రాము భార్య) శ్రమ పెట్టినప్పుడు, ఆమె అబ్రాము ఇంటి నుండి పారిపోయింది. తన శ్రమలో దేవునికి మొఱ్ఱపెట్టింది (ఆది 16:11).మార్గం మధ్యలో దేవుని దూత కనపడి, ఇష్మాయేలును గొప్ప జనాంగంగా చేస్తానని వాగ్ధానం చేసి, మళ్ళీ తిరిగి అక్కడికే పంపాడు. నేడు దేవుడే ఆమెను పంపి వేయమని అబ్రాహాముకు చెప్పాడు(గలతి 4:28-30, రోమా 9:7,8).ఆ సంగతి అబ్రాహము హాగరుకు చెప్పి ఉండొచ్చు. దేవుడు చేసే ప్రతి పనికి ఒక అర్ధం ఉంటుంది. మనకు అర్ధం కాని ప్రతి ప్రశ్నకు దేవుని దగ్గర జవాబు ఉంటుంది. శ్రమల్లో, ఏమి తోచని పరిస్థితుల్లోకి దేవుడు నడిపించినప్పుడు సైతం ఆయన మాటను మనం నమ్మాలని, ఆయన్ను ఆశ్రయించాలని దేవుడు ఎదురుచూస్తాడు.
✔ ఆమె దగ్గర ఉన్న నీళ్లు అయిపోయి, ఇష్మాయేలు చావుబ్రతుకుల్లో ఉన్నప్పుడు నిరీక్షణ కోల్పోయింది. తన బిడ్డ చనిపోతాడని ఏడ్చింది..ఐతే దేవుడు తనకు చేసిన వాగ్ధానాలు ఏమైయ్యాయి(ఏమౌతాయి)? అది ఆమె విశ్వాసానికి పరీక్షే కానీ మరేమికాదు. 'అందరూ నన్ను వదిలేశారు, దేవుడు సైతం నా చెయ్యి విడచిపెట్టాడు', అనిపించే సంఘటనల్లోకి దేవుడే నడిపిస్తాడు. అప్పుడు ఆయన వాగ్ధానాలను మరొకసారి స్థిరపరుస్తూ, మరింత లోతైన విశ్వాసంలోకి నడిపిస్తాడు. ఆయనే..ఆయనదైన సమయంలో శ్రమల తెరను తీసివేస్తాడు. మన దేవుడు చూచే దేవుడు, మన మొరలను ఆలకించే దేవుడు. లోకమంతా విడిచి పెట్టినా, మన చేతిని విడువని వాడు. ఆయనపై పరిపూర్ణంగా విశ్వాసం ఉంచు. ఆయన్ను ఆనుకో, ఆధారపడు. మనం ఆయనలో భయాలులేని పరిపూర్ణమైన జీవితం(జీవం)ను ఆనందించాలనే, మన కొరకు ఆయన చేసే ప్రయత్నం అంతా! అది ఆయనలో సంపూర్ణంగా విశ్వసించడంలోనే దాగివుంది. ఈ విలువైన పాఠం శ్రమల ద్వారా నేర్చుకోగలం.
దేవుడు౼"హాగరూ, నీకేం వచ్చింది? నీ దేవుని యందు విశ్వాసముంచు!"
అనే దేవుని స్వరం మనల్ని కూడా తాకనివ్వండి.

Comments
Post a Comment