Skip to main content

31Aug2017

సర్పం(సాతాను) హవ్వను మోసగించగా, హవ్వ దేవుడు తినవద్దన్న పండు తిని, తనతో పాటు తన భర్తయైన ఆదాముకు కొంత ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు. అప్పుడు వారి కన్నులు తెరువుబడ్డాయి. వారు నగ్నంగా ఉన్నామని తెల్సుకొని చెట్లు చాటున దాగారు.

దేవుడు ఆదామును౼“నీవు ఎక్కడున్నావు?” అని పిలిచాడు.
"చెట్టు చాటున నగ్నంగా ఉన్నాను కనుకనే రాలేకపోతున్నాను.. నీవు నా కిచ్చిన ఈ స్త్రీ వల్లే ఇదంతా జరిగిందని"బదులిచ్చాడు.
అప్పుడు దేవుడు మోసగించిన సర్పాన్ని, (దురాశ చేత అవిధేయత చూపిన) మోసపోయిన హవ్వను శపించాడు.
తర్వాత ఆదాముతో౼"నీవు 'నీ భార్య మాట విని, నేను నీకు తినవద్దని ఆజ్ఞాపించిన చెట్టు ఫలము తిన్నావు'..నేను నిన్ను చేసినప్పుడు మట్టిలో నుంచే నీవు తీయబడ్డావు. మళ్లీ నీవు చనిపోయినప్పుడు తిరిగి మట్టిలోనే కలిసిపోతావు"

✔ ఒంటరిగా ఉన్న ఆదాము కోసం సాటియైన సహకారిగా దేవుడే హవ్వను సృష్టించాడు. దేవుడిచ్చిన తోడును ఆదాము ఎంతో ప్రేమించాడు. (దేవుని కంటే )ఎవరి మాట ఎక్కువగా వినేందుకు ఆదాము ఇష్టపడతాడో సాతాను పసిగట్టాడు! ప్రత్యక్షంగా ఒకరిని, పరోక్షంగా మరొకరిని మోసాగించాడు. ఈ విధంగా మానవాళి జీవాన్నంతటిని వాడు దొంగిలించాడు. దేవుడు ద్వారా ఇవ్వబడిన ప్రతి ఒక్కరిని దేవునిలో నుండే ప్రేమించాలి/లోబడాలి కాని దేవుని స్థానాన్ని ఇవ్వకూడదు. చివరికి మనం ఎవరి ద్వారా దేవునిలోకి వచ్చామో, వారిని సైతం అపవాది మోసాగించ గల సమర్ధుడు ('ఏర్పరచబడిన వారు సైతం మోసగించబడతారు'౼మార్కు 13:22).

✔ అప్పటి వరకు ఆదాముకు తన భార్య ఇచ్చిన అన్ని ఫలాలూ మంచివై ఉండొచ్చు కానీ మానవాళి అంతటిని నాశనానికి నడిపించడానికి నిషేధించబడిన ఆ ఒక్క పండు చాలు! ఇప్పుడు ఆదాము మోసగించబడకుండా ఉండాలంటే ప్రతి పండును దేవుని మాటతో పోల్చి చూసుకోవాలి. అలాగే ఒక బోధకుడు 99 సత్యాలు భోదించి ఉండొచ్చు గాని..ఆధ్యాత్మిక జీవం నుండి తొలగించడానికి ఒక్క అబద్ద బోధ చాలు.
కనుక ప్రతి బోధ దేవుని వాక్యంతో సరి చూసుకోవాలి.నీ మొదటి సహవాసి దేవుడై ఉండాలి. దేవుని దగ్గరకు ప్రతి భోధ తీసుకెళ్ళి పరీక్షించాలి(బెరయా సంఘం ఇలాంటిదే). ఇది మంచి విషయం. ఎవ్వరికీ మనల్ని మనం సంపూర్ణంగా అప్పగించుకోకూడదు. అలా అప్పగించుకున్నట్లేతే సాతాను సులువుగా మోసగిస్తాడు. వాక్యానుసారమైన బోధ వ్యక్తిగతంగా దినదినం దేవునికి (క్రీస్తుకు) దగ్గర చేస్తుంది. క్రీస్తు సారూప్యంలోకి మార్చుతుంది. ఇది ఆరోగ్యకరమైన భోధకు గుర్తు! ఆయనకు మాత్రమే ప్రధమ స్థానం ఇచ్చి, మహిమపరచిన వారిని ఆయన భద్రం చేస్తాడు. (యూదా 1:24)

✔ పాపాన్ని దేవుడు ఎంత ద్వేషిస్తాడో తెలియాలంటే ఏదెను తోటను, కలువరి సిలువను చూస్తే అర్ధమౌతుంది.'ఒకే ఒక్క పాపం'౼మనిషిని ప్రేమామయుడైన దేవుని చేత బయటకు గెంటివేసేట్లు చేసింది. మానవాళి దేవునితో శాశ్విత ఎడబాటుకు(నరకశిక్షకు) కారణమయ్యింది. పాపం దేవాది దేవుణ్ణి సిలువలో నిలువెల్లా నరకయాతనకు గురిచేసింది. నేడు క్రీస్తు కృపను నిర్లక్ష్యం చేస్తున్నవారు కృపలో నుండి తొలిగేపొయ్యెవారిగా ఉంటారు. దేవుడు క్రీస్తును అనుగ్రహించినది..మన నిస్సాహాయతను, దేవుని కృపను గుర్తెరిగి, పాపాన్ని అసహ్యించుకొని దేవుణ్ని మరింతగా హత్తుకోవాలని! అంతేకాని, కృప ఉంది కనుక నేడు మీరు నిశ్చింతగా, నిర్భయంగా పాపం చేసి శిలువ రక్తంలో కడుక్కోమని కాదు. దేవుడు దేవుడే! ఆయన పరిశుద్ధత ఏదేనులోను, నేడు ఒక్కటే! ఆయన పరిశుద్ధుడు!

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...