❇ యేసు దారిలో వెళ్తుండగా అధికారి, ధనవంతుడైన యవ్వనుడొకడు పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు మోకరిల్లి౼"మంచి బోధకుడా, పరలోక రాజ్యం వెళ్లాలంటే నేను ఏం మంచి పని చేయాలి?" అని ఆయన్ని అడిగాడు.
యేసు౼"నన్ను మంచి వాడని ఎందుకంటున్నావు? దేవుడు తప్ప ఎవరు మంచి వారు కాదు!దేవుని ఆజ్ఞలు నీకు తెలుసు కదా!
వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, తలిదండ్రుల్ని గౌరవించు మరియు నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో, నీ పొరుగువాణ్ణి కూడా అంతే ప్రేమించు" అని అతనితో అన్నాడు.
అప్పుడతడు౼"వీటన్నిటినీ నా చిన్నతనం నుండీ పాటిస్తూనే ఉన్నాను. ఇవి కాక నేనింకేమి చెయ్యాలి?" అని అన్నాడు.
యేసు అతన్ని ప్రేమతో చూసి౼"ఇంకా ఒకటి లోటుగా ఉంది. నీవు పరిపూర్ణత సాధించాలంటే, వెళ్ళి నీకున్నదంతా అమ్మి పేదవాళ్ళకు ఇవ్వు! అప్పుడు పరలోకంలో నీకు సంపద దొరుకుతుంది. తరువాత నీవు వచ్చి నన్ను అనుసరించు!" ఐతే అతడు గొప్ప ఆస్తిపరుడు కనుక యేసు చెప్పిన ఆ మాట వినగానే..చాలా విచారంగా, ముఖం చిన్నబుచ్చుకొని దుఖంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు
❇
◆మంచి ఉద్దేశ్యం కలిగి ఆశగా పరుగెత్తుకొని వచ్చి అంతే నిరాశతో వెనుదిరిగాడు.క్రీస్తు ముందు వినయంగా మోకరిల్లాడు కాని అంతరంగంలో దేవుణ్ణి తిరస్కరించి వెళ్ళిపోయాడు. యవ్వనుడు, సంపన్నుడైన అధికారిలో బయటికి కనిపించే ఆధ్యాత్మిక చింతన, బయటకు మంచి (బాహ్య)సాక్య జీవితం! నీతిమంతుడు, మంచివాడు అని అనేకులు ద్వారా చెవిలో వినపడుతున్న మాటలు, అలాగే మనస్సులో కూడా అదే భావన!ఈ వ్యక్తిని మోసం చేశాయి.ఐతే దేవుని చూపు భిన్నంగా ఉంటుందని మనం ఇప్పటికే అనేక సార్లు విన్నాం కదా!మోసపోవొద్దు!మన కొలబద్ధ దేవుని వాక్కు!
◆ క్రీస్తు అతనిని ప్రేమించి నిజం చెప్పాడు.ఆ నిజం ఏమిటంటే... మన ఏ మంచి పని మనల్ని దేవుని రాజ్యం చేర్చలేదు.ఒకవేళ మంచి పని వల్ల దేవునిరాజ్యం చేరాలంటే..!ఏ పాపం చెయ్యకుండా.. పనులలో, ఆలోచనల్లో, అంతరంగంలో ఏ లోపం అంటూ లేకుండా పరిపూర్ణమైన వ్యక్తిగా ఉండగలిగినట్లేతే, అప్పుడు పరిశుద్ధ దేవునితో ఉండగలం.ఇది అసంభవం!రుచికరమైన వంటలో ఒక చిన్న బొద్దింకను వేస్తే తినగలమా?అంతా చెడిపోనట్లు ఎంచుతాము కదా! అలాగే మంచి పనుల ద్వారా ఎవ్వరూ, ఎన్నడూ నీతిమంతులుగా దేవుని ముందు నిలబడలేరు. మనలోని తప్పులు మన నీతి పనులన్నింటిని అపవిత్ర పరుస్తాయి.
◆ కనుకనే మనకు రక్షకుడు అవసరమయ్యాడు. పాపంలేని నీతిమంతుడు మన స్థానంలో మన పాప శిక్ష భరించడం ద్వారా..నీతిమంతుడు, రక్షకుడైన ఆయన్ను (యేసును) విశ్వసించడం ద్వారా ఆయన నీతిని పొందగలం. అలా నమ్మినప్పుడు ఏమి చెప్తున్నామంటే.."నా నీతి,నా మంచి నీ దగ్గరకు నన్ను చేర్చలేదు దేవా! నీ నీతి మాత్రమే నన్ను రక్షించగలదని" నమ్మి ఆయనలో దాగుతున్నాము.ఇది విశ్వాసం ద్వారా కలిగే నీతి. పనులను బట్టి వచ్చే నీతి అతిశయానికి దారితీస్తుంది(గలతీ 2:15,16).
౼ విశ్వాసం ద్వారా కలిగే నీతి అనే పునాది మీద దేవుని చేత ఏర్పాటు చేయబడిన మంచి పనులు అనే కట్టడాలు(క్రీస్తు స్వరూపం) కట్టబడాల్సివుంది(ఎఫెస్సి 2:8౼10).కట్టువాడు దేవుని ఆత్మే!

Comments
Post a Comment