❇ యాబీనుకు అనే కానానుకు రాజుకు 900 ఇనుప రథాలుండేవి. అతడు 20 సం|| ఇశ్రాయేలీయుల ప్రజలను తీవ్రంగా బాధించాడు, కనుక వారు దేవునికి మొర్రపెట్టారు. ఆ రోజుల్లో దెబోరా అనే స్త్రీ ఇశ్రాయేలు ప్రజలకు నాయాధిపతిగా ఉండేది.
దెబోరా బారాకుతో౼"ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీకు ఇలా ఆజ్ఞ ఇస్తున్నాడు. ‘వెళ్ళు! నఫ్తాలి జెబూలూను వంశాల నుండి 10,000 మంది వెంటబెట్టుకొని తాబోరు కొండకు వెళ్ళు. యాబీను రాజు సైన్యాధిపతియైన సీసెరాను, అతని రథాలను, ఓడించేందుకు నేను నీకు సహాయం చేస్తాను. అతణ్ణి నీ వశం చేస్తాను". ఐతే బారాకు భయపడి దెబోరాతో౼"నువ్వు కూడా నాతో వస్తేనే వెళ్తానని" చెప్పాడు.కాబట్టి దెబోరా అతనితో పాటు యుద్దానికి వెళ్ళింది..దేవుడు యాయేలు అనే ఒక సామాన్య స్త్రీ చేత, గుడారపు మేకుతో యాబీను రాజు సైన్యాధిపతియైన సీసెరాను చంపించాడు ❇
✔ మన అల్పవిశ్వాసం వల్ల(మన స్వంత శక్తి, జ్ఞానంలో నుండి అంచనా వేసి) దేవుని శక్తిని చులకన చేసి, దేవుణ్ని అవమానించకూడదు. యుద్ధం దేవునిదైతే బలహీనమైన వాని/వాటి నుండి బలమైన కార్యాలు చెయ్య సమర్ధుడాయన. విశ్వాసం దేవుని హస్తాన్ని కదిలిస్తుంది. నిజానికి సీసెరాను దేవుడు బారాకుకు అప్పగించాడు, అతని అల్పవిశ్వాసం ద్వారా తన ద్వారా జరగవల్సిన గొప్ప కార్యాన్ని దేవుడు మరొక ద్వారా జరిగించాడు.
✔ ఎప్పుడైన గమనించారా! దేవుడు ఒక వ్యక్తిని తన పనికి పిలిచే ముందు..వారు 'నేను ఈ పనికి సమర్థుడను కాను' అని వారు చెప్పినప్పుడు 'నేను నీకు తోడై ఉంటాను కనుక నీవు చెయ్యగలవని' దేవుడు చెప్తాడు. కొన్ని ఉదాహరణలు..
మోషే (నిర్గమ 3:9-12), యెహోషువా(యెహో 1:9), గిద్యోను(న్యాయ 6:15,16)....మరియ(లూకా 1:34,35),
పేతురు(లూకా 5:8,10), పౌలు(ఫిలిప్పీ 4:13)..
✔ దేవుడు సమర్ధుడు! దేవుని పనిముట్టుగా నీవు లేకపోతే 'మిగితా వారి వలె నేను చురుకైన వాడ్ని(talented) కాను' అని అనొద్దు..ఇక్కడ సమస్య విశ్వాసం! సృష్టిలో వ్యర్ధమైనదంటూ ఏమి లేదు! కారణం సృష్టికర్త గొప్పవాడు కాబట్టి. మరి ఆయన పొలికలో సృష్టింపబడిన వారు మరి ఎక్కువగా కారణజన్ములు కారా? నీ అల్ప విశ్వాసం, అవిధేయతల వల్ల దేవుని ప్రణాళికలను వ్యర్ధ పరచుకోకు.
✔ నీవు ప్రత్యేకంగా నిర్మించబడ్డ వానివి. నీ పట్ల దేవుని ఆలోచనలు ప్రత్యేకమైనవే. నీ జీవితానికి నీ సొంత ప్రణాళికలు వ్రాసుకొని జీవితం వ్యర్ధపరచుకోవద్దు. చివరికి అది(ఆయన చిత్తం కాని)దేవుని పనైనా సరే! మొదట వ్యక్తిగతంగా దేవుణ్ని తెలుసుకో! నీ జీవితానికి చాలిన వాడని రూఢీ పర్చుకో! అప్పుడు దేవుని గొప్ప కార్యాల్లో పాలినవాడిగా ఉంటావు.

Comments
Post a Comment