Skip to main content

06Sep2017

❇ యూదుల మహా సభలో అరిమతయియ యోసేపు అనే మంచివాడు, నీతిపరుడైన వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఇతడు యూదులకు భయపడి రహస్యంగా యేసును వెంబడించిన శిష్యుడుగా ఉన్నాడు. ఇతను దేవుని రాజ్యం రావాలని ఎదురు చూస్తూ ఉండే వ్యక్తి. యేసును చంపాలని మహాసభ చేసిన తీర్మానానికి ఇతడు సమ్మతించలేదు.
యేసు సిలువపై చనిపోయినప్పుడు..తెగించి ధైర్యంగా పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు.పిలాతు అందుకు ఒప్పుకున్నాడు. కాబట్టి యేసు శరీరాన్ని సిలువ పైనుండి దించి, శుభ్రమైన నారబట్టతో చుట్టి, తాను రాతిలో తొలిపించుకొన్న తన కొత్త సమాధిలో ఆయన్ని ఉంచాడు.
మొదట్లో రాత్రి సమయంలో ఆయన దగ్గరకు వచ్చిన నికోదేము కూడా ఇంచుమించు ముప్పై ఐదు కిలోల బోళం, అగరుల మిశ్రమం తనతో తీసుకొని వచ్చాడు.వాళ్ళు సుగంధ ధ్రవ్యాలతో, ఆ నార బట్టలతో యేసు దేహానికి చుట్టారు. తరువాత వారుపెద్ద రాయితో సమాధి ద్వారాన్ని మూసివేసి వెళ్లిపోయారు. ❇

✔ యేసు బ్రతికి ఉన్న రోజుల్లో గుంపులు గుంపులుగా జనసమూహం ఎప్పుడూ ఆయన వెంట ఉండేవారు. ఆయన్నుండి స్వస్థతలు, అద్భుతాలు, భోధలు వంటి ఎన్నో మేలులు క్రీస్తు నుండి పొందుకున్నారు. ఆయన చనిపోయి తర్వాత నిశ్చేస్టూనిగా ఉన్నప్పుడు, ఆ గుంపు ఎక్కడా కనిపించలేదు (చివరికి ఆయనతో మూడున్నర సంవత్సరాలు తిరిగిన శిష్యులు సైతం). జనసమూహం క్రీస్తు దగ్గరకి వచ్చి ఏదో ఒక మేలు పొందుకొని వెళ్లారు. కాని చనిపోయిన యేసు విషయంలో ధైర్యంగా ముందుకు వచ్చిన వారు కాదు. అరిమతయియ యోసేపు చనిపోయిన క్రీస్తు దేహం గూర్చి వెళ్తే తన ప్రాణానికి ప్రమాదమని, ఆ దేహం వల్ల తనకు ఎలాంటి ప్రయోజనం లేదని తెల్సినా క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని, తన ధనాన్ని(సమాధిని) ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. నేడు అనేకులు ఏదో ఆశించి దేవుని దగ్గరకు వస్తున్న వారే కానీ, క్రీస్తు కొరకు తమను తాము త్యజించుకొని బ్రతుకుచున్నవారు కాదు. ఆ నేరం వారి భోధకులది కూడా!

✔ అప్పటివరకు నీ కోసం ప్రాణం పెడ్తమన్న శిష్యులు పారిపోయారు భయపడుతూ ఉన్న యోసేపు, నికొదేములు ధైర్యంగా బయటికి వచ్చారు. నీతి నిమిత్తం క్రీస్తు పొందుతున్న శ్రమను చూసి, ఒకవేళ తమ ఆత్మలో బలం పొందుకొని ఉండొచ్చు. దేవుని ఆత్మ శక్తితో జీవించక పోతే, భక్తి విషయంలో మొదటివారు చివరివారిగా, చివరి వారు మొదటి వారిగా మారిపోతారు(మన స్వంత శక్తితో దీనిని కొనసాగించలేము అనేది సత్యం).

✔ యెషయా 53:9 లో వ్రాయబడ్డ ప్రవచనాలు తన గూర్చెనని యేసేపుకు తెలిసి ఉండకపోవచ్చు. యేసేపు పుట్టక ముందే ఈ మంచి కార్యం కోసం దేవుడు అతనిని నియమించాడు. సమయం వచ్చినప్పుడు దేవుని మనస్సు ప్రేరేపించగా ఆ మాటకు విధేయుడయ్యాడు. తనను గూర్చిన దేవుని ఉద్దేశ్యలు అప్పుడు అతనిలో నెరవేరాయి. నేడు మనల్ని గూర్చి కూడా మంచి పనులను దేవుడు ముందుగానే నియమించాడు. అవి నేడు మనకి సమీపంలో, మన చుట్టూ ఉన్నాయి. వాటిలో మనం నిలిచి ఉండాలని ఇప్పటికే దేవుడు అక్కడకు మనల్ని నడిపించాడు. అనాది కాలంలో దేవుడు మన కోసం నియమించిన ఏ కార్యం మనలో తప్పిపోకుండా ప్రార్ధిద్దాం! నిలిచి ఉందాం!

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...