దేవుని దృష్టిలో భూమిపై నరులు అందరిని పాపులుగా, నాశనానికి పాత్రులుగా ఎంచబడ్డారని బైబిల్ చెప్తుంది. కొన్ని పాపాలు బయటికి కనిపించేవి, కొన్ని రహస్యంగా జరిగేవి, కొన్ని లోలోపలే అంతరంగంగా జరిగేవి. మనుష్యులకు తెల్సినవి బాహ్యంగా కనిపించేవే! పరిమితుడైన మానవుడు ఎదుటివారి రహస్య, అంతరంగాన్ని చూడలేదు. కాని దేవునికి మాత్రం అంతా సుస్పష్టమే!కాబట్టే దేవుని తీర్పులు, మానవుని అంచనాలను తారుమారు చేస్తాయి.
● పరాయి వాని భార్యను ఆశించి, వాణ్ని చంపి వేసిన వ్యక్తిని ఎవరైన భక్తిపరుడని(దేవుని హృదయం వంటి వాడని) అనగలరా? (దావీదు)
● బయటికి మంచి సాక్ష్యం కలిగి నీతిని పాటిస్తున్న వ్యక్తిని నరక అంచుల్లో ఉన్నాడని ఎవ్వరైనా చెప్పగలరా?(ధనవంతుడైన యవ్వన అధికారి)
● ఐదుగ్గురు భర్తలను మార్చి, ఇంకొకనితో ఉంటున్న స్త్రీని ఆ ఊరి రక్షణ కోసం దేవుడు ఎంచుకున్న సాధనం అని ఎవ్వరైనా గుర్తించగలరా?(సమరయ స్త్రీ)
● లంచగొండి, అన్యాయస్తుడైన అధికారిని..భక్తిపరుడు, దేవునికి విశ్వాసపాత్రుడైన వ్యక్తితో పాలినవాడని చెప్పగలరా?(జక్కయ్య)
● పాపాత్ముడైన ఒక మనిషికి పరలోక రాజ్యపు తాళపు చెవులను ఎవ్వరైనా అప్పగించగలరా?(పేతురు)
● జీవితకాలం అంతా దోపిడీలతో, హత్యలతో బ్రతికిన వాణ్ణి అత్యంత పరిశుద్ధుడు తన వెంట తీసుకొని పరలోకం తీసుకువెళ్తాడని ఎవ్వరైనా ఉహించగలరా?(సిలువపై దొంగ)
● తమ ఆస్థులను దేవుని సేవకై అమ్మి ఇచ్చిన ఒక కుటుంబాన్ని.. దేవుణ్ని మోసాగించినవారని ఎవ్వరైనా చెప్పగలరా?(అననీయ సప్పిరాలు)
★ కానీ దేవుడు చెప్పాడు★
౼ ఇలాంటి ఉదాహరణలెన్నో బైబిల్లో ఉన్నాయి. పైన చెప్పిన వారి జీవితాల్లో ప్రభువుని కలుసుకోక ముందు వారి జీవితం౼కలుసుకున్న తర్వాత వారి జీవితం. వారు తప్పు చేసినప్పటి జీవితం౼తప్పు తెల్సుకొని యదార్ధంగా పశ్చత్తాపడినప్పటి జీవితం.
౼ ఒక మనిషి వైఖరి తప్పు చేసినప్పుడు కాదు తెలిసేది, ఆ తప్పు తప్పని తెలిసిన తర్వాత వాళ్ళ స్పందించిన తీరును బట్టి తెలుస్తుంది..అదే, దేవుని మాట పట్ల వారి నిజమైన వైఖరి! కొందరు కఠిన పర్చుకోగా, కొందరు కప్పిపుచ్చు కొంటారు. మరికొందరైతే యదార్ధంగా అంగీకరించి క్షమాపణ పొంది వదిలివేస్తారు. అలాంటి వారు దైవికమైన ప్రజలు. దేవుని సంభంధి విశ్లేషించే తీరు దైవమనస్సుని పోలి ఉండాలి.
Comments
Post a Comment