❇ ఇశ్రాయేలు జాతి ఐగుప్తుకు సుమారు 400 సం|| బానిసలుగా ఉన్నారు. వారిని బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు మోషే. అనేక అద్భుతాలు (విపత్తుల) ద్వారా ఐగుప్తును దేవుడు మొత్తి, తన ప్రజలను విడిచిపెట్టమని మోషే ద్వారా పలుకగా,ఫరో తన మనస్సును కఠిన పర్చుకున్నాడు కాని విడువలేదు.చివరి విపత్తుకు ముందు ఫరో మళ్లీ మోషేను పిలిపించి౼"మీరు వెళ్లి దేవుణ్ణి ఆరాధించండి. మీ పిల్లలు మీతో కూడా వెళ్ళవచ్చు. కాని మీ గొర్రెల్ని, పశువుల్ని మాత్రం ఇక్కడ విడిచి పెట్టిండి" అన్నాడు.
✔ పాత నిబంధనలోని విషయాలు క్రొత్త నిబంధనలో ఉన్న మనకు ఆత్మీయ వర్ణనగా చూపబడతాయి. వారి బానిసత్వం నేడు సాతాను వేసిన (పాపపు బానిసత్వ) సంకేళ్ళకు, శరీర కోర్కెలకు గుర్తుగా ఉన్నాయి. మనలోని ప్రతి ఒక్కరం వివిధ రకాల పాపాలకు బానిసలుగా ఉన్నాము. ఇప్పటికీ వాటిలోని కొన్ని విషయాల ముందు మనం శక్తిహీనులుగా ఉన్నాము.
✔ బయట ప్రజలు నీ గురించి ఏం చెప్పుకుంటున్నారనే బాహ్య సాక్ష్యం నుండి ముందు విడుదల పొందు. వారికి నీ గురించి తెల్సిన జీవితం అతి కొంచెము! నీ లోపల నుండి, దేవుని ఆత్మ నీ అంతరంగంలో నుండి చెప్పే స్వరాన్నే లక్ష్య పెట్టు. అప్పుడు అపవాది మోసం నుండి బయటపడతావు. ఒకవేళ పాపం చేస్తున్నప్పటికీ అపరాధ భావం కలుగట్లేదంటే..నీవు అనేక సార్లు ఆ తప్పును స్వేచ్ఛగా చేసుకొనిపోవడం వల్ల నీ మనసాక్షి చెడి పోయిందని అర్ధం. క్రీస్తు రక్తం మన మనసాక్షిని శుద్ధి చేస్తుంది (హెబ్రీ 9:24). కనుక ఆయన రక్తం ద్వారా శుద్ధి చెయ్యమని దేవుణ్ని కోరు. అప్పుడు మంచి మనసాక్షిని కలిగి ఉంటావు.ఇది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమని పౌలు బోధించాడు (1తిమో 1:18-20)
✔ ఇశ్రాయేలీయులు ఇంకా ఐగుప్తులో ఉండగానే కనానుకు తీసుకువెళ్తానన్న దేవుని వాగ్ధానం వారికి ఉంది (నిర్గ 3:8).ఇది విశ్వాసంతో స్వతంత్రించుకోవాలి.పాపపు(ఏలుబడి) నుండి మనల్ని విడిపించడానికే దేవుడు క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడనే సాదృశ్యంగా ఉంది(గలతీ 1:4). ఇది మన విశ్వాసం!క్రీస్తులో మన రక్షణకు కారణం! నేడు దానిని మన జీవితాల్లో స్వతంత్రించుకోవాలి. మర్చిపోవద్దు! దేవుడు మనల్ని రక్షించింది (పరలోకం కోసం మాత్రమే కాదు) పాపపు బలం నుండి..అంటే ఇకను ఆ చీకటి క్రియల కాడిని అసహ్యించుకొని, బుద్ధిపూర్వకంగా పాప విమోచకుడైన క్రీస్తు యేసు నందు నిలిచి నీతికి పిల్లలంగా జీవించాలని! క్రీస్తు నిన్ను, నీ పాపపు బలహీనతలన్నిటి నుండి సంపూర్ణంగా విమోచించగలడని మొదట విశ్వాసముంచు!క్రైస్తవ జీవితానికి క్రీస్తు సంపూర్ణతే గురిగా జీవించాలని అపొస్తలులు, పౌలు పత్రికలు భోదిస్తున్నాయి (హెబ్రీ 6:1,2).
✔ ఇది అసాధ్యమని అపవాది చెవిలో గుసగుసలాడుతాడు. వాడు మెదటి నుండి అబద్దీకుడు. వాడి మాటలు నమ్మవద్దు. నిన్ను ఇంకా ఆ పాపాల కాడి క్రిందే ఉంచడానికి వాడి ఎత్తుగడ.
'ఒక్క డెక్కను కూడా నీకు వదలను. నా దేవుణ్ని ప్రాణాత్మ దేహాలతో సేవిస్తానని వాడితో చెప్పు'. సమస్తానికి విడుదల దేవుడు ప్రకటిస్తే౼'కొన్ని పాపాలు అలానే ఉండిపోతాయి.రాజీ పడాలి.ఇవి ఎవ్వరికీ తెలియవు..నువ్వు మంచి సేవ చేస్తున్నావు' అనే వాడి అబద్ధ స్వరాన్ని పాదాల క్రింద త్రొక్కు!(రోమా 16:20) ఇది విశ్వాస ప్రయాణం..మన యుద్ధభూమి మనలోనే ఉంది. ఎక్కడ పడిపోయిన స్వభావం నిన్ను ఏలుతుందో కనిపెట్టు! విడుదల గూర్చిన బలమైన కోరికతో, దేవుని ఆత్మ సహాయంతో మన శరీరక్రియలను చంపివేయ్యాలి. దేవుని వాగ్దానాలు ప్రకటిస్తూ ఒక్కొక్క ప్రదేశాన్ని ప్రభువుకు స్వంతం చెయ్యవల్సివుంది. వాగ్దానం దేవునిదైతే నీ పక్షాన పోరాడేవాడు కూడా దేవుడే!
౼ నీవు విశ్వాస వీరుడవై, సర్వాంగ కవచం ధరించి, అలిసిపోక దినదినం నూతన ఉత్సాహంతో పోరాడు! దినదినం దేవుని సహవాసంలో ఆ బలాన్ని మనం పొందుకుంటాం. దేవుడు నిన్ను, నన్ను ఆవిధంగా నిలుపును గాక
మోషే౼"మా దేవునికి బలి అర్పించడానికి, ఆరాధించడానికి మాకు పశువులు కావాలి. కాబట్టి అలా కాదు. మా పశువులు కూడా మాతోపాటు రావాలి. ఒక్క డెక్క కూడ ఇక్కడ విడిచి మేము విడిచిపెట్టము" అన్నాడు. ❇

Comments
Post a Comment