Skip to main content

12Sep2017

యేసు ఒక కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడ కూర్చున్నాడు. ఆయన తలెత్తి చూసినప్పుడు పెద్ద జన సమూహం తన వైపు రావడం కనిపించింది. 
యేసు తన శిష్యుడైన ఫిలిప్పుతో౼"వీళ్ళంతా భోజనం చేయడానికి రొట్టెలు ఎక్కడ కొన బోతున్నాం?" అని అడిగాడు. (యేసుకు తాను ఏం చేయబోతున్నాడో స్పష్టంగా తెలుసు. కేవలం ఫిలిప్పును పరీక్షించడానికి అలా అడిగాడు)
ఫిలిప్పు౼"రెండు వందల దేనారాలతో రొట్టెలు కొని తెచ్చినా ఒక్కొక్కడికి చిన్న ముక్క ఇవ్వడానికి కూడా చాలదు" అన్నాడు.
(మరొక శిష్యుడైన) అంద్రెయ౼"ఇక్కడ ఒక చిన్న కుర్రాడి దగ్గర ఐదు యవల రొట్టెలూ, రెండు చిన్న చేపలూ ఉన్నాయి గాని ఇంత మందికి ఎలా సరిపోతాయి?" అని ఆయనతో అన్నాడు.

యేసు౼"ప్రజలందర్నీ కూర్చోబెట్టండి" అని శిష్యులకు చెప్పాడు. అక్కడ చాలా పచ్చిక ఉండటంతో ఆ ప్రజలంతా కూర్చున్నారు. వాళ్ళంతా సుమారు ఐదు వేలమంది ఉంటారు. యేసు ఆ రొట్టెల్ని చేతిలో పట్టుకుని కృతజ్ఞతలు చెప్పి కూర్చున్న వారికి పంచి ఇచ్చాడు. అలాగే చేపలు కూడా వాళ్లకు ఇష్టమైనంత వడ్డించాడు. అందరూ కడుపు నిండా తిన్నారు. తర్వాత ఆయన౼"మిగిలిన రొట్టే, చేపల ముక్కలన్నీ పోగు చేయండి. ఏదీ వ్యర్ధం కానీయ వద్దు" అని శిష్యులతో చెప్పాడు. అందరూ తిన్న తర్వాత మిగిలిన ఐదు యవల రొట్టెల ముక్కలన్నీ పోగు చేశారు. అవి పన్నెండు గంపలు నిండాయి. ❇

✔ శిష్యులకు మాములుగా వాళ్ళ భోజనాన్ని, బయట కొనే అలవాటు ఉంది(యోహాను 4:8). ఫిలిప్పు మనుష్యులను, భోజనాలు, వాటి ధరలను బాగా అంచనా వేస్తున్నాడు.ఈ అద్భుతాన్ని యేసు, ఫిలిప్పును ఏమీ  ప్రశ్నించకుండానే చెయ్యవచ్చు. కానీ అలా అడగడంలో ఆయనకు ఒక ఉద్దేశ్యం ఉంది. దేవుడు ఫిలిప్పు విశ్వాసాన్ని వృద్ధి చెయ్యాలని చూస్తున్నాడు. అప్పటి వరకు ఉన్న అతని పరిమితమైన విశ్వాస కట్లను తెంచి, మరింత లోతైన విశ్వాసంలోకి నడిపించాలని చూస్తున్నాడు. విశ్వాసిని ఆయన మాటల్లో, పనుల్లో కలుపుకోవడం ద్వారా, అనుభవాల ద్వారా వారి ఆధ్యాత్మిక జీవితాలను మరింతగా మెరుగు పర్చుతున్నాడు (మత్తయి 16:8-10). దేవుడు వాడుకోలేనిది..తప్పిదాలను చేసిన వారిని (failures) కాదు, దేవుడంటే ఆసక్తిలేని వారిని . ఆసక్తి గల విశ్వాసికి నేర్పించడానికి ప్రతి రోజు(ప్రతి నిమిషం) ఒక విలువైన పాఠం దేవుని వద్ద ఉంటుంది.

✔ 5000 మంది ప్రజల్లో ఏ ఒక్కరి దగ్గరా భోజనం లేదా? ఆ చిన్న కుర్రాడి దగ్గరే మాత్రమే ఉందా!? తాను తినాలని తెచ్చుకున్న ఆహారాన్ని దేవుని కోసం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు.ఆ చిన్న హృదయంలో దేవునిపై ఉన్న ప్రేమ ఆ సమూహంలో ఉన్న వారిలో ఎవరికి తెల్సు?..దేవునికి మాత్రమే తెల్సు. దేవుడు దానిని అందరి ముందు బహిరంగ పరిచాడు. ఇది ఆయన స్వభావం(1సమూ 17:45-47). ఒకవేళ మిగితావారి దగ్గర భోజనం ఉన్నట్లేతే అది వారి ఆకలి మాత్రమే తీర్చి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఆ కుర్రాడి భోజనం వాని చేతి నుండి దేవుని చేతిలోకి వచ్చిందో అది ఆశీర్వాదకరంగా మారిపోయింది. దేవునికి మనల్ని మనం ఇచ్చివేసుకోకుండా (ప్రేమించకుండా) ఎన్నడూ ఆశీర్వాదకరంగా ఉండలేము. విరువబడనిదే అనేకులకు ఆహారంగా (ఆశీర్వాదంగా) మారలేము. క్రీస్తే దీనికి ఉదాహరణ. ఆయన దేవుణ్ని ప్రేమించి తన ప్రాణాత్మ దేహాలను దేవునికి అర్పణగా, ఆరాధనగా సమర్పించాడు. మన ఆరాధనలు కూడా అలాగే ఉండాలని పరలోక తండ్రి కోరుతున్నాడు.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...