■ నెహెమ్యా౼"యెరూషలేము శిథిలాల గుట్టలావుంది. దాని తలుపులు మంటలకి కాలిపొయాయి. రండి, యెరూషలేము గోడలను తిరిగి కట్టుదాం!" అని ప్రజలతో అన్నాడు. తనకు తోడుగా ఉన్న దేవుని కరుణా హస్తాన్ని గురించి, చక్రవర్తి తనతో చెప్పిన మాటలను వారికి తెలియజేశాడు.
-అప్పుడు ప్రజలు౼“మనం నిర్మించడం ఆరంభిద్దాం రండి” అని చెప్పి, ఆ మంచి పని చేయడానికి బలంతో మొదలుపెట్టారు.
(నెహెమ్యా 2:17,18)
౼ఒకడు నమ్మకస్థుడై, దేవునికి ప్రధమ స్థానం ఇస్తూ, తన స్వంత పనులకంటే దేవున్ని(కార్యాలను) ఘనంగా ఎంచినవాడై దేవునితో నడుస్తున్నప్పుడు, ఆయన తన హృదయ భారాన్ని అతనితో పంచుకుంటాడు.
౼దేవునితో సంభంధం ఉన్న అలాంటి ఒక్క నాయకుడులో దేవుడు పుట్టించిన ఆలోచన, భారంలేని అనేకులకు దర్శనాన్ని అనుగ్రహిస్తుంది(ఆయన ఉద్దేశ్యాల్లోకి తెస్తుంది).
■ నెహెమ్యా ప్రజల ప్రధానులతో, అధికారులతో౼"శత్రువులకు మీరు భయపడకండి. మహా ఘనుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకోండి...దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు"(నెహెమ్యా 4:14,19)
౼నాయకుడు దేవుని బల ప్రభావాలను వ్యక్తిగతంగా తెల్సుకున్నవాడై, ప్రజలను ఎప్పుడూ దేవుని వైపు చూపించే గుర్తు(signpost)లాంటి వాడు.(ప్రజలను తమ వైపు తిప్పుకొనే అనేక మంది నాయకులు నేడు ఉన్నారు.దేవునికి ప్రజలకు మధ్యవర్తులాగా ప్రవర్తిస్తుంటారు.ఇది తప్పుడు విధానం. నేరుగా దేవునికి అనుసంధానం చేయడమే దైవికమైన నాయకత్వం). దేవుని వైపు చూడక ధైర్యం చెడిన వారిని ఆయన సన్నిధిలోకి వారిని తెస్తూ, ధైర్యపరచేవానిగా ఉండాలి.
■ గోడ కట్టేవాళ్లు, వాళ్ల సహాయకులు ఒక చేత్తో పనిముట్లను, మరో చేత్తో ఆయుధాలను పట్టుకున్నారు.పని చేస్తున్న ప్రతి ఒక్క తాపీవాడూ తన పక్కనే ఒక కత్తిని పెట్టుకున్నాడు.(నెహెమ్యా 4:17,18)
౼శత్రువులు ఆ (దేవుని)పనిని ఆపాలని ప్రయత్నిస్తుండగా, దేవుని నాయకుడు ప్రజలను శత్రువుతో వ్యక్తిగతంగా పోరాడేవారిగా సిద్ధపరుస్తూనే, పనిని(దర్శనాన్ని) కొనసాగేటట్లు
తయారుచేశాడు. నేడు ఆత్మీయ పోరాటంలో కూడా ఇదే విధానం వర్తిస్తుంది. దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తుండగా, విశ్వాసి వ్యక్తిగత పోరాటానికి సిద్ధ పడుతూనే, దేవుని చిత్తప్రణాళికల నెరవేర్పు అనే పరుగులో అలిసిపోక పోరాడాలి.

Comments
Post a Comment