Skip to main content

29Aug2017

పౌలు౼"ఒకప్పుడు నేను దైవదూషణ చేసినవాణ్ణి, హింసించిన వాణ్ణి, క్రూరుణ్ణి. నాలో విశ్వాసం లేకపోవడం వల్ల, తెలియక చేశాను కాబట్టి దేవుడు నాపై కనికరం చూపాడు.

పాపుల్ని పాప విముక్తుల్ని చేయడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు.ఈ మాట నమ్మతగిన విషయం. దీన్ని అందరూ అంగీకరించాలి. పాపులందరిలోనూ ప్రముఖ పాపిని నేనే!
నిత్యజీవం కోసం తనను విశ్వసించబోయే వారికి నేను మాదిరిగా ఉండేలా యేసు క్రీస్తు తన పరిపూర్ణమైన సహనాన్ని నాలో ప్రదర్శించి నన్ను కరుణించాడు" (1తిమో 1:15,16)

✔ ఈ లోకంలో మనుష్యులు మంచి లక్షణాలు/ అలవాట్లు గలవారిని వెతకి, వారిని ప్రేమించినట్లు దేవుడు కూడా అలానే చేస్తే, నాలాంటి అత్యంత బలహీనులకు నిరీక్షణ ఉండేది కాదు. దేవుని వెలుగు హృదయాన్ని తాకుతున్నా, సొంత జ్ఞానంతో కఠిన పర్చుకొని, త్రోసిపుచ్చడం అవిధేయత! అజ్ఞానం..తెలియక చేసి, దేవుని వెలిగింపునివ్వగా యదార్థవంతులై సత్యాన్ని ఒప్పుకొని, తమను తాము ఆ సత్యానికి అప్పగించుకొనువారు (పౌలు వంటి వారు). దేవునికి బాగా తెల్సు ఏది అజ్ఞానమో, ఏది అవిధేయతో!

✔ కొందరు తెలివిగల వారమనే బుద్ధిహీనులు, నేను కోరుకున్నది(పాపం) చేసి, తర్వాత దాన్ని ఒప్పుకొంటాను కనుక దేవుడు క్షమిస్తాడు అనుకొంటారు. వారు ఆశించింది దొరికాక, 'దేవుణ్ని క్షమాపణ అడిగాను కనుక దేవుడు క్షమించాడని' చెప్పుకొని ఆత్మ వంచన చేసుకొంటారు. మనుష్యులను మోసం చెయ్యచ్చు! కాని దేవుణ్ని కాదు! దేవుడు నీ అంత జ్ఞానం లేనివాడనుకొంటున్నావా? ఆ మాత్రం గ్రహించలేకపోవడానికి.. ఆయన హృదయ రహస్యాలు తెల్సిన వాడు! ఒకవేళ యదార్ధంగా 'నాకు ఈ పని ఇష్టంగా ఉంది, నన్ను చెయ్యనివ్వు దేవా!' అంటే దేవుని యెదుట నీ యదార్థతను బట్టి, ఒకవేళ తిరిగి కనికరం పొందవచ్చునెమో! నీ అతి తెలివితో నీవు చిక్కుబడతావు. సమయం ఉండగా తిరిగి మారుమనస్సు పొందు.

✔ హాంతకుడై మరణ శిక్ష అనుభవించిన సిలువపై దొంగ కనికరించబడ్డాడు. అలాంటి కార్యాలు జీవితంలో ఎన్నడూ చేయ్యని వారు నశించిపోయ్యారు. దేవుడు కోరేది ఏమిటో ఇంకా అర్ధం కాలేదా..! మొదట యదార్థత, తర్వాత మారుమనస్సు, దానికి తగిన జీవితం. బలహీన ఘట్టాలలో (మనుష్యుల్లో) తన మహిమ నింపడానికి దేవునికి ఖాళీ ప్రదేశం దొరుకుతుంది. యదార్థత లేని హృదయాల్లో ఆయన నివసించడానికి చోటు ఉండదు. తన కృప మరియెక్కువగా బలహీనులకు చూపడం ద్వారా అనేక మంది బలహీనులకు దేవుడు నిరీక్షణనిస్తాడు. అనుదినం౼'నీవు లేకుండా నేను శూన్యం దేవా అని!' ఖాళీ చేసుకున్న హృదయాలతో ఆయన్ను సమీపించి, ఆయన కృపను వేడుకోవాల్సివుంది. అప్పుడు మనం ఆయన ఆత్మ చేత నింపబడే వారీగా ఉంటాము(ఆయన ఆధీనంలోకి వస్తాము).

✔ ఎలాంటి స్థితిలో నుండి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడో గుర్తు చేసుకొని, బలహీనులను దేవుడు మన ముందు ఉంచినప్పుడు అదే కృపను వారికిని చూప బద్ధులమై ఉన్నాము.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...