Skip to main content

Posts

Showing posts from September, 2017

30Sep2017

❇ యేసు పరిశుద్ధాత్మతో నిండి యొర్దాను నది నుండి తిరిగి రాగా దేవుని ఆత్మ ఆయన్ని అరణ్యంలోకి నడిపించాడు. అక్కడ 40 రోజులు సాతాను ఆయన్ని విషమ పరీక్షలకు గురి చేశాడు. ఆ రోజుల్లో ఆయన ఏమీ తినలేదు గనుక ఆయనకు బాగా ఆకలి వేసింది. అప్పుడు.... ● సాతాను ఆయనతో౼"నీవు దేవుని కుమారుడివయితే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు" అన్నాడు. యేసు౼"మనిషి కేవలం ఆహారంతోనే బతకడు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్లా బతుకుతాడు అని రాసి ఉంది"   ✔ 40 రోజుల క్రిందట దేవుడు-యేసును గూర్చి'ఈయనే నా ప్రియమైన కుమారుడు' అని సాక్ష్యం పలికాడు. ఆ మాటతోనే మొదలు పెడుతూ సాతాను ఆయన్ను శోధించడం మనం గమనించవచ్చు. అపవాది యేసులోని దైవత్వం నిరూపించు కొమ్మని అడిగితే, సాత్వికుడైన యేసు తను తాను మానవుని (మనుష్యుడు)గా బదులు పలుకుతున్నాడు. ఏదేనులో దేవతల వలె ఉంటారన్న సాతాను అబద్ధపు ప్రలోభాలకు మొదటి మనుష్యులు పూర్తిగా లోబడ్డారు. వారు ఆత్మకంటే శరీరాన్ని, భూసంభందమైన సౌఖ్యలకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ యేసు తన శరీర ఆకలిదప్పుల కృశించి పోతున్నప్పటికి దేవునితో సంభంధం కలిగి ఉండటాన్నే విలువైనదిగా ఎంచాడు. ● ఆ తర్వాత ...

26Sep2017

❇ సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో భోజనానికి కూర్చున్నాడు. వారంతా భోజనం చేస్తుండగా యేసు౼"మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను" అన్నాడు. అందుకు వారు చాలా దుఃఖంలో మునిగిపోయారు. ఒకరి తరువాత ఒకరు ఆయనతో౼"నేను కాదు కదా!" అని ఆయన్ని అడగటం ప్రారంభించారు. ఆయన౼"నాతో కలిసి పాత్రలో చెయ్యి ముంచి భోజనం చేసేవాడే నన్ను పట్టిస్తాడు. దేవుని నిర్ణయం ప్రకారం మనుష్యకుమారుడు చనిపోవలసిందే గాని ఆయనను ఎవరు పట్టిస్తాడో ఆ వ్యక్తికి 'శిక్ష (యాతన)' తప్పదు. ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండక పోయి ఉంటే అతనికి మంచిది." ❇ ✔ 'క్రీస్తుకు సిలువ మరణం' దేవుని నిర్ణయమే కానీ ఇస్కరియోతు యూదా కుయుక్తి-ద్రోహం దేవుడు ఆదేశించినవి కావు. దేవుడు ఎన్నడూ చెడుకు కర్త కాదు. కాబట్టి కీడు తలపెట్టి దేవుని చిత్తం జరిగించానని ఎవడూ అనకూడదు. అంటే "క్రీస్తు సిలువ వేయబడి చనిపోవడం వల్లే నేడు అనేకులు రక్షించ బడ్డారు/బడుతున్నారు, కనుక నా ద్వారా దేవుడు ఈ పనిని జరిగించాడు, ఈ మంచి పని కోసం దేవుడు నన్ను వాడుకున్నాడు" అని ఇస్కరియోతు యూదా చెప్ప కూడదు/చెప్పలేడు. ద...

25Sep2015

❇ బాప్తిస్మమిచ్చే యోహాను పుట్టుక గురించి దేవదూత ముందుగానే అతని తండ్రికి ఈ విధంగా తెలియజేశాడు.. గబ్రియేలు దూత జెకర్యాతో౼"జెకర్యా, భయపడకు. నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కొడుకును కంటుంది. అతనికి యోహాను అని పేరు పెడతావు...తల్లి గర్భాన పుట్టింది మొదలు దేవుని పరిశుద్ధాత్మతో నిండి ఉంటాడు. ఇశ్రాయేలీయుల్లో అనేకమందిని వారి ప్రభువైన దేవుని వైపుకు మళ్ళిస్తాడు. తండ్రుల హృదయాలను పిల్లల వైపుకీ, అవిధేయులను నీతిమంతుల జ్ఞానానికీ మళ్ళించడానికీ, తద్వారా ప్రభువు కోసం సిద్ధపడిన ప్రజానీకాన్ని తయారు చేయడానికి అతడు 'ఏలియా' మనసుతో బలప్రభావాలతో ప్రభువు కంటే ముందుగా వస్తాడు" ❇ ✔ బాప్తిస్మమిచ్చే యోహాను తన తల్లిదండ్రుల ముసలితనంలో పుట్టడం వల్ల, వారిని తన చిన్నతనంలోనే కోల్పోయాడు. ఒకవేళ అందువల్లే కాబోలు..అతని జీవనం అరణ్యములో కొనసాగింది. మిడతలు, అడవి తేనెను తింటూ, ఒంటె చర్మం ధరించాడు(మత్తయి 3:4). ఇతని వస్త్రధారణకు, మత పెద్దలు ధరించిన వస్త్రధారణకు చాలా తేడా ఉండేది. చూడగానే అడవి మనిషిని తలపించే ఆకారం.బాప్తిస్మమిచ్చే యోహానును అప్పటి మత పెద్దలు దైవ సంభంధిగా అంగీకరించ లేదు, పైగా దెయ్యం...

23Sep2017

❇ ఆదిలో దేవుడు భూమి, ఆకాశాలనూ సృజించాడు. అప్పుడు భూమి మొత్తం శూన్యంగా, రూపం లేకుండా ఉంది. మహా సముద్రాన్ని చీకటి ఆవరించింది. దేవుని ఆత్మ నీళ్ళపై సంచరిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు౼“వెలుగు కలుగును గాక!” అనగానే, వెలుగు వచ్చింది. దేవుడు ఆ వెలుగు చూశాడు. అది చక్కగా ఉన్నట్లు ఆయన చూసాడు. అప్పుడు దేవుడు ఆ వెలుగును, చీకటి నుండి 'వేరు' చేసాడు. వెలుగుకు “పగలు” అని, చీకటికి “రాత్రి” అని పేరు పెట్టాడు. అస్తమయము, ఉదయం అయ్యింది. ఇది మొదటి రోజు ❇ ■ దేవుడు సృష్టి నిర్మాణం అంతటిని ఆరు రోజుల్లో ముగించాడు. ఆదిలో ఖాళీగా, ఆకారం లేకుండా ఉన్న భూమిని దేవుడు తన ఆలోచనల్లోని రూపంతో నింపాలని కోరుకున్నాడు. ఆయన మాట పలుకగా, తన ఆత్మ ద్వారా నూతన నిర్మాణం జరిగింది. దినదినం ఆయన కోరుకున్న రూపంలోకి మార్పు చెందుతూ వచ్చింది.నేడు ఏ మాత్రం నిరీక్షణ లేని (శూన్యంగా, రూపంలేకుండా ఉన్న) జీవితాలపై దేవుడు పని చేయడానికి ఇష్టపడతాడు (మానవులందరి జీవితాలు ఈ స్థితిలోనే ఉన్నట్లు దేవుడు చూస్తున్నాడు). ■ నేర్పరియైన శిల్పి ఆకృతి లేని రాయిలో అందమైన రూపాన్ని ముందుగానే తన ఆలోచనల్లో చూచినట్లే...దేవుడు కూడా అస్తవ్యస్తంగా, ని...

21Sep2017

❇ యేసు ఆ దార్లోనే వస్తున్నాడని, జక్కయ్య తెల్సుకొని ముందుగా పరిగెత్తి వెళ్లి ఒక మేడి చెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, తలెత్తి చూసి౼"జక్కయ్యా, త్వరగా దిగిరా. ఈ రోజు నేను నీ ఇంట్లో ఉండాలి" అన్నాడు అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను తన ఇంటికి తీసుకు వెళ్ళాడు.అది చూసి జనులందరూ౼"ఈయన ఒక పాపి ఇంటికి అతిథిగా వెళ్ళాడు" అని గొణగడం మొదలు పెట్టారు ❇ ✔ యేసు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నవారందరిలో పాపాత్ములైన వారిని, తిరస్కరించబడిన వారిని, బలహీనులైన వారిని, నిస్సాహయులైన వారిని, ఈ లోకం వెలివేసిన వారిని, యదార్థవంతులను వెతుక్కుంటూ వెళ్తాడు. సమరయ స్త్రీ, సేన దెయ్యం పట్టిన వాడు, 38 సం|| నుండి కోనేరు దగ్గర ఉన్న రోగి, గుడ్డివాడై స్వస్థత పొంది వెలివేయబడిన వ్యక్తి , జక్కయ్య, జాలరులు, సుంకరులు, పాపులు మరియు సిలువపై దొంగ..మె||. నీవు క్రీస్తును అనుసరించాలి అనుకుంటున్నావా(క్రీస్తు శిష్యుడవా)? ఐతే ఆయన స్వభావాన్ని అనుసరించు. నీవు ఉన్న చోట..పాపంలో కూరుకుపోయిన వారు, సరిగ్గా ప్రవర్తించడం చేతకానివారు, నిర్లక్ష్యం చేయబడిన వారు, లోకరిత్యా హీనపర్చబడిన వారు, ఒంటరులను కనిపెట్టు. ఈ లోకసంబంధులు ఇ...

19Sep2017

నేను ఒక వ్యాపారవేత్తను..విశ్వాసిని! ఒక accidentలో నా పిల్లలందరిని ఒకే రోజు కోల్పోయ్యాను. నా business అంతా దెబ్బతిన్నాయి. నా health కూడా బాగా క్షిణించింది.. నేను మీకు తెల్సు.. నా పేరు యోబు. ✔ నా జీవితంలో కొన్ని ఆలోచింపజేసే విషయాలు మీతో పంచుకుంటాను. నాకు ఏమీ లోటులేకుండా దేవుడే అన్నీ అనుగ్రహించాడు. నేను ఆయనకు నమ్మకంగా జీవించాను. ఎల్లప్పుడూ బీదలను కనికరించాను. పవిత్రంగా జీవించాను. దేవుని విషయాల్లో నా పిల్లల్ని ఎల్లప్పుడూ హెచ్చరిస్తూ వచ్చాను. వారి కోసం రోజూ ప్రార్ధించాను. ఏమైందో తెలియదు. అకస్మాత్తుగా సంపదలన్నీ కోల్పోయ్యాను. అంతలోనే..నా పిల్లలందరూ చనిపోయ్యారనే వార్త నా హృదయాన్ని బద్దలుచేసింది. వారందరిని ఒకే రోజు, ఒకేసారి పాతిపెట్టాను. అప్పుడు నేను పడిన వేదనను పిల్లలు ఉన్న వారు బాగా అర్ధం చేసుకోగలరనుకుంటాను. అసలు ఏం జరుగుతుందో నాకు ఏమి అర్ధం కాలేదు. ✔ నాకు తెల్సిన సంగతి ఒక్కటే! నా ఆస్తిని నేనేమైనా చేసుకోగల హక్కు నాకు ఉన్నట్లే.. తన సృష్టంతటి పైనా(నాపై) ఆయనకు సర్వహక్కులు ఉంటాయి కదా! సర్వోన్నతుడు సమస్త జీవుల ఉనికికి మూల కారకుడు. మనం ఏమి అడగకుండానే అన్ని అనుగ్రహించిన వానికి, అన్ని తీసివేస...

18Sep2017

❇ సింహాసనం చుట్టూరా ఇరవై నాలుగు సింహాసనాలు ఉన్నాయి. వాటిమీద ఇరవై నలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు. వీరంతా తెల్లటి బట్టలు కట్టుకుని ఉన్నారు. వారి తలలపై బంగారు కిరీటాలున్నాయి...  ఆ ఇరవై నాలుగు మంది పెద్దలూ సింహాసనం పై కూర్చున్న వాని ముందు సాష్టాంగ పడి నమస్కారం చేస్తూ శాశ్వతంగా జీవిస్తున్న వాని ముందు సాష్టాంగ పడి ౼"ప్రభూ! నీవు సమస్తాన్ని సృజించావు. నీ ఇష్టప్రకారమే అవి ఉనికిలో వచ్చాయి, సృజించబడ్డాయి గనుక మహిమ, ఘనత, ప్రభావం పొందడానికి నీవే యోగ్యుడవు." అని చెప్తూ తమ కిరీటాల్ని ఆ సింహాసనం ముందు పడ వేశారు (ప్రకటన 4:4,10,11). దేవుని ముందర తమ సింహాసనాల మీద కూర్చుని ఉన్న ఆ ఇరవై నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఇలా అన్నారు౼"ప్రభువైన దేవా, అన్నిటి పైన పరిపాలకుడా! పూర్వం ఉండి ప్రస్తుతం ఉన్నవాడా..."(ప్రకటన 11:16). ❇ ✔ కొన్ని కోట్ల మంది విశ్వాసులు లోకం నుండి వేరై, దేవుని యందు విశ్వాసముంచి దేవుని పక్షంగా నిలిచారు. కానీ ప్రకటన గ్రంథంలో యోహాను ఇరవై నలుగురు పెద్దలను ప్రత్యేకంగా దేవుని సింహాసనం యెదుట చూశాడు. వారు కిరీటాలు ధరించి ఉన్నారు. యోహాను చూసిన ప్రతిసారి ఆ ఇర...

16Sep2017

★ యోసేపు రూపవంతుడు, సుందరుడు. కనుక కొంతకాలం గడిచాక అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి "నన్ను పొందు" అంది. కాని అతడు ఒప్పుకోలేదు.  యోసేపు౼"నేను ఈ పాపిష్ఠి కార్యం జరిగించి దేవునికి విరోధంగా ఎలా పాపం చేయగలను?" అన్నాడు. ★ ఏలీయా అహాబు రాజుతో౼ "నేను ఎవని సన్నిధిని నిలువబడి ఉన్నానో.." దేవుని సన్నిధిలో నిలిచివుండటం:  ✔ భక్తిగల కుటుంబంలో పుట్టడం ద్వారానో, భక్తిగల సంఘానికి, సహవాసానికి వెళ్లడం వల్లనో ఈ అనుభవం మనకు రాదు. వయస్సుతో,జ్ఞానంతో సంభంధం లేదు. మారుమనస్సు పొందడంతో ఈ దేవుని భంధం మొదలౌతుంది. మనం దేవుని ప్రేమను, క్షమాపణను ఎంత అర్ధం చేసుకుని కృతజ్ఞులుగా, ఆసక్తిపరులుగా, దేవుణ్ణి కోరుకునే వ్యక్తులుగా ఉంటామో ఆయన మరింత దగ్గరగా మనకు కనపర్చుకుంటాడు. దేవుని సన్నిధిలో నిలిచి ఉండటం అంటే వాక్యాలు వినటం, ప్రార్ధన చేసుకోవడం మాత్రమే అనుకోవద్దు. మనం నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ప్రతిక్షణం కూడా మన మనస్సు దేవుని మనస్సుతో కలుసుకొని ఉండటం. కొత్త నిబంధనలో దేవుని ఆత్మ మన హృదయాల్లోనే నివసిస్తున్నాడు గనుక ఆత్మలో నుండి దేవుడు మాట్లాడే స్వరాన్ని...

14Sep2017

❇ దేవుని మాటను బట్టి అబ్రాహాము..తన భార్యయైన హాగరును(ఐగుప్తు నుండి తేబడిన బానిస), వారి కుమారుడైన ఇస్మాయేలును పంపివేయడానికి తీర్మానించుకొన్నాడు. తెల్లవారగానే అబ్రాహాము లేచి రొట్టెనూ, నీళ్ళతో నిండిన తిత్తినీ హాగరుకు ఇచ్చి, ఆమె భుజం మీద పెట్టి, ఆ కుర్రవాణ్ణి కూడా ఆమెకు అప్పగించి ఆమెను పంపివేశాడు. ఆమె వెళ్ళిపోయి, బెయేర్షెబా ఎడారిలో తిరుగుతూ ఉంది. తిత్తిలో నీళ్ళు అయిపోయినప్పుడు ఆమె ఆ కుర్రవాణ్ణి ఒక పొద క్రింద విడిచిపెట్టింది. "ఆ కుర్రవాడి చావు నేను చూడలేను" అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుంది. అలా కూర్చుండి వెక్కి వెక్కి ఏడ్చింది. దేవుడు ఆ కుర్రవాడి మొర విన్నప్పుడు దేవుని దూత పరలోకం నుంచి హాగరును పిలిచి ఆమెతో౼"హాగరూ, నీకేం వచ్చింది? ఆ కుర్రవాడు ఉన్నచోట దేవుడు అతడి మొర విన్నాడు. గనుక భయం పెట్టుకోకు. లేచి ఆ కుర్రవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకో. అతణ్ణి గొప్ప జనంగా చేస్తాను" అన్నాడు. అప్పుడామెకు ఒక ఊట కనపడేలా దేవుడు చేశాడు. ఆమె వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి కుర్రవాడికి త్రాగించింది. ❇ ✔ హాగరు అబ్రాహాము దేవుణ్ని విశ్వసించింది. సుమారు 17 సం|| క్ర...

12Sep2017

❇ యేసు ఒక కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడ కూర్చున్నాడు. ఆయన తలెత్తి చూసినప్పుడు పెద్ద జన సమూహం తన వైపు రావడం కనిపించింది.  యేసు తన శిష్యుడైన ఫిలిప్పుతో౼"వీళ్ళంతా భోజనం చేయడానికి రొట్టెలు ఎక్కడ కొన బోతున్నాం?" అని అడిగాడు. (యేసుకు తాను ఏం చేయబోతున్నాడో స్పష్టంగా తెలుసు. కేవలం ఫిలిప్పును పరీక్షించడానికి అలా అడిగాడు) ఫిలిప్పు౼"రెండు వందల దేనారాలతో రొట్టెలు కొని తెచ్చినా ఒక్కొక్కడికి చిన్న ముక్క ఇవ్వడానికి కూడా చాలదు" అన్నాడు. (మరొక శిష్యుడైన) అంద్రెయ౼"ఇక్కడ ఒక చిన్న కుర్రాడి దగ్గర ఐదు యవల రొట్టెలూ, రెండు చిన్న చేపలూ ఉన్నాయి గాని ఇంత మందికి ఎలా సరిపోతాయి?" అని ఆయనతో అన్నాడు. యేసు౼"ప్రజలందర్నీ కూర్చోబెట్టండి" అని శిష్యులకు చెప్పాడు. అక్కడ చాలా పచ్చిక ఉండటంతో ఆ ప్రజలంతా కూర్చున్నారు. వాళ్ళంతా సుమారు ఐదు వేలమంది ఉంటారు. యేసు ఆ రొట్టెల్ని చేతిలో పట్టుకుని కృతజ్ఞతలు చెప్పి కూర్చున్న వారికి పంచి ఇచ్చాడు. అలాగే చేపలు కూడా వాళ్లకు ఇష్టమైనంత వడ్డించాడు. అందరూ కడుపు నిండా తిన్నారు. తర్వాత ఆయన౼"మిగిలిన రొట్టే, చేపల ముక్కలన్నీ పోగు చేయండి. ఏదీ వ్య...

09Sep2017

❇ మోషే సీనాయి పర్వతం మీద నలభై పగళ్ళూ నలభై రాత్రులూ దేవునితో ఉన్నాడు. ఆ సమయంలో కొండ క్రింద ఇశ్రాయేలు ప్రజలంతా వారి బంగారు వస్తువులను పోగుచేసి వాటిని అహరోను దగ్గరకు తెచ్చారు. వాటితో ఒక దూడ విగ్రహం చేసాడు. అప్పుడు ప్రజలు౼"ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తు నుండి మిమ్మల్ని బయటకు నడిపించింది ఈ దేవుడే" అన్నారు. అహరోను ఆ దూడ ఎదుట ఒక బలిపీఠం కట్టాడు౼"రేపు యెహోవాకు పండుగ జరుగుతుంది" అంటూ ప్రకటన చేశాడు. మరుసటి రోజు తెల్లవారుతుండగానే వారు లేచి హోమాలు సమర్పించారు. శాంతి బలులు తెచ్చారు. తరువాత ప్రజలు తింటూ త్రాగుతూ కూర్చున్నారు, లేచి ఆడారు. ప్రజలు విచ్చలవిడిగా తిరిగారు. దేవుని కోపం వారిపై రగులుకొన్నది. ❇ ✔ ప్రజలు యెహోవా పేరునే మ్రొక్కారు౼బలులు అర్పించారు. తర్వాత తమకు నచ్చినట్లు ఆడారు. వీరికి దేవుడు ఏం చెప్తున్నాడో, ఏం చెయ్యమంటున్నాడో పనిలేదు. ఒకవేళ దేవుని వాక్యం ఉన్నట్లేతే వాటిని సైతం వారి కోరికలకు తగినట్లు అన్వయించుకునే వారు. నేడు ఈ వైఖరి సంఘాల్లో, సహవాసాల్లో కనిపించట్లేదా? ప్రజలను భావోద్రేకాలతో (emotions) చేసే భక్తిని ప్రోత్సహించే అహరోను లాంటి నాయకులు ఎందరో ఉన్నారు. వారి మనసుకు ఉల్ల...

08Sep2017

❇ జలప్రళయం తర్వాత మానవులంతా ఒకే భాష మాట్లాడేవారు. మనుషులు తూర్పు దిక్కునుండి బయలుదేరి, షీనారు దేశంలో మైదాన భూమిని వారు కనుగొని అక్కడే స్థిరపడి పోయారు. అప్పటి నుంచే ఇళ్లు కట్టుటకు ప్రజలు రాళ్లు కాకుండా ఇటుకలనే ఉపయోగించారు. అలానే అడుసు గాక తారును ఉపయోగించారు. అప్పుడు మనుషులు౼“మనం భూమి అంతటా చెదరిపోకుండేలా ఒక నగరాన్ని కట్టుకుందాం. ఆకాశన్నంటే గోపురం కట్టి మనం పేరు తెచ్చుకుందాం” అని అనుకున్నారు. ఆ పట్టణాన్ని, ఆ గోపుర శిఖరాన్ని చూచుటకు యెహోవా దిగి వచ్చాడు. వాటిని ప్రజలు నిర్మిస్తూ ఉండటం యెహోవా చూశాడు. అది ఆయన ఉద్దేశ్యాలకు వ్యతిరేకంగా ఉంది, కనుక వారి భాషలను తారుమారు చేశాడు. కాబట్టి వాళ్లు ఒకరు మాట్లాడేది ఒకరు అర్థం చేసుకోలేకపోయ్యారు. కనుక ఆ పట్టణాన్ని కట్టుకోవటం ప్రజలు ఆపివేసి, భూమిమీద ఇతర చోట్లన్నింటికీ చెదరిపోయ్యారు.ఆవిధంగా మనుషులు భూమి అంతటా చెదిరిపోయేటట్టు యెహోవా చేసాడు. దేవుడు వారి భాషను తారుమారు చేసినందు చేత ఆ నగరానికి "బాబెలు" అనే పేరు వచ్చింది. ❇ జలప్రళయం తర్వాత దేవుడు నోవహునూ, అతని కొడుకులనూ దీవించి వారితో౼"ఫలిస్తూ సంఖ్యలో అధికం కండి. భూలోకం నిండా విస్తరించండి...

06Sep2017

❇ యూదుల మహా సభలో అరిమతయియ యోసేపు అనే మంచివాడు, నీతిపరుడైన వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఇతడు యూదులకు భయపడి రహస్యంగా యేసును వెంబడించిన శిష్యుడుగా ఉన్నాడు. ఇతను దేవుని రాజ్యం రావాలని ఎదురు చూస్తూ ఉండే వ్యక్తి. యేసును చంపాలని మహాసభ చేసిన తీర్మానానికి ఇతడు సమ్మతించలేదు. యేసు సిలువపై చనిపోయినప్పుడు..తెగించి ధైర్యంగా పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు.పిలాతు అందుకు ఒప్పుకున్నాడు. కాబట్టి యేసు శరీరాన్ని సిలువ పైనుండి దించి, శుభ్రమైన నారబట్టతో చుట్టి, తాను రాతిలో తొలిపించుకొన్న తన కొత్త సమాధిలో ఆయన్ని ఉంచాడు. మొదట్లో రాత్రి సమయంలో ఆయన దగ్గరకు వచ్చిన నికోదేము కూడా ఇంచుమించు ముప్పై ఐదు కిలోల బోళం, అగరుల మిశ్రమం తనతో తీసుకొని వచ్చాడు.వాళ్ళు సుగంధ ధ్రవ్యాలతో, ఆ నార బట్టలతో యేసు దేహానికి చుట్టారు. తరువాత వారుపెద్ద రాయితో సమాధి ద్వారాన్ని మూసివేసి వెళ్లిపోయారు. ❇ ✔ యేసు బ్రతికి ఉన్న రోజుల్లో గుంపులు గుంపులుగా జనసమూహం ఎప్పుడూ ఆయన వెంట ఉండేవారు. ఆయన్నుండి స్వస్థతలు, అద్భుతాలు, భోధలు వంటి ఎన్నో మేలులు క్రీస్తు నుండి పొందుకున్నారు. ఆయన చనిపోయి తర్వాత నిశ్చేస్టూనిగా ఉన్నప్పుడు, ఆ గుం...

05Sep2015

❇ యేసు ఒక కథ చెప్పాడు.. "ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతడు పెద్ద కొడుకుతో౼ 'బాబూ, నీవు పోయి ఈ రోజు ద్రాక్షతోటలో పని చెయ్యి' అన్నాడు. అతడు౼'నేను వెళ్ళను' అని జవాబిచ్చాడు. కాని తరువాత మనస్సు మార్చుకొని వెళ్ళాడు. తండ్రి రెండోవాని దగ్గరకు వెళ్ళి అదేమాట చెప్పాడు. అతడు౼‘వెళ్తాను నాన్నగారు’ అన్నాడు గాని వెళ్ళలేదు" 'ఈ ఇద్దరిలో ఎవరు ఆ తండ్రి ఇష్టప్రకారం చేసినట్టు?' అని వారిని అడిగాడు. ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు౼"మొదటివాడే" అని జవాబిచ్చారు. యేసు౼"నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, అన్యాయంగా పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు మీకంటె ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ప్రవక్తయైన యోహాను నీతి మార్గంలో మీ దగ్గరకు వచ్చాడు గానీ అతణ్ణి మీరు నమ్మలేదు. అయితే పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు నమ్మారు. దాన్ని చూసైనా మీరు పశ్చాత్తాపపడి అతనిని నమ్మలేదు . ❇ ✔ గమనిస్తే మొదటి వాని మాటల్లో తండ్రి పట్ల గౌరవం లేదు. తిరుగుబాటు స్వరం, తన ఇష్టానుసారంగా ప్రవర్తన కనిపిస్తుంది. కాని ద్వేషించినా, తిరుగుబాటు చేసినా దాపరికం లేదు. వానిలో లోపట బయట ఒకే వ్యక్తి కనిపిస్తాడ...

04Sep2017

✔ దేవుణ్ని తెలుసుకోవడం అంటే వాక్యాలను, దాని మూలాలను (information), వివిధమైన పుస్తకాలను (refer చేసి) చదివి తెలుసుకోవడం కాదు. అదే నిజమైతే..చదువుకోని వారు,(ఈ లోక) జ్ఞానం లేని వారి విషయంలో దేవుడు అన్యాయస్తుడుగా ఉంటాడు. దేవుణ్ని తెలుసుకునే విధానం ఖచ్చితంగా జ్ఞాని౼అజ్ఞాని, చదువుకున్నా౼చదువు లేకున్నా, బీద౼ధనిక తేడా లేకుండా దేవుని తెల్సుకోగలిగేలా ఉండే విధానాన్నే దేవుడు ఎంచుకుంటాడు అనేది సుస్పష్టం. అది ఎలాగంటే..మన జీవితాల్లో ఆయన స్వభావాన్ని, ఆయన ప్రమేయాన్ని దగ్గర నుండి అనుభవాల గుండా తెలుసుకోవడం. ◆ మారు మూల పల్లెటూరులోని, ఏమాత్రం చదువులేని, బైబిల్లో వాక్యాలేమీ చదవలేని ఒక ముసలివాడైన వ్యక్తి దేవుణ్ని తెల్సుకొని ఉండి ఉండొచ్చు. అలాంటి వ్యక్తులకి దేవుణ్ని ఒక వ్యక్తిలాగా ప్రేమించడం మాత్రమే తెల్సు. దేవుణ్ని కన్న తండ్రిలాగా భావించడం తెల్సు. విన్న కొద్ది మాటలు విశ్వాసముంచి నమ్మకంగా దేవుణ్ని సేవించడం మాత్రమే వారికి తెల్సు. ఇలాంటి వారికి అత్యంత చేరువలో దేవుడు ఉంటాడు అనడంలో సందేహం లేదు. ◆ మరొక వ్యక్తి బైబిల్ యూనివర్సిటీలో పండితుడై, అక్కడ ఉన్నవారందరిలో జ్ఞానవతుడై ఉండొచ్చు కానీ దేవుణ్ని వ్యక్తిగతంగా తెల్...

02Sep2017

❇ ఇశ్రాయేలు జాతి ఐగుప్తుకు సుమారు 400 సం|| బానిసలుగా ఉన్నారు. వారిని బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు మోషే. అనేక అద్భుతాలు (విపత్తుల) ద్వారా ఐగుప్తును దేవుడు మొత్తి, తన ప్రజలను విడిచిపెట్టమని మోషే ద్వారా పలుకగా,ఫరో తన మనస్సును కఠిన పర్చుకున్నాడు కాని విడువలేదు.చివరి విపత్తుకు ముందు ఫరో మళ్లీ మోషేను పిలిపించి౼"మీరు వెళ్లి దేవుణ్ణి ఆరాధించండి. మీ పిల్లలు మీతో కూడా వెళ్ళవచ్చు. కాని మీ గొర్రెల్ని, పశువుల్ని మాత్రం ఇక్కడ విడిచి పెట్టిండి" అన్నాడు. మోషే౼"మా దేవునికి బలి అర్పించడానికి, ఆరాధించడానికి మాకు పశువులు కావాలి. కాబట్టి అలా కాదు. మా పశువులు కూడా మాతోపాటు రావాలి. ఒక్క డెక్క కూడ ఇక్కడ విడిచి మేము విడిచిపెట్టము" అన్నాడు. ❇ ✔ పాత నిబంధనలోని విషయాలు క్రొత్త నిబంధనలో ఉన్న మనకు ఆత్మీయ వర్ణనగా చూపబడతాయి. వారి బానిసత్వం నేడు సాతాను వేసిన (పాపపు బానిసత్వ) సంకేళ్ళకు, శరీర కోర్కెలకు గుర్తుగా ఉన్నాయి. మనలోని ప్రతి ఒక్కరం వివిధ రకాల పాపాలకు బానిసలుగా ఉన్నాము. ఇప్పటికీ వాటిలోని కొన్ని విషయాల ముందు మనం శక్తిహీనులుగా ఉన్నాము. ✔ బయట ప్రజలు నీ గ...

01Sep2017

❇ దేవుడు యోహానుకు ఈ లోక అంతంలో జరగబోయ్యే సంగతులను ముందుగానే చూపాడు. వాటిలో ఒక సంఘటన. యోహాను౼"లోక రక్షకుడు అయిదో ముద్రను విప్పినప్పుడు దేవుని సందేశాన్ని బోధించటాన్ని బట్టీ, తమ సాక్ష్యాన్ని బట్టీ హతమైన వారి ఆత్మలను ఒక బలిపీఠం క్రింద ఉండడం నేను చూశాను. వారు పెద్ద స్వరంతో ౼'సర్వాధికారీ, పరిశుద్ధుడా, సత్యస్వరూపీ, ఎంతకాలం ఇలా తీర్పు తీర్చకుండా ఉంటావు? మా రక్తానికి ప్రతిగా భూమిపై ఉన్న వారిని శిక్షించకుండా ఎంతకాలం ఉంటావు?' అని పలికారు. అప్పుడు వారిలో ప్రతి ఒక్కరికీ ఒక తెల్లటి వస్త్రం యివ్వబడింది. 'మీరు చంపబడినట్లే, మీ తోటి సేవకులు, సోదరులు చంపబడతారు. వారి లెక్క మొత్తం పూర్తి అయ్యేంతవరకూ ఇంకా కొంత సమయం వేచి ఉండాలి' అని వారికి చెప్పడం జరిగింది" (ప్రకటన 6:9-11) ❇ ✔ నీతిమంతులు హింసించబడ్డారు, చంపబడ్డారు..ఇప్పటికీ భాధింపబడుతూ, చంపబడుతూ ఉన్నారు. దేవుని భయంలేని దుష్టులకు, వారి పనులకు అడ్డుఅదుపు లేకుండా ఉన్నప్పటికీ, అన్యాయమే గెలుస్తున్నట్లు మనకు కనిపిస్తున్నప్పటికి, వారి చేతిలోనే సమస్తం ఉన్నదనట్లు మనకు అనిపిస్తున్నప్పుడు.. మన మనస్సుల్లో మెదిలే ప్రశ్నలకు సమాధానం ఇదే!...