నేను ఒక వ్యాపారవేత్తను..విశ్వాసిని! ఒక accidentలో నా పిల్లలందరిని ఒకే రోజు కోల్పోయ్యాను. నా business అంతా దెబ్బతిన్నాయి. నా health కూడా బాగా క్షిణించింది.. నేను మీకు తెల్సు.. నా పేరు యోబు.
✔ నా జీవితంలో కొన్ని ఆలోచింపజేసే విషయాలు మీతో పంచుకుంటాను. నాకు ఏమీ లోటులేకుండా దేవుడే అన్నీ అనుగ్రహించాడు. నేను ఆయనకు నమ్మకంగా జీవించాను. ఎల్లప్పుడూ బీదలను కనికరించాను. పవిత్రంగా జీవించాను. దేవుని విషయాల్లో నా పిల్లల్ని ఎల్లప్పుడూ హెచ్చరిస్తూ వచ్చాను. వారి కోసం రోజూ ప్రార్ధించాను. ఏమైందో తెలియదు. అకస్మాత్తుగా సంపదలన్నీ కోల్పోయ్యాను. అంతలోనే..నా పిల్లలందరూ చనిపోయ్యారనే వార్త నా హృదయాన్ని బద్దలుచేసింది. వారందరిని ఒకే రోజు, ఒకేసారి పాతిపెట్టాను. అప్పుడు నేను పడిన వేదనను పిల్లలు ఉన్న వారు బాగా అర్ధం చేసుకోగలరనుకుంటాను. అసలు ఏం జరుగుతుందో నాకు ఏమి అర్ధం కాలేదు.
✔ నాకు తెల్సిన సంగతి ఒక్కటే! నా ఆస్తిని నేనేమైనా చేసుకోగల హక్కు నాకు ఉన్నట్లే.. తన సృష్టంతటి పైనా(నాపై) ఆయనకు సర్వహక్కులు ఉంటాయి కదా! సర్వోన్నతుడు సమస్త జీవుల ఉనికికి మూల కారకుడు. మనం ఏమి అడగకుండానే అన్ని అనుగ్రహించిన వానికి, అన్ని తీసివేసుకోవటానికి కూడా ఆయన అర్హత ఉంటుంది! ఐనా దేవుడు చేసే ప్రతి పని వెనుక ఒక అర్ధం ఉంటుంది. భవిష్యత్ తెలియని, పరిమిమైన జ్ఞానం కలిగిన నరుణ్ణి నేను..అనంతుడైన వాని జ్ఞానాన్ని నేనేం అర్ధం చేసుకోగలను? దేవుడే అందరికి అన్నీ ఇచ్చేవాడు. ఆయనే తిరిగి తీసుకోగలిగిన హక్కు ఉన్నవాడు. ఒకటి మాత్రం అర్ధం చేసుకోగలను! ఆయన ఎల్లప్పుడూ మంచివాడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. ఆయన్ను అలా సంపూర్ణంగా నమ్మడంలోనే నీతి ఉంది.
✔ కొన్ని రోజుల తర్వాత ఉన్నటుండి భాధకరమైన కురుపులు నా ఒళ్లంతా వచ్చాయి. దురదలకు తట్టుకోలేక చిల్ల పెంకుతో ఒళ్లంతా గోకున్నాను.
ఒకప్పుడు ఇల్లంతా కళకళలాడేది. కానీ నేడు ఎవ్వరూ లేరు. డబ్బు లేకపొయ్యే సరికి సేవకులు వదిలిపోయారు. నా భార్య దేవుణ్ని తిట్టి చనిపోమని సలహా ఇచ్చింది. కానీ నేను ఒప్పోకోలేదు. అన్నీ దేవుడు ఇచ్చినప్పుడు ఆనందంగా దేవుణ్ని కొనియాడాను. ఇప్పుడు కష్టం వచ్చిందని నేడు దేవుణ్ని తిట్టాలా? ఎంత బుద్ధిహీనం! నా దృష్టిలో అది నిజమైన భక్తి కాదు. అలాంటి సమయంలో నా మిత్రులు సైతం నన్ను నిందించారు. ఏం జరుగుతుందో అర్థం కాని సమయంలో ఆయన్ను నమ్మి, నా హృదయంలో ప్రతి ఆలోచనను దాచుకోకుండా ఆయనతోనే పంచుకున్నాను.
✔ కొన్ని రోజుల తర్వాత నా శ్రమకు కారణం తెల్సింది. ఇది దేవునిపై నా నమ్మకత్వానికి పరీక్ష అని. శ్రమలో నేను ఆయన పాదాలు విడువలేదు. మరియెక్కువ ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నాను. ఆయన సేవకున్నైనా నన్ను ఆయన మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఎప్పటికీ, ఎంతైనా నమ్మదగిన వాడే! ఇలా శ్రమలో దేవుని చిత్తం గూర్చి నాతో ఎవరూ చెప్పలేదు. నేడు నా జీవితం మీ అందరికి ఆత్మీయ పాఠంగా మారాలని నా జీవితం-ఆయన నమ్మకత్వాలను ఆయన గ్రంథంలో లిఖించాడు.నేను సత్యమే చెప్తున్నాను.. ఆయన ఎల్లప్పుడూ మంచి వాడు. ఎన్నడూ చెయ్యి విడువని వాడు.నేను నడిచిన దేవునితోనే నేడు నీవూ నడుస్తున్నావు..ఇది మీ సమయం..మీరు ఆయన్ను తెలుసుకొనే సమయం..
Comments
Post a Comment