Skip to main content

18Sep2017

❇ సింహాసనం చుట్టూరా ఇరవై నాలుగు సింహాసనాలు ఉన్నాయి. వాటిమీద ఇరవై నలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు. వీరంతా తెల్లటి బట్టలు కట్టుకుని ఉన్నారు. వారి తలలపై బంగారు కిరీటాలున్నాయి...
 ఆ ఇరవై నాలుగు మంది పెద్దలూ సింహాసనం పై కూర్చున్న వాని ముందు సాష్టాంగ పడి నమస్కారం చేస్తూ శాశ్వతంగా జీవిస్తున్న వాని ముందు సాష్టాంగ పడి ౼"ప్రభూ! నీవు సమస్తాన్ని సృజించావు. నీ ఇష్టప్రకారమే అవి ఉనికిలో వచ్చాయి, సృజించబడ్డాయి గనుక మహిమ, ఘనత, ప్రభావం పొందడానికి నీవే యోగ్యుడవు." అని చెప్తూ తమ కిరీటాల్ని ఆ సింహాసనం ముందు పడ వేశారు (ప్రకటన 4:4,10,11).

దేవుని ముందర తమ సింహాసనాల మీద కూర్చుని ఉన్న ఆ ఇరవై నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఇలా అన్నారు౼"ప్రభువైన దేవా, అన్నిటి పైన పరిపాలకుడా! పూర్వం ఉండి ప్రస్తుతం ఉన్నవాడా..."(ప్రకటన 11:16). ❇

✔ కొన్ని కోట్ల మంది విశ్వాసులు లోకం నుండి వేరై, దేవుని యందు విశ్వాసముంచి దేవుని పక్షంగా నిలిచారు. కానీ ప్రకటన గ్రంథంలో యోహాను ఇరవై నలుగురు పెద్దలను ప్రత్యేకంగా దేవుని సింహాసనం యెదుట చూశాడు. వారు కిరీటాలు ధరించి ఉన్నారు. యోహాను చూసిన ప్రతిసారి ఆ ఇరవై నలుగురు పెద్దలు దేవుణ్ని ఆరాధించినట్లు వ్రాయబడింది(ప్రకటన 5:8-9, 19:4). వీరు ఎందుకని దేవునికి ప్రత్యేకులయ్యారు?
నేను నమ్ముతున్నాను, వారు భూమిపై ఉన్నప్పుడు ఏమి చేశారో పరలోకంలో కూడా అదే చేస్తున్నారు. వారు దేవున్ని నిత్యం ఆరాధించిన వారు. అంటే రోజు ఎక్కువ సమయం 
"స్తుతి-స్తుతి-స్తుతి, హల్లెలుయా-హల్లెలుయా-హల్లెలుయా స్తోత్రం-స్తోత్రం-స్తోత్రం" అని పలికేవారా? ఖచ్చితంగా కాదు.
లేక బైబిల్లోని దేవుని లక్షణాలను(కొన్ని స్తుతి పుస్తకాలను), స్తోత్రాలుగా వల్లె వేసేవారా? కాదు.
అలా చేసే వారు భక్తిపరులుగా ఉంటారని భ్రమపడకండి. ఆరాధన అంటే అది కాదు. బైబిల్లో అబ్రాహాము గొప్ప ఆరాధికునిగా కనిపిస్తాడు. ఆయన వెళ్లిన ప్రతిచోటా ఒక బలిపీఠం కట్టి దేవుణ్ని ఆరాధించాడు. అలా చేసిన ప్రతిసారి దేవుని లక్షణము ఒకటి తన జీవితంలో అనుభవపూర్వకంగా తెల్సుకొని ఆరాధించాడు. ఆరాధన జీవితంలో నుండి, హృదయాంతరంగాల్లో నుండి దేవుణ్ని రుచి చూసినప్పుడు అనురాగ పూర్వకంగా వచ్చే మాటలు. 

✔ దాని తేడాను నీవ్వే గమనించగలవు. నీవేప్పుడైన విశ్వాసంతో దేవుణ్ణి (కనుపర్చుకోమని, నేర్పించమని, విడిపించమని)  ఏదైన విషయంలో ప్రార్ధించావా?అప్పుడు దేవుని గొప్ప హస్తం నిన్ను ఆదుకొన్నప్పుడు/ఆదరించినప్పుడు/నేర్పించినప్పుడు.. ఆయన నిన్ను చూస్తూ, నీకు దగ్గరగా ఉన్న అనుభూతి నీకు కలుగుతుంది. వాక్యంలోని దేవుణ్ణి నీ జీవితంలో దగ్గర నుండి అనుభవాల ద్వారా చూసినప్పుడు నీ హృదయం స్తుతితో, ఆరాధన భావంతో నిండిపోతుంది. అప్పుడు హృదయపూర్వకంగా దేవునికి చేసిన ఆరాధనకు(స్తుతికి), మిగితా సమయంలో పలికే మాటలకు తేడా గమనించండి. దేవుడు కోరుకునే ఆరాధన సత్యంతో, ఆత్మలో నుండి పలికే మాటలు.(బైబిల్లోని దేవుని స్వభావం గూర్చి మనం విన్నప్పుడు మనం ఆరాధించడాన్ని నేను చులకన చేయట్లేదు కానీ అది మన జీవితంలో ఒక అనుభవంగా మారాలనే కోరిక మనకుండాలని మాత్రమే చెప్తున్నాను. వట్టి మాటలుగా మిగిలిపోకూడదు). బైబిల్లోని విశ్వాసులు వారి పితరులతో నడచిన దేవుణ్ని కొనియాడారు..అలాగే అదే దేవునితో వారికి కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి. వాటిని బట్టి కూడా వారు దేవుణ్ని ఆరాధించారు. నేడు మనం కూడా అలాగే ఉండాలి.వాక్యంలోని మాటలతో ఆగిపోకూడదు. నీకు దేవుని అనుభవాలు ఉండాలి.
నిజమైన ఆరాధికులు జీవితంతో, వారి అనుభవాల ద్వారా, నిందలో, శ్రమలో, లేమితో, సంతోషంలో అన్ని సమయాల్లో ఎల్లప్పుడూ ఆరాధికులుగానే ఉంటారు. వారు దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వారు 

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...