Skip to main content

16Sep2017

★ యోసేపు రూపవంతుడు, సుందరుడు. కనుక కొంతకాలం గడిచాక అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి "నన్ను పొందు" అంది. కాని అతడు ఒప్పుకోలేదు. 
యోసేపు౼"నేను ఈ పాపిష్ఠి కార్యం జరిగించి దేవునికి విరోధంగా ఎలా పాపం చేయగలను?" అన్నాడు.

★ ఏలీయా అహాబు రాజుతో౼ "నేను ఎవని సన్నిధిని నిలువబడి ఉన్నానో.."

దేవుని సన్నిధిలో నిలిచివుండటం: 
✔ భక్తిగల కుటుంబంలో పుట్టడం ద్వారానో, భక్తిగల సంఘానికి, సహవాసానికి వెళ్లడం వల్లనో ఈ అనుభవం మనకు రాదు. వయస్సుతో,జ్ఞానంతో సంభంధం లేదు. మారుమనస్సు పొందడంతో ఈ దేవుని భంధం మొదలౌతుంది. మనం దేవుని ప్రేమను, క్షమాపణను ఎంత అర్ధం చేసుకుని కృతజ్ఞులుగా, ఆసక్తిపరులుగా, దేవుణ్ణి కోరుకునే వ్యక్తులుగా ఉంటామో ఆయన మరింత దగ్గరగా మనకు కనపర్చుకుంటాడు. దేవుని సన్నిధిలో నిలిచి ఉండటం అంటే వాక్యాలు వినటం, ప్రార్ధన చేసుకోవడం మాత్రమే అనుకోవద్దు. మనం నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ప్రతిక్షణం కూడా మన మనస్సు దేవుని మనస్సుతో కలుసుకొని ఉండటం. కొత్త నిబంధనలో దేవుని ఆత్మ మన హృదయాల్లోనే నివసిస్తున్నాడు గనుక ఆత్మలో నుండి దేవుడు మాట్లాడే స్వరాన్ని మనం గుర్తించాలి. తప్పు చేస్తున్నప్పుడు ఆయన గద్దింపును, దేవుని స్వభావాన్ని అర్ధం చేసుకుంటున్నప్పుడు ఆత్మలో ఆరాధించడం, ఏమి చెయ్యాలో అర్ధంకాని పరిస్థితుల్లో(వాక్యం ద్వారా)ఆత్మలో నడిపింపు,ఆయనలో ఆదరణ ఇలా ఎన్నో విధాలుగా దేవుని సహవాసాన్ని నిత్యం అనుభవించగలం. దేవునితో ఒక ప్రత్యేక అనుబంధాన్ని మనం కలిగి ఉండాలి. ఒక భార్య౼భర్తకి, ప్రాణస్నేహితునికి మధ్య ఉండే అత్యంత దగ్గరగా ఉండే సన్నిహిత్యాన్ని దేవునితో కలిగి ఉండాలి.అన్ని బంధాలకంటే కూడా విలువైనదిగా మనం ఎంచుకోవాలి. ఆ భంధాన్ని ఎవరూ గుర్తించలేక పోవచ్చు, నిజానికి ఎవరికి తెలియకపోవచ్చు. నీకు౼నీ దేవునికి మధ్య కొనసాగే ఒక (రహస్య అనుబంధం) అనుభవం అది. ఇది నిజంగా సాధ్యమేనా! అని మీలో కొందరు ఆశ్చర్యపోవచ్చు. ఇది సాధ్యమే! దేవుడు మనిషితో(నీతో) అలాంటి బంధాన్నే కోరుతున్నాడు. ఇదే దేవున్ని ముందు పెట్టుకుని జీవించే జీవితం. యేసేపు ఇలానే జీవించాడు. ఆ దినాల్లో వాక్యం వ్రాయబడలేదు. కానీ దేవునితో నేరుగా(direct) ఉన్న బంధం మాత్రమే ఉండేది. దేవుణ్ణి మరి ఎక్కువగా అర్ధం చేసుకుని, సహవాసం చేయడానికి నేడు మనకు సంపూర్ణగా దైవ వాక్యం ఇవ్వబడింది. ఆయన ఆత్మ హృదయాల్లో అనుగ్రహించ బడినాడు. ఎందరో భక్తుల జీవిత అనుభవాలు పాఠాలు ఉన్నాయి. ఇప్పుడు మరెంతో శ్రేష్ఠమైన జీవితంలోకి మనం ప్రవేశించాల్సివుంది! కానీ మనం నేడు అలా లేము.ఇవేమీ లేని వారే మన కంటే ఎంతో శ్రేష్ఠమైన ఆత్మీయ జీవితాన్ని జీవించినట్లు కనిపిస్తుంది.

✔ నేను గమనించిన విషయం ఇదే!ఏ తరంలో వారైన దేవున్ని కాకుండా లోకాన్ని హత్తుకొని జీవించే వారిలో దేవుని ప్రేమ/సంపూర్ణ జీవం/విశ్వాసికి దేవుడిచ్చే పరిపూర్ణ ఆనందం వారి హృదయాల్లో నివసించలేదు. క్రొత్తనిబంధన లోనైన, పాత నిబంధనలోనైన ఇలాంటి వారిలో దేవుని వాక్యజ్ఞానం (scriptures), దేవుని ఆత్మ ఉన్నా, లేకపోయిన పెద్ద తేడా కనిపించదు. వారి జీవితాల్లో దేవుడు చేసే హృదయ పరివర్తన జరుగదు.

✔ నీ పాత స్వభావం నుండి, దేవుడు నిన్ను రక్షించడానికి అధికారం అప్పగిస్తున్నవా?మారుమనస్సు పొంది ఎన్ని సంవత్సరాలు గడిచింది? నీ అంతరగంలో నుండి దేవుడు విడిపించిన పాపాలు ఏవి? ధరించుకున్న క్రీస్తు స్వభావమెంత? ఈ పని నీలో నిలిచిపోయి ఎన్ని సంవత్సరాలు గడిచాయి? పాతజీవితంలో మనుష్యుల ముందు ఉన్న మంచితనంతోనే (దేవుడు లేకుండా) జీవిస్తున్నవా? తిరిగి మారుమనస్సు పొందు! దేవుని సముఖంలో నిత్యం నిలిచి ఉండు.అలా నీవున్నప్పుడు అనేకులు వెలిగిస్తావు. యదార్ధవంతులకు మాదిరిగా, నిరీక్షణగా ఉంటావు. పరిచర్యను బట్టి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ప్రభువు వచ్చినప్పుడు మత్తయి 7:22,23 లో చెప్పిన మాటలు నీవు వినాలనుకుంటున్నావా? దేవునికి మొదట నువ్వు కావాలి! నీవు యదార్ధవంతుడవై ఆలోచించాలని ప్రభువు పేరిట బ్రతిమాలుతున్నాను.

✔ ఇలా యేసేపు ప్రతి రోజు(ప్రతి క్షణం) దేవుని సన్నిధిలో, ఆయన స్నేహంలో నివసించే వ్యక్తి. కనుకనే అనుదిన శోధన నుండి పారిపోయి జయించగలిగాడు.అలా జరిగిన ప్రతిసారి  అతను దేవునితో౼'ఈ పాపం కంటే, నీవంటేనే నాకు ఇష్టం దేవా!' తెలియజేస్తున్నాడు. దీని ఫలితంగా దేవుని సహవాసంలో మన శరీర-ఆత్మలపై ఆయన పరిపాలన జరిగి, దినదినం మనలో దైవ స్వభావం రూపాంతరం జరుగుతుంది.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...